Take a fresh look at your lifestyle.

అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య

జన్నారం, ప్రజాతంత్ర విలేకరి) : అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది అదనపు ఎస్సై రాథోడ్‌ ‌తానాజీ నాయక్‌ ‌తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన బాణావథ్‌ ‌శ్రీనివాస్‌ 30 అనే రైతు  గత మూడు సంవత్సరాల నుంచి ఎకరం భూమి తోపాటు మరో రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.

గత రెండు సంవత్సరాల నుంచి పంట దిగుబడి సరిగ్గా రాకపోవడం వలన చేసిన అప్పులు పెరిగిపోయాయి. మళ్లీ ఈ సంవత్సరం కూడా పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేయగా ఈ సంవత్సరం పంట సరిగా మొలకెత్తు నందున ఈసారి కూడా పంట దిగుబడి రాదేమోనని మరియు వ్యవసాయం కోసం చేసిన రెండు లక్షల రూపాయలు అప్పు ఎలా తీరుతాయి అని బాధతో మనస్తాపం చెంది జీవితంపై విరక్తితో సోమవారం రోజు రాత్రి ఇంట్లో గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే ఆయనను భార్య శోభ కుటుంబ సభ్యులు కలిసి చికిత్స నిమిత్తం లక్షట్‌ ‌పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తరలించగా మెరుగైన చికిత్స కోసం అక్కడి నుండి కరీంనగర్‌ ‌జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో మృతి చెందాడని అదనపు ఎస్సై రాథోడ్‌ ‌థానాజీ తెలిపారు. మృతుని భార్య శోభ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Leave a Reply