వికారాబాద్ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రెడ్ జోన్ ప్రాంతాలైన రాజీవ్ గృహకల్ప బిటిఎస్ కాలనీలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డిలు నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెడ్‌జోన్ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలకు లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున నిరుపేదలకు బియ్యం పప్పు నూనె పిండి మొదలగు నిత్యావసర సరుకులతో పాటు కూరగాయలను పంపిణీచేయడం జరుగుతుందని తెలిపారు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ కాలనీల్లో నివసిస్తున్న నిరుపేదలకు నిత్యావసర సరుకులు కూరగాయలు మొదలుకుని అందించి వారికి సహకరించాలని తెలిపారు. ఏడు వందల రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులను బ్యాగులో ఉంచి పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.