Take a fresh look at your lifestyle.

తగ్గుముఖం పడుతోన్న కొరోనా.. భయపెడుతున్న బ్లాక్ ఫంగస్ ..

  • గడచిన 24 గంటల్లో 2,08, 921 కొరోనా కేసులు
  • తాజాగా 4,157 మంది మృతి చెందినట్లు ప్రకటన
  • దేశవ్యాప్తంగా 11,717 బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కేసులు నమోదు

దేశంలో కొరోనా తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో 2,08, 921 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాలు మాత్రం 4 వేలకు పైచిలుకు ఉంటున్నాయి. తాజాగా 4,157 మంది మృతి చెందారు. అదేవిధంగా గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కోవిడ్‌ ‌టెస్టులు చేపట్టారు. 22.17 లక్షల పరీక్షలు జరిగాయి. ఇదే ఇప్పటి వరకు ఉన్న రికార్డు సంఖ్య. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మొత్తంగా 2,71,57,795 మంది కొరోనా బారిన పడ్డారు. 3,11,388 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 24,95,591 క్రియా శీలక కేసులున్నాయి.

తమిళనాడులో 34,385 కేసులు, కేరళ 29,803 కేసులు, మహారాష్ట్ర 24,136 కేసులు, కర్ణాటక 22,758, బెంగాల్‌లో 17,005 కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాల నుండే 61.26 శాతం కేసులు వెలుగుచూశాయి. ఒకవైపు కొరోనా మహమ్మారితో అతలాకుతల మవుతున్న దేశాన్ని మరోవైపు బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌బెంబేలెత్తిస్తోంది. కొరోనా నుంచి కోలుకున్న వారిపై, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై ’మ్యుకర్‌ ‌మైకోసిస్‌’ అనే ఫంగస్‌ ‌దాడి చేసి తన ప్రతాపాన్ని చూపెడుతోంది.

కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 11,717 బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో అత్యధికంగా 2859 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (2770), ఆంధప్రదేశ్‌ (768) ఉన్నాయి. ఆయా రాష్ట్రాల వారీగా కేసుల వివరాలను కేంద్ర మంత్రి సదానంద గౌడ ట్విటర్‌ ‌ద్వారా వెల్లడించారు. చికిత్స నిమిత్తం అదనంగా మరో 29,250 అంఫోటెరిసిన్‌-‌బి వయల్స్‌ను రాష్టాల్రకు పంపినట్టు తెలిపారు.

Leave a Reply