Take a fresh look at your lifestyle.

తెలుగు విశ్వ విద్యాలయం పేరు మార్పిడికి నిర్ణయం?…

త్వరలో ఆర్డినెన్సు కు సన్నాహం!!

రామ కిష్టయ్య సంగన భట్ల…
హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాప రెడ్డి తెలుగు యునివర్సిటీగా మార్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఆర్డినెన్స్ ‌జారీ చేయడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తున్నది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయము భారత దేశంలోని భాష ప్రాతిపదికన స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఇది డిసెంబరు 2, 1985 సంవత్సరంలో ప్రత్యేక శాసనసభ చట్టం సంఖ్య 27 ద్వారా హైదరాబాదులో స్థాపించ బడింది. తరువాత 1989 సంవత్సరంలో కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రం ఇందులో విలీనం చేయబడింది.

ఈ విశ్వ విద్యాలయం ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాలలో తెలుగు భాష అభివృద్ధి ధ్యేయంగా ప్రారంభించబడింది. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం అదివరకున్న సాహిత్య, సంగీత, నాటక, నృత్య, లలిత కళా అకాడమీలను, అంతర్జాతీయ తెలుగు సంస్థ, తెలుగు భాషా సమితులను యూనివర్సిటీలో విలీనం చేసింది.

ఈ విధంగా తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు తదితరాలకు సంబంధించిన కేంద్ర సంస్థగా రూపొందింది. దీనిని ‘‘పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం’’గా 1998 సంవత్సరంలో పేరు మార్చారు. యూనివర్సిటీ గ్రాంట్స్ ‌కమిషన్‌ ‌దీనిని 1990 సంవత్సరంలో గుర్తించింది. 2010లో పరిపాలనపరంగా, సాంస్కృతిక శాఖలో భాగమైంది.

Leave a Reply