రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ..
తెలంగాణ ప్రగతి కళ్లకు కట్టేలా కార్యక్రమాలు
కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన సిఎం కెసిఆర్
జిల్లాకు రూ. 105 కోట్ల నిధులు విడుదల
పోరాటాలు, త్యాగాలతో,ప్రజాస్వామ్యపంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో, పదేళ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణదశాబ్ది ఉత్సవాల సందర్భంగా, అమరులత్యాగాలు స్మరిస్తూ, ప్రజలఅకాంక్షలకు అనుగుణంగా ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.ప్రకటనలో ..జూన్ 2 నుంచి మూడువారాల పాటు సాగే ఈ ఉత్సవాలు తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా..పండుగ వాతావరణంలో జరుపాలని సిఎం అన్నారు. దశాబ్ది ఉత్సవాలసందర్భంగా ఖర్చుల నిమిత్తం కలెక్టర్లకు 105 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖను సిఎం కేసీఆర్ ఆదేశించారు.గురువారం డా.బిర్.అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకార్యచరణ, ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో…దేశానికే ఆదర్శంగా తెలంగాణ హరితహారం సాధించిన విజయాలను సిఎం కేసీఆర్ వివరించారు. వాతావరణ పరిస్థితలకు అనుగుణంగా వరి పంట నాట్లను ఇప్పుడు అనుసరిస్తున్న ధోరణిలో కాకుండా ముందస్తుగా సకాలంలో నాటు వేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి సిఎం వివరించారు.
అదే సందర్భంలో…గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ గురించి సిఎం ప్రకటించారు.దశాబ్ధి ఉత్సవాల నిర్వహణ ప్రధాన ఉద్దేశ్యంగా..ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఏర్పడే నాటికి వున్న పరిస్థితులను పదేండ్లకు చేరుకున్న స్వరాష్ట్ర పరిపాలనలో సాధించిన గుణాత్మక అభివృద్ధిని సిఎం కేసీఆర్ రంగాలవారిగా వివరించారు. ఏ రోజుకా రోజుగా రోజువారీ కార్యక్రమాలను వివరించిన ముఖ్యమంత్రి ఆయా రోజు చేపట్టే శాఖలు అవి సాధించిన అభివృద్ధిని వివరిస్తూ…అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన ప్రజాసంక్షేమ కోణాన్ని తాత్విక ధోరణి దాని వెనకున్న దార్శనికతను కలెక్టర్లకు సిఎం కేసీఆర్ అర్థంచేయించారు.గ్రామస్థాయినుం
మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు సిఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.పదేండ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానంలో ఆదర్శంగా నిలిచిన ఆయా శాఖలకు సిఎం అభినందనలు తెలిపారు. వ్యవసాయం విద్యుత్తు సాగునీరు ఆర్ అండ్ బీ తదితర శాఖల మంత్రులను,అధికారులను సిఎం అభినందించగా సమావేశం చప్పట్లతో హర్షం వ్యక్తం చేసింది.కాగా… సిఎంకేసీఆర్ ఆదేశాలను అనుసరించి ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ సాధించిన అభివృద్దిని దేశం నలుదిక్కులా కనిపించేలా తెలంగాణ గరిమ ప్రస్పుటించేలా చాటేందుకు,పండుగ వాతావరణంలో దశాబ్ధి ఉత్సవాలను నిర్వహించేందుకు తాము ఈ మూడు వారాలు కృషి చేస్తామని కలెక్టర్లు తెలిపారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వసలహాదారులు, ముఖ్యమంత్రి సలహాదారులు, ప్రభుత్వప్రధానకార్యదర్శి, సిఎంఒకార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లాఎస్పీలు, డిజీపి, పోలీసు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.