Take a fresh look at your lifestyle.

దేశంలో తగ్గిన కొరోనా కొత్త కేసులు

తాజాగా 38,948 మందికి పాజిటివ్‌..219 ‌మంది మృతి
దేశంలో కొరోనా రోజువారీ కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా ఆదివారం 38,948 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,30,27,621కు చేరింది. ఇందులో 4,04,874 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,21,81,995 మంది బాధితులు కోలుకున్నారు. మరో 4,40,752 మంది వైరస్‌ ‌వల్ల మరణించారు. ఇక కొరోనా నుంచి 43,903 మంది కోలుకోగా, 219 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

అదేవిధంగా తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క కేరళలోనే 26,701 పాజిటివ్‌ ‌కేసులు ఉన్నాయని, 74 మంది మరణించారని తెలిపింది. కాగా, దేశవ్యాప్తంగా 68,75,41,762 కొరోనా టీకా డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 5 ‌వరకు 53,14,68,867 నమూనాలకు కొరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్‌) ‌ప్రకటించింది. ఇందులో ఆదివారం 14,10,649 మందికి పరీక్షలు చేశామని తెలిపింది.

Leave a Reply