Take a fresh look at your lifestyle.

ఎపిలో ఎంసెట్‌ ‌తేదీల ప్రకటన

  • జూలై 27నుంచి 31 వరకు పరీక్షలు
  • వివిధ సెట్‌ల తేదీలను ప్రకటించిన
  • ఉన్నత విద్యామండలి

అమరావతి,మే 6: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ‌విధించడంతో ఎంసెట్‌తో సహా అన్ని ఉమ్మడి పరీక్షలను వాయిదా వేసిన దరిమిలా ఎపిలో మళ్లీ ఎంట్రన్స్ ‌టెస్టులకు షెడ్యూల్‌ ‌ప్రకటించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌ ‌ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. లాక్‌డౌన్‌ అనంతరం పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో ఎంసెట్‌తో పాటు లాసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, ‌పీజీ సెట్‌, ఈసెట్‌ ఆన్‌లైన్‌ ‌దరఖాస్తు గడువును మే 20 వరకు పొడగించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ‌ప్రొ. హేమచంద్ర రెడ్డి వెల్లడించారు.

ఉన్నత విద్యామండలి ప్రకటించిన పరీక్ష తేదీలు ఇలావున్నాయి. ఎంసెట్‌ ‌పరీక్షలను జులై 27 నుంచి 31 వరకు నిర్వహిస్తారు. ఈసెట్‌ను జులై 24, ఐసెట్‌నుజులై 25న, పీజీసెట్‌నుఆగస్ట్ 2 ‌నుంచి 4 వరకు, ఎడ్‌సెట్‌ను ఆగస్టు 5న చేపడతారు. లాసెట్‌ను ఆగష్టు 6న, ఈసెట్‌ను ఆగష్టు 7 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు పఊర్తి షెడ్యూల్‌ను ప్రకటించారు.

Leave a Reply