Take a fresh look at your lifestyle.

తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కొరోనా కేసులు

వరదలతో అప్రమత్తం అయిన ఆరోగ్య శాఖ
‌తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా కొరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,486 కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ ‌బులిటెన్‌ని విడుదల చేసింది. మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,24,545కి చేరింది. కొరోనా బారి నుంచి సోమవారం ఒక్క రోజే 1,891 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,02,577కి చేరింది. అలాగే సోమవారం ఒక్కరోజే కొరోనాతో ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,282కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,686 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయని, వారిలో 17,208 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కొరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 38,98,829కి చేరింది. ఇదిలావుంటే వరదలు, కొరోనాపై పరిస్థితులపై ఆరోగ్యశాఖ అప్రమత్తం అయింది. ఈ మేరకు కోఠిలో ఆరోగ్య శాఖ ‌కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కొరోనా, వరదలు రెండు సమస్యలు ఉన్నాయని దీంతో నగరం చుట్టూ పక్కల ప్రాంతాలు ప్రభావితం అవుతున్నా యని హెల్త్ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాస్‌ ‌రావు పేర్కొన్నారు.

ఏడెనిమిది నెలలుగా 0.57 శాతం డెత్‌ ‌రేట్‌.. ‌సుమారు 90 శాతం రికవరీ రేట్‌..22 ‌వేల కొరోనా యాక్టివ్‌ ‌కేసులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. అందులో 4 వేల మంది హాస్పిటల్స్‌లో ఉన్నారని..38 లక్షల పైగా టెస్ట్ ‌లు చేసామని వెల్లడించారు. రాష్ట్రంలో ఇతర జిల్లాలో పండగ వాతావరణం ఎక్కువ అని తెలిపారు. రాష్ట్రంలో 15 వందల కంటే తక్కువగా కేసులు వస్తున్నాయని పేర్కొన్నారు. డిసెంబర్‌ ‌వరకు కీలకమైన రోజులని..షాపింగ్‌, ఇతర ప్రాంతాలకు వెళ్లడం, పండుగ చేసుకోవడం… వీటి ద్వారా ఎక్కువగా వైరస్‌ ‌వ్యాప్తి అవుతుందని తెలిపారు. లక్షణాలు లేని వాళ్ళ వల్ల కొరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందన్నారు. దీనికి కేరళ, ఢిల్లీ ప్రత్యేక్ష సాక్ష్యమన్నారు. కేరళలో జరిగిన ఓనమ్‌ ‌పెస్టివల్‌ ‌వల్ల 10 వేల కేసులు పెరిగాయని..పండుగ చేసుకోవద్దని చెప్పడం లేదు.. కుటుంబ సభ్యులతో చేసుకోండి అని పేర్కొన్నారు. చలికాలం అన్ని వైరస్‌లకు అనువైన కాలం అని హెచ్చరించారు. కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ఎప్పు‌డొస్తుందో తెలీదు.. వచ్చినా ఎంత వరకు ఎఫెక్ట్ ‌చూపిస్తుందో తెలీదని పేర్కొన్నారు. అందుకే స్పెషల్‌ ‌క్యాంపెయిన్‌ ‌ను ప్రారంభించామని..సోషల్‌ మీడియా, రేడియోలలో ప్రకటనలు ఇస్తున్నామన్నారు. ఆరోగ్య శాఖ కూడా పని చేస్తోందని..నీళ్లు, ఆహారం, దోమల వల్ల వచ్చే జబ్బులు అరికట్టడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

దేశంలో తగ్గుతున్న పాజిటివ్‌ ‌కేసులు
అయినా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
భారత్‌లో కొరోనా వైరస్‌ ‌పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 46,791 మందికి మాత్రమే వైరస్‌ ‌సంక్రమించింది. 24గంటల్లోనే మరణించిన వారిలో 587 మంది ఉన్నారు. అయితే గత మూడు నెలల నుంచి దేశవ్యాప్తంగా కొరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 50 వేల మార్క్‌ను దాటింది. మూడు నెలల తర్వాత తొలిసారి 50 వేల లోపు వైరస్‌ ‌కేసులు నమోదు అయ్యాయి. వచ్చే ఫిబ్రవరి నాటికి 40 వేల కేసులు మాత్రమే ఉంటాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ ‌వెల్లడించిన విషయం తెలిసిందే. దేశంలో మొత్తం కొరోనా కేసుల సంఖ్య 75,97,064కి చేరుకున్నది. దీంట్లో యాక్టివ్‌ ‌కేసులు 7,48,538 ఉన్నాయి. డిశ్చార్జ్ అయిన వారిలో 67,33,329 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వైరస్‌ ‌వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,15,197గా నమోదు అయ్యింది. జూలై తర్వాత తొలిసారి దేశంలో పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 50 వేల లోపు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. కోవిడ్‌19 ‌రోగుల్లో 80 శాతం మందికి కొరోనా లక్షణాలు తీవ్ర స్థాయిలో నమోదు కావడం లేదని ప్రభుత్వం పేర్కొన్నది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply