Take a fresh look at your lifestyle.

తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన డిసెంబర్‌ 9

‌ట్విట్టర్‌లో గుర్తుచేసుకున్న మంత్రి హరీష్‌ ‌రావు
‌తెలంగాణ ఉద్యమ చరిత్రలో డిసెంబర్‌ 9‌కి ప్రత్యేక రోజని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపుతిప్పిన రోజని మంత్రి హరీశ్‌ ‌రావు అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టిన దీక్షాదక్షుడు నాయకత్వంలో.. ఉద్యమం విజయ తీరాలకు చేరిన రోజని అన్నారు. ఉద్యమ వీరుని ప్రస్థానానికి నేటికి పన్నెండేండ్లు పూర్తయ్యాయని ట్వీట్‌ ‌చేశారు. ’తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ ‌సచ్చుడో’ నినాదంతో ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ 2009, ‌నవంబర్‌ 29‌న ఆమరణ నిరాహార దీక్ష ప్రరంభించారు. దీంతో ఉద్యమ తీవ్రత రోజురోజుకు అధికమవుతుండటంతో..

డిసెంబర్‌ 9‌న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పక్రియను ప్రారంభిస్తున్నామని అప్పటి కేంద్ర కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించిన విషయం తెలిసిందేనని గుర్తు చేశారు. తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు ఇది ప్రాణాలను పణంగా పెట్టిన దీక్షాదక్షుడు నాయకత్వంలో.. ఉద్యమం విజయ తీరాలకు చేరిన రోజు.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలిపిన రోజు. అని గుర్తు చేసుకున్నారు. ఉద్యమ వీరుని ప్రస్థానానికి నేటి తో పన్నేడేండ్లు..‘ అని మంత్రి హరీశ్‌ ‌రావు ట్విటర్‌లో పోస్టు చేశారు.

Leave a Reply