Take a fresh look at your lifestyle.

నేడు మంత్రిమండలి సమావేశంపై నిర్ణయం

తెలంగాణ మంత్రివర్గ భేటీపై గురువారం స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో కొరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న దృష్ట్యా హైదరాబాద్‌ ‌నగరంతో పాటు మేడ్చల్‌, ‌రంగారెడ్డి జిల్లాలలో మరోమారు లాక్‌డౌన్‌ ‌విధించనున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై మంత్రి మండలి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ ఇదివరకే ప్రకటించారు. దీంతో పాటు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలనీ, పార్లమెంటులో చిత్రపటం ఏర్పాటు చేయాలనీ, హైదరాబాద్‌ ‌కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పీవీ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడానికి వీలుగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది.

వీటితో పాటు అన్‌లాక్‌డౌన్‌ 2 అమలులోకి రావడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నియంత్రిత వ్యవసాయం అమలు అవుతున్న తీరు, పరిపాలనాపరమైన అంశాలు, వాయిదా వేసిన ప్రవేశ పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించాలి ? వంటి ఇతర అంశాలపై చర్చించడానికి సీఎం కేసీఆర్‌ ‌మంత్రి మండలి సమావేశాన్ని ఏర్పాటు చేసే గురువారం ప్రకటన చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Leave a Reply

error: Content is protected !!