Take a fresh look at your lifestyle.

జగన్‌ అసమర్థత వల్లనే మరణాలు

  • మరణాలన్నింటిక ఈప్రభుత్వానిదే బాధ్యత
  • డియా సమావేశంలో మాజీమంత్రి యనమల

అమరావతి, : ముఖ్యమంత్రి జగన్‌ అసమర్థ చర్యల వల్లే రాష్ట్రంలో మరణ మృదంగం మోగుతోందని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం డియాతో మాట్లాడుతూ ఆక్సిజన్‌ అం‌దక జరిగిన మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని వ్యాఖ్యానించారు. ఆక్సిజన్‌ ‌డిమాండ్‌, ‌సరఫరాపై ప్రభుత్వానికి అవగాహన లేదన్నారు. జనం పిట్టల్లా రాలిపోతుంటే ముఖ్యమంత్రికి పట్టదా అని ప్రశ్నించారు. తమ నిర్లక్ష్యానికి ఇంకా ఎంతమంది ప్రాణాలను బలిపెడతారని ఆయన నిలదీశారు.  తిరుపతి రుయా ఆసుపత్రిలో బంధువుల క్లళెదుటే 11మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రభుత్వ చేతగాని తనాన్ని డాక్టర్లపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ఆరోగ్యమంత్రి, జిల్లా మంత్రులు, శాసనసభ్యలు ఏమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొద్దునిద్రవీడి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని యనమల రామకృష్ణుడు హితవుపలికారు. ఇదిలావుంటే  తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అం‌దక రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై టీడీపీ నిజనిర్దారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు  టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. కరోనా బాధితులకు సాయంలోనూ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని  విమర్శించారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అం‌దక కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని యనమల అన్నారు.

కరోనాతో బాధపడుతున్న వారికి సరైన వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బాధితులకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోవడం అత్యంత ఘోరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ అం‌దక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఈ ఘటనలోని వాస్తవాలను రాష్ట్ర ప్రభుత్వం దాచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వాస్తవాలు ప్రజలకు తెలియజేసి ప్రజల్ని అప్రమత్తం చేయాల్సి ఉందన్నారు.

Leave a Reply