మంగపేట మండలం నర్సింహసాగర్ గోందిగూడెం గ్రామంలో తల్లితండ్రులను కోల్పోయి అనాధలుగా నిలిచిన ఆ చిన్నారులకు మల్లూరు శ్రీ )క్ష్మినరసింహ దత్త సేన అండగా నిలిచింది. దత్త సేన దాతల సహకారంతో రూ.25 వేలు, రెండు జతల కోత్త బట్టలను ఆ ఆనాద పిల్లలకు అర్ధిక సహయం క్రింద అందించారు. కాగా తల్లి దశ దిన కర్మలకు ప్రస్థుత రూ.5 వేలను అందించి మిగితా రూ.20 వేలను పిల్లల పేరున పిక్స్డ్ చేశారు. సిద్దంశెట్టి శ్రీనివాస్, జ్వాలా యూత్ నరేష్ సహయంలో ఆ పిల్లలను దత్తత తీసుకోవడానికి దంపతులు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ )క్ష్మినరసింహ దత్త సేన సారధి ఏడునూతుల ఈశ్వర్‌చందు శర్మ, దిడ్డి నరేష్, గడ్డం చిరంజీవి, నూతులకంటి ఈశ్వర్ చందు, బారుపాటి ఏసుబాబు, సతీష్, మురుకుంట్ల నరేందర్, గడ్డం నగేష్‌లు పాల్గోన్నారు.