Take a fresh look at your lifestyle.

ఆక్సిజన్‌ అం‌దకనే యువకుడి మృతి

హాస్పిటల్‌లో ఆక్సిజన్‌ అం‌దక తల్లి కళ్లెదుటే కొడుకు మరణించడం బాధాకరమైన విషయమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నల్లగొండ ప్రభుత్వాస్పత్రి కొరోనా వైరస్‌ ‌లక్షణాలతో మిర్యాలగూడ మండలం సల్కునూరుకు చెందిన ఓ యువకుడు ఊపిరి ఆడక తల్లి కళ్లెదుటే కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా పలువురిని కదిలించింది. ఈ నేపథ్యంలోనే నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను ఉత్తమ్‌ ‌పరామర్శించారు.

వైద్య సేవలు ఎలా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన డియాతో మట్లాడుతూ నల్లగొండ, నిజామాబాద్‌ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌, ‌వెంటిలేటర్‌ ‌సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ ‌చేశారు. కరోనాతో మృతి చెందిన పేదవారికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కరోనాతో పోరాడే ఫ్రంట్‌ ‌వారియర్లకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. మూఢనమ్మకాల కోసం సెక్రటేరియట్‌ ‌కూలగొట్టడం న్యాయమేనా అని ప్రశ్నించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజలపై రూపాయి భారం పడకుండా వైద్యం అందించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply