Take a fresh look at your lifestyle.

డీసీసీబీ చైర్మన్‌ ‌పీఠంపై ఉత్కంఠత!

DCCB chairman cheers on the seat!

  • అధిష్టానం నిర్ణయం కోసం ఎదురుచూపు – బ్రహ్మయ్య, నాగభూషణం మధ్య పోటీ
  • పోటా పోటీగా ఫైరవీలు – సీఎం ఆశిస్సుల కోసం ప్రయత్నాలు

- Advertisement -

ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ (‌డీసీసీబీ) చైర్మన్‌ ‌పీఠంపై ఉత్కంఠత కొనసాగుతుంది. డీసీసీబీ,డీసీఎంఎస్‌ ‌డైరక్టర్ల పదవులన్నీ అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. అయితే డీసీసీబీ చైర్మన్‌ ‌పదవికోసం పలువురు డైరక్టర్లు తీవ్ర స్ధాయిలో పోటీ పడుతున్నారు. ప్రముఖంగా ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అశ్వాపురం సహకార సంఘం అద్యక్షుడిగా ఎన్నికైన తుళ్ళూరి బ్రహ్మయ్య , వి వెంకటాయపాలెం సోసైటి అధ్యక్షుడిగా ఎన్నికైన కూరాకుల నాగభూషణంలు జిల్లా సహకార బ్యాంక్‌ ‌చైర్మన్‌ ‌పదవిని ఆశిస్తున్నారు. మొదటి నుంచి డీసీసీబీ చైర్మన్‌ ‌పదవి తనకే వస్తుందని తుళ్ళూరి బ్రహ్మయ్య గట్టినమ్మకంతో ఉన్నారు. అయితే చివరికి ఆ పదవికి పలువురు పోటీ పడడంతో బీసీలకు ఇవ్వాలనే ప్రతిపాదన రావ డంతో కూరాకుల నాగభూషణం పేరు తెరపైకి వచ్చింది. గతంలో సైతం బ్రహ్మయ్యకు చివరి నిమిషంలో డీసీసీబీ చైర్మన్‌ ‌పదవి రాకపోవడం తో ఆయన నిరాశ చెందారు. అయితే ఈ సారి బ్రహ్మయ్యకు అవకాశం వస్తుందని అనుకున్న సమయంలో తెరపైకి కొత్తపేర్లు రావడంతో అం దరి అంచనాలు తల కిందులైయ్యాయి. అదిష్టానం బ్రహ్మయ్య వైపు మొగ్గు చూపిందని కూడా ప్రచారం జరిగింది. అయితే కులాల రిజర్వేషన్‌ ‌తెరపైకి రావడంతో ఉహించని అభ్యర్ధులు పోటీకి దిగారు. తమ రాజకియ గురువులతో అధిష్టా నంపై వత్తిడి తీసుకవచ్చారు. చివరికి డీసీసీబీ చైర్మన్‌ ‌రేసులో నలుగురు అభ్య ర్ధులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. పదవే లక్ష్యంగా ఆయా అభ్యర్ధులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధిష్టానం కానీ జిల్లా మంత్రి కానీ ఫలానా అభ్యర్ధి చైర్మన్‌ అవుతారని ప్రకటించకపోవడంతో ఆశావాహుల జాబితా పెరిగింది. తమకున్న రాజకియ పలుకుబడి నేపధ్యంలో ఎవరికి వారు పోటా పోటీగా ప్రయత్నాలు చేయడంతో చైర్మన్‌ అభ్యర్ధిపై ఉత్కంఠత నెలకొంది.

మంత్రి పువ్వాడ అశీస్సులు ఎవరికో…
సహకార ఎన్నికల్లో అత్యధిక సోసైటి చైర్మన్లు, డైరక్టర్ల పదవులను గెలిపించడంతో తన మార్క్ ‌చూపిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అశీస్సులు ఎవరికి ఉన్నాయనే అంశంపై జిల్లాలో తీవ్ర చర్చినీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ ‌నేతగా, ఖమ్మం జిల్లా అధ్యక్షుడి గా పని చేసిన బ్రహ్మయ్య రాజకియాల్లో సీనియర్‌ ‌నేతగా ఉన్నారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు అనుచరుడిగా ఉన్న ఆయన ఎంపీ నామతో అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు. మంత్రి పువ్వాడఅజయ్‌కుమార్‌, ఎం‌పీ నామ నాగేశ్వర రావు, చీప్‌విప్‌ ‌రేగా కాంతారావు ఆశీస్సులతో సోసైటి ఎన్నికల బరిలోకి దిగారు. ఇటు కూరా కుల నాగభూషణం బీసీ నేతగా , వైఎస్సార్‌ ‌సీపీ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి చెందారు. మాజీ ఎంపీ పొంగులేటితో కలసి పని చేశారు. ప్రస్తుతం మంత్రి అజయ్‌కు మార్‌తో ఉన్నారు. అయితే ఇద్దరి మధ్య చైర్మన్‌ ‌పీఠపై కసరత్తు జరుగుతుందని ప్రచారం సాగు తుంది. అయితే • ఈ జఠిలమైన సమస్య సీఎం కేసిఆర్‌ ‌చేతిలో ఉందని ఆయన నిర్ణయం ప్రకారమే కేటాయింపు జరుగుతుందని చర్చ జరుగుతుంది. చైర్మన్‌ ‌పీఠాన్ని ఎవరు అధ/రోహిస్తారో 29 వరకు వేచి చూడాల్సిందే మరి.

Leave a Reply