Take a fresh look at your lifestyle.

ఏపీలో రోజురోజుకూ తగ్గుముఖం

కొత్తగా 4,981 కరోనా కేసులు నమోదు
అమరావతి,జూన్‌ 24 : ఏపీలో రోజురోజుకూ కరోనా వైరస్‌ ‌మరింత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,981 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్‌ ‌తో 38 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 18,67,017కి చేరగా, వైరస్‌తో 12,490 మంది మృతి చెందారు. అలాగే రాష్ట్రంలో 49,683 యాక్టివ్‌ ‌కేసులు ఉండగా, 18,04,844 మంది రికవరీ అయ్యారు.

24 గంటల్లో 6,464 మంది రికవరీ అయ్యారు. అలాగే 24 గంటల్లో 88,622 కరోనా టెస్టుల నిర్వహించారు. కొత్తగా చిత్తూరు జిల్లాలో 10 మంది మృతి చెందారు. తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో నలుగురు చొప్పున, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, అనంతపురం, కడప, విశాఖ, విజయనగరంలో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

Leave a Reply