Take a fresh look at your lifestyle.

ధాన్యం కొనుగోలులో మిల్లర్ల దోపిడీని అడ్డుకోవాలి

గరిడేపల్లి, మే 4(ప్రజాతంత్ర విలేకరి) : ఐకేపీ కేంద్రాలు, సొసైటీ సంఘాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరుగు పేరుతో అధిక తూకం మోసాలకు పాల్పడుతున్న మిల్లర్లపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని బిజెపి జిల్లా నాయకులు అందె కోటయ్య, హుజూర్‌నగర్‌ ‌మార్కెట్‌ ‌కమిటీ మాజీ వైస్‌ ‌చైర్మన్‌ ‌పోకల వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రంలోని తహశీల్దార్‌ ‌కార్యాలయంలో ఆర్‌ఐ ‌తబ్రేజ్‌కు బిజెపి ఆధ్వర్యం లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన పంటను ఒకపక్క దళారుల చేతిలో మోసపోతుండగా మరోపక్క ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని మిల్లర్లు కొర్రీలు పెట్టి ఏదో ఒక రకంగా రైతును దోచుకోవడానికి కుటిల ప్రయత్నాలు పన్నుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకో రైతు నుండి క్వింటాకు రెండు కేజీల నుండి ఐదు కేజీల వరకూ తగ్గించి బిల్లు లు చేస్తున్నారని రైతులు తమ మనోవేదనను వెళ్లబుచ్చుతున్నారన్నారు. తక్షణమే అధికారులు స్పందించి మిల్లర్లతో మాట్లాడి రైతులకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలన్నారు. లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మేలు జరిగేంతవరకూ ఉధృతమైన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండలాధ్యక్షులు నర్సింగ్‌ అం‌జయ్య, మాజీ సర్పంచ్‌ ‌నందిపాటి సైదులు, రైతు సమన్వయ సమితి మండల కమిటీ సభ్యులు సుందరి రమేష్‌, ‌మాజీ ఎంపీటీసీ మంగ భారతమ్మ, మండల నాయకులు బాలకృష్ణ, కొమర్రాజు లక్ష్యాది, డాక్టర్‌ ‌మలికంటి శ్రీనివాస్‌, ‌నాగెల్లి సైదులు, పంతంగి శివ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!