Take a fresh look at your lifestyle.

కారు కింద పడతారా ..ఏనుగు ఎక్కి ప్రగతి భవన్ కు పోతారా ..!

బంగారు తెలంగాణలో బానిసలాగా పామ్ హౌస్ ల చుట్టూ తిరగలేనని అమ్మకు చెప్పా..: ప్రవీణ్ కుమార్ 
నల్గొండ బీఎస్పీ  సభలో  ఆ పార్టీ  రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియామకం 
నల్గొండ,ప్రజాతంత్ర ,ఆగస్ట్ 8:నల్గొండ బీఎస్పీ ర్యాలీ లో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొనడం సంతోషంగా ఉంది.. అని బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీరాం జీ గౌతమ్ అన్నారు.ఆదివారం నల్గొండ లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ .. బీఎస్పీ అంటే బహుజన రాజ్యం కోసం పుట్టిన పార్టీ.. బహుజన రాజ్యం కోసం మహా సంగ్రామమే సృష్టిస్తోంది..అంబేద్కర్ కలలు కన్న రాజ్యం  తెలంగాణ నుండే మొదలవుతుంది..అన్నారు.బహుజన సమాజ్ పార్టీ  నల్గొండ నుండి సమర శంఖం పూరిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తూ ..ఆయన ..”బహుజన సమాజ్ పార్టీ సకల జనుల పార్టీ..దేశంలో విద్యావ్యవస్థ పేద వారికి అందుబాటులో లేదు..2023 లో దేశంలో బహుజన రాజ్యం వస్తుంది..బహుజన సమాజం కోసం ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్యోగం వదిలారు..అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గా ప్రకటిస్తున్నా..” అని ఆయన తెలిపారు.
ఈ సందర్బంగా ఇటీవల రాజీనామా చేసిన ఐ పీ ఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ …మనకు ప్రగతి భవన్ చాలా దగ్గర్లో ఉంది..దొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన నల్గొండ కు ధన్యవాదాలు. అని తెలుపుతూ ఆయన ..’నల్గ గొండ నీలిగొండ గా మారింది…మేం బానిసలం కాదు, పాలకులం..తరతరాలుగా మా బిడ్డల భవిష్యత్తు ను దోచుకున్నారు..కోట్లాది తెచ్చుకున్న తెలంగాణ లో ఎవరో పదవులు అనుభవిస్తున్నారు..అమరవీరుల పాదాల వద్ద మోకరిల్లి మీ వద్ద కు వచ్చాను..అని భావోగ్వేదం తో మాట్లాడుతూ ..”కన్సీరామ్ కాలుమోపిన ఈ గడ్డ మీద మేలుకోండి..అమరుల సమాధుల మీద ప్రమాణం చేసి చెప్తున్నా మీకోసం నేనొచ్చా..ఇది బహుజనుల సునామీ..ఐపీఎస్ గా రిజైన్ చేసిన రోజే నా మీద కేసు పెట్టినరు..ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఒక ప్రవీణ్ కుమార్..కథన కుతూహలం తో కవాతు నిర్మించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు..ఆరున్నర సంవత్సరాల పోలీస్ సర్వీస్ లక్షల మంది బిడ్డల బతుకు మార్పు కోసం త్యాగం చేశా…బంగారు తెలంగాణలో బానిసలాగా పామ్ హౌస్ ల చుట్టూ తిరగలేనని అమ్మకు చెప్పా..తొమ్మిదేళ్లలో ఎన్నో గొప్ప పనులు చేసి నా జాతిని మెల్కొలిపా..ఎన్నో సాహస కార్యాలు బహుజన బిడ్డలు చేశారు..కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నాపై తీవ్ర ఆరోపణలు చేశాయి..రెక్కాడితే డొక్కాడని పిల్లలను హాస్టల్ లనుండి తరిమివేశారు..బహుజనులపై ఘోరమైన కుట్ర జరుగుతుంది…దళిత బంధు కోసం పెట్టిన వెయ్యి కోట్లు ఎవరి డబ్బులని అడుగుతున్నా..కేసీఆర్ ప్రజల సొమ్ము విచ్చల విడిగా వృధా చేస్తున్నారు..బహుజన రాజ్యం చాలా దగ్గరలో ఉంది..రాష్ట్రంలో వేల పాఠశాలలు ఉన్నా పేద విద్యార్థులకు సరైన విద్య అందడం లేదు..విద్యా వ్యవస్థ సమూల ప్రక్షాళన అవసరం..ప్రయివేటు యూనివర్సిటీ లతో అగ్రవర్ణ పేదలకు కూడా మంచి జరగడం లేదు..ప్రయివేటు వ్యవస్థ లో కూడా మాకు రిజర్వేషన్ కావాలి..ఎన్నికల ముందు మాటల గారడీ తో ఏడేళ్లుగా మోసపోతున్నాం..వైద్య విధానం సమూలంగా మారాలి..భారత రత్న కు ఓబీసీలు అర్హులు కారా..జనాభా ప్రాతిప్రాధికన మాకు అధికార వాటా ఇవ్వాలి..బహుజన రాజ్యంలో అన్ని కులాలకు సమాన వాటా ఉంటుంది..ప్రతి మండలం లో ఇంటర్నేషనల్ స్కూల్ ఉండబోతుంది..ఒలింపిక్స్ లో ఒక్క మెడల్ కాదు,చైనా తో పోటీ పడుతాం.సబ్బండ వర్గాలు అణచివేత లోనే ఉన్నాయి..రాబోయే రోజులన్ని బహుజన రాజ్య సాధన కోసం పోరాడాలి..బహుజన రాజ్యం అంత సులువుగా రాదు..తరతరాలుగా దోపిడీ చేసిన ఆధిపత్య కులాలు సంపాదించిన డబ్బులు ఎర గా వేస్తారు..నల్గొండ సభ దేశ రాజకీయ లను సైతం మార్చబోతుంది..కారు కింద పడుతారో,ఏనుగు ఎక్కి ప్రగతి భవన్ కు పోతారో మీరే నిర్ణయించుకోవాలి..అని అన్నారు.

Leave a Reply