Take a fresh look at your lifestyle.

మృతుల.. కుటుంబాలకు రూ .40 లక్షలు ..!

పరిహారం చెల్లించడానికి సింగరేణి యాజమాన్యం అంగీకారం

  • సింగరేణి ఆస్పత్రి వద్ద సడలని ఉద్రిక్తత
  • కార్మికులు, మృతి చెందిన వారి ఆందోళన
  • కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్‌
  • 24 ‌గంటలయినా చేపట్టని పోస్ట్‌మార్టమ్‌
  • ‌విధులు బహిష్కరించిన కార్మికులు
  • భారీగా పోలీసుల మొహరింపు
  • బాధిత కుటుంబాలను పరామర్శించిన నేతలు

సింగరేణి ఆర్‌జీ ఓపెన్‌కాస్టు-1 ఫేస్‌-2‌లో మంగళవారం ఉదయం జరిగిన భారీ పేలుడులో చనిపోయిన ప్రతి కాంట్రాక్టు కార్మిక కుటుంబానికి రు .40 లక్షల పరిహారం చెల్లించడానికి యాజమాన్యం అంగీకరించింది .32 గంటల సుదీర్ఘ చర్చల తరువాత బుధవారం సాయంత్రం మహలక్ష్మి కంపెనీవివిధ కార్మిక సంఘాల నాయకులు , రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో పరిహారం చెల్లించడానికి ఒప్పుకుంది అంతకు ముందు బుధవారం ఉదయం నుంచి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సింగరేణి గనుల్లో మృతి చెందిన కార్మికులకు పరిహరం చెల్లించడానికి మహలక్ష్మి కంపెనీ ముందుకు రాలేదు. ప్రమాదం జరిగి 24 గంటలైనా మృతదేహలకు పోస్ట్‌మార్టం నిర్వహించలేని వైనం అక్కడ నెలకొంది. దీంతో సింగరేణి ఏరియా ఆస్పత్రి వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. బంధువులు, కార్మికులు అక్కడ చేరుకుని నినాదాలు చూస్తూ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. కనీసం ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ ‌చేశారు. సింగరేణి ఆర్‌జీ ఓపెన్‌కాస్టు-1 ఫేస్‌-2‌లో మంగళవారం ఉదయం జరిగిన భారీ పేలుడులో చనిపోయిన కాంట్రాక్టు కార్మికతదేహాలను సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

దీంతో బాధిత కుటుంబాలు, కార్మి క సంఘాల నాయకులు భారీ ఎత్తున ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. భారీ పేలుడుకు శరీరాలు గుర్తుపట్టని రీతిలో కార్మికుల మృతదేహాలు ఉండడం, గాయపడిన వారికి కళ్లు, కాళ్లు విరిగిపోవడం, వారి కుటుంబాల రోదనలు ఏరియాఆసుపత్రి పరి సరాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలకు చెందిన రామగుండం రీజియన్‌ ‌పరిధిలోని నాయకులు ఏరియా ఆసుపత్రికి తరలివచ్చారు. సింగరేణి యాజమాన్యం, ప్రైవేట్‌ ఓబీ కంపెనీలు కుమ్మక్కై ఉత్పత్తి మినహా కార్మికు ల జీవితాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, ఈ మరణాలకు మహాలక్ష్మి కంపెనీ, సింగరేణి యాజమాన్యమే బాధ్య త వహించాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు సింగరేణి ఏరియా ఆసుపత్రి ఆవరణలో ధర్నాకు దిగారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, మృతిచెందిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి సింగరేణిలో పర్మినెంట్‌ ఉద్యోగం కల్పించాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ విషయం తేలేవరకు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతులు బండారి ప్రవీణ్‌కుమార్‌(38), ‌గోదావరిఖని, బిళ్ల రాజేశం(42)కమాన్‌పూర్‌, అం‌జయ్య(41) కమాన్‌పూర్‌, ‌రాకేష్‌(28) ‌గోదావరిఖని మృతదేహాలకు పోస్టమార్టం జరగాల్సి ఉంది.

ప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబాలను పరామార్శించేందుకు సింగరేణి ఏరియా ఆసుపత్రికి ప్రాంతానికి చెందిన టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌, ‌బీజేపీ, తదితర పార్టీల ప్రజా ప్ర తినిధులు, నాయకులు భారీగా తరలివచ్చారు. కార్మికుల మృతదేహాలను పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంపై దిగ్భ్రాతిని తెలియజేసి కార్మిక కుటుంబాలకు సంతాపం వెలిబుచ్చారు. కాంగ్రెస్‌, ‌బీజేపీల నాయకులు మృతిచెందిన కార్మిక కుటంబాలకు రూ.50లక్షల నష్టపరిహారంతో పాటు ఉద్యోగం కల్పించాలని డిమాండ్‌ ‌చేశారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రజాప్రతినిధులు, నాయకులు కార్మిక కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. మంగళవారం సాయంత్రం సంఘటన తెలుసుకున్న పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌నేత, జడ్పీ చైర్మన్‌ ‌పుట్ట మధు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, ‌రామగుండం మేయర్‌ ‌డాక్టర్‌ అనీల్‌కుమార్‌, ‌టీబీజీకేఎస్‌ ‌నాయకులు మిర్యాల రాజిరెడ్డి ఆసుపత్రికి వచ్చి కార్మిక కుటుంబాలను పరామర్శించారు. కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, రామగుండం ఇన్‌చార్జి రాజ్‌ఠాకూర్‌, ఐఎన్‌టీయూసీ నాయకులు బీ జనక్‌‌ప్రసాద్‌, ‌నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ, బీఎంఎస్‌ ‌నాయకులు కే మల్లయ్య, కౌశిక హరి, ఏఐటీయూసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, ఎల్‌ ‌ప్రకాష్‌, ‌హెచ్‌ఎంఎస్‌ ‌నాయకుడు రి యాజ్‌ అహ్మద్‌, ‌సీఐటీయూ అధ్యక్షుడు రాజారెడ్డి, యాకయ్య, ఐఎఫ్‌టీయూ నాయకులు నరేష్‌, ‌సీపీఐ నాయకులు గౌతం గోవర్ధన్‌ ఉన్నారు.
అయితే పనులు నిర్వహించే మహాలక్ష్మి కంపెనీలో పనిచేసే కార్మికులు ప్రమాదం బారిన పడగా, కంపెనీకి చెందిన ఒక్క ప్రతినిధి పట్టించు కోలేదు. ప్రిన్సిపల్‌ ఆఫ్‌ ఎం‌ప్లాయర్‌గా వ్యవహరించాల్సిన బాధ్యత కలిగిన సింగరేణి యాజమాన్యం కూడా ఏమి పట్టనట్టుగా వ్యవహరించింది. దీనిపై కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!