Take a fresh look at your lifestyle.

దేశ వ్యాప్తంగా తగ్గిన కొరోనా కేసులు

కొత్తగా 51,667 మందికి పాజిటివ్‌ ‌నమోదు..1,329 మంది మృతి
గత కెండు రోజులుగా దేశవ్యాప్తంగా పెరిగిన కొరోనా కేసులు మూడో రోజు తగ్గుముఖం పట్టాయి. 24 గంటల్లో కొత్తగా 51,667 పజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా, కొరోనాతో 1,329 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కొరోనా కేసులు 3,01,34,445కు చేరాయి. దేశంలో ప్రస్తుతం 6,12,868 యాక్టివ్‌ ‌కేసులు ఉండగా.. వైరస్‌తో ఇప్పటి వరకు దేశంలో మొత్తం 3,93,310 మరణాలు సంభవించాయి.

దేశంలో ఇప్పటి వరకు 2,91,28,267 మంది కొరోనా నుంచి రికవరీ అయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 30.79 కోట్లకు పైగా వ్యాక్సినేషన్స్ ‌తీసుకున్నట్లు శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ ‌బులిటెన్‌ ‌వెల్లడించింది.

Leave a Reply