Take a fresh look at your lifestyle.

‌డ్రైనేజీలో ఇంటలిజెన్స్ ఆఫీసర్‌ ‌మృతదేహం

Death of Intelligence Officer in Drainage

ఢిల్లీ జరిగిన అల్లర్లలో ఇంటెలిజెన్స్ ‌బ్యూరోలో పనిచేస్తున్న ఆఫీసర్‌ ‌చనిపోయాడు.  ఈశాన్య ఢిల్లీలో అంకిత్‌ ‌శర్మ అనే వ్యక్తి మృతదేహం లభించింది.  ఓ డ్రైనేజీ నుంచి ఆఫీసర్‌ ‌శవాన్ని వెలికితీశారు. సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన హింసలో ఇప్పటికే 20 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది.  వందల సంఖ్యలో జనం గాయపడ్డారు.

ఢిల్లీ హింస అయిదో రోజుకు చేరుకున్నది. అయితే తొలి రోజు జరిగిన హింసలో ఓ పోలీసు ఆఫీసర్‌ ‌కూడా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 2017లో అంకిత్‌ ‌డ్రైవర్‌గా.. ఐబీలో చేరాడు.  ప్రస్తుతం అతను సెక్యూర్టీ అసిస్టెంట్‌ ‌ర్యాంక్‌లో ఉన్నాడు. అల్లర్లలో ఆయనను ఎవరో హత్య చేసి డ్రైనేజీలో వేశారని అనుమానిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply