Take a fresh look at your lifestyle.

ప్రాణాంతకం అవుతున్న ప్రాణవాయువు కొరత

కొవిడ్‌ ‌రెండవ దశ విజృంభణ మూలంగా రాష్ట్రాల మధ్య ఆక్సిజన్‌ ‌కోసం పోటీ ఎక్కువైంది . జలాల కోసం జగడం చేసే రాష్ట్రాలు ఆక్సిజన్‌ ‌ట్యాంకర్ల కోసం కొట్లాట జరుపుకునే పరిస్థితి ఏర్పడింది . కోవిడ్‌ ‌తొలి దశ అనంతరం ఆక్సిజన్‌ అవసరాన్ని గుర్తించడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విఫలం చెందడం ప్రస్తుత దుస్థితికి కారణం.

ప్రాణాన్ని నిలబెట్టే ఆక్సిజన్‌ ‌ప్రాణాలు తీయడం కొవిడ్‌ ‌మహత్యమే. మహారాష్ట్ర నాసిక్‌ ‌లోని డాక్టర్‌ ‌జాకీర్‌ ‌హుస్సేన్‌ ఆసుపత్రి  మరియు ఢిల్లీలో గంగారం  హాస్పిటల్‌ ‌ని ఆక్సిజన్‌ ‌కొరత వల్ల పదుల సంఖ్యలో మృత్యువాత పడడం కూడా పులి మీద  చ ట్ర వంటిదే .కొవిడ్‌ ‌రెండవ దశ విజృంభణ మూలంగా రాష్ట్రాల మధ్య ఆక్సిజన్‌ ‌కోసం పోటీ ఎక్కువైంది . జలాల కోసం జగడం చేసే రాష్ట్రాలు ఆక్సిజన్‌ ‌ట్యాంకర్ల కోసం కొట్లాట జరుపుకునే పరిస్థితి ఏర్పడింది . కోవిడ్‌ ‌తొలి దశ అనంతరం ఆక్సిజన్‌ అవసరాన్ని గుర్తించడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విఫలం చెందడం ప్రస్తుత దుస్థితికి కారణం. తొలి దశ నుంచి దేశం నెమ్మదిగా కోలుకున్న తర్వాత  అనేక రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ మరియు కొరోనా మార్గదర్శకాలను సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఈ ఏడాది  ఫిబ్రవరిలో తిరిగి రెండవ దశ వ్యాప్తి జోరందుకుంది.  ఇది  మరింత వేగంగా విస్తరించడం వల్ల  హాస్పిటల్స్  అవసరము పెరిగి ఆక్సిజన్‌ ‌కొరత ఏర్పడింది.

హాస్పిటల్స్ ‌లో రోగులకు అందించే ఆక్సిజన్‌ ‌ను లిక్విడ్‌ ‌మెడికల్‌ ఆక్సిజన్‌ అం‌టారు .ఈ మెడికల్‌ ఆక్సిజన్‌ ‌మనం పీల్చే గాలి నుంచి వస్తుంది . ప్రకృతిలోని ప్రధాన వాయువుల్లో  ఒకటైన ఆక్సిజన్‌ ‌చుట్టూ ఉన్న గాల్లో కేవలం 21 శాతం మాత్రమే ఉంటుంది .గాలిలోని  ఇతర వాయువులను వేరు చేసి  ఈ ఆక్సిజన్‌ ‌ను తయారుచేస్తారు. దీన్నే ఎయిర్‌ ‌సపరేషన్‌ ‌యూనిట్‌( ఏ ఎస్‌ ‌యూ) అంటారు. గాల్లోనే వివిధ వాయువులను ద్రవ స్థితి కి  చల్లార్చిన తర్వాత ఫ్రాక్షనల్‌ ‌డిస్టిలేషన్‌ ‌ప్రక్రియ ద్వారా వీటిని వేరు చేసి డిస్టిలేషన్‌ ‌కాలమ్స్   ‌ద్వారా ద్రవ  ఆక్సిజన్‌ ‌ను  ప్లాంట్లలో తయారు చేస్తారు.ఇలా తయారైన ద్రవ  ఆక్సిజన్ను మైనస్‌ 180 ‌డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉండే క్రయోజనిక్‌ ‌ట్యాంకర్ల ద్వారా దేశంలోని వేల కిలోమీటర్లు ప్రయాణించి వివిధ పట్టణాల్లోని డిస్ట్రిబ్యూటర్లకు ఆక్సిజన్ను చేరుస్తారు. డిస్ట్రిబ్యూటర్లు ఈ ద్రవ ఆక్సిజన్‌ ‌ను వాయు రూపంలోకి మార్చి సిలిండర్లలో కి నింపి వివిధ హాస్పిటల్స్ ‌కు సరఫరా చేస్తారు.

ప్రస్తుత వైద్య ఆక్సిజన్‌ ‌కు ఏర్పడిన కొరత ఉత్పత్తి లో ఒక స్వల్ప భాగం మాత్రమే ,ఉత్పత్తి చేసిన ఆక్సిజన్‌ ‌ను దేశంలోని మారుమూల ప్రాంతాలకు వేగంగా చేరవేయడం అతి పెద్ద సమస్య. పారిశ్రామిక  అవసరాలను పక్కన పెట్టి యుద్ధ ప్రాతిపదికన దేశమంతటా ఆక్సిజన్‌ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.హాస్పిటల్స్ ‌తమంతట తామే ఆక్సిజన్‌ ‌ను ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది దీన్ని ప్రెషర్‌ ‌స్వింగ్‌ అడ్సారషన్‌ అం‌టారు. అంటే తన చుట్టూ ఉండే గాల్లోనే ఆక్సిజన్‌ ‌వేరు చేసి వాడుకొనేవిధానం . ఏ ఎస్‌ ‌యు లో తయారయ్యే ఆక్సిజన్‌ ‌కంటే దీని నాణ్యత తక్కువ అయినా  హాస్పిటల్స్ ‌లో వినియోగానికి సరిపోతుంది.అనేక రాష్ట్రాలలో ప్రజారోగ్య వ్యవస్థ వెంటిలేటర్‌ ‌మీదకు మారింది . ఆక్సిజన్‌ అం‌దక అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీంతో  చేతులు కాలిన తర్వాత అన్నట్లు  విదేశాల నుండి 50 మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సిజన్‌ ‌దిగుమతి కి కేంద్రం ఆదేశాలు ఇచ్చింది  .అయితే 2020- 21  ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్‌ ‌పెద్ద ఎత్తున ఆక్సిజన్‌ ‌ను విదేశాలకు ఎగుమతి చేసింది. ఈ తొమ్మిది మాసాల కాలంలో 9,294 మెట్రిక్‌ ‌టన్ను ల ఆక్సిజన్ను ఇతర దేశాలకు అమ్మింది. ఇందులో అత్యధికంగా గా 8,828  టన్నుల ఆక్సిజన్‌ ‌ను ఒక బంగ్లాదేశ్‌ ‌కి సరఫరా చేసింది. 2017 ముందు ద్రవరూప ఆక్సిజన్‌ ఉత్పత్తిలో భారత్‌ ‌ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండేది.  2016 – 17 నాటికి భారత్‌ ‌నుంచి 13,8 44 మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సిజన్‌ ఎగుమతి అయింది.

ఆ తర్వాత దేశంలో వైద్య ఆక్సిజన్‌ అవసరం పెరిగింది . అలాగే పరిశ్రమల్లోనూ ఆక్సిజన్‌ ‌వినియోగం వృద్ధి చెందింది .దీంతో దేశం నుంచి ఆక్సిజన్‌ ఎగుమతులపై నియంత్రణ విధించారు. 2017- 18 లో భారత్‌ 4,219 ‌మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సిజన్‌ ‌ను మాత్రమే ఎగుమతి చేసింది. 2018 -19 లో 3,189 మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సిజన్‌ ‌విదేశాలకు పంపించింది 2019-20 లో 4502 మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సిజన్‌ ఎగుమతి జరిపింది. కాగా గతేడాది ఒక్కసారిగా తిరిగి ఆక్సిజన్‌ ఎగుమతులను పెంచేసింది .ప్రస్తుతం రోజు దేశంలో  7,128 మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్ధ్యం ఉంది. అయితే ఇందులో 92 శాతం పారిశ్రామిక అవసరాలకు సరిపోతుంది ఆయా పరిశ్రమల్లో ఆక్సిజన్‌ అం‌దుబాటులో లేకుంటే ఉత్పాదకత నిలిచిపోతుంది.అయితే ప్రభుత్వం పరిశ్రమల అవసరాలను కూడా పక్కన పెట్టి కేవలం ఔషధ, వైద్య రంగాలకు మాత్రమే ఆక్సిజన్‌ ‌సరఫరా చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రత్యేక గ్రీన్‌ ‌కారిడార్‌ ‌ను ఏర్పాటు చేసి రైల్వేల ద్వారా,విమానాల ద్వారా ఆక్సిజన్ను రవాణా చేస్తున్నారు. కొరోనా మొదటిదశ  శుచి ,శుభ్రతను నేర్పించ గా రెండో దశ ప్రాణవాయువు ఆవశ్యకతను తెలియ చెబుతోంది.  ఇంతటి కొరోనా కల్లోలానికి కారణమైన ప్రాణవాయువు పట్ల ప్రభుత్వాలు చిత్తశుద్ధిని ప్రదర్శించి మానవ ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత  ప్రభుత్వాల మీద ఉంది.
– డాక్టర్‌  ‌చల్ల ప్రభాకర్‌ ‌రెడ్డి.

Leave a Reply