Take a fresh look at your lifestyle.

బద్వేల్‌ ఉప ఎన్నిక అభ్యర్థిగా దాసరి సుధ

  • వెంకట సుబ్బయ్య భార్యకే టిక్కెట్‌ ‌కేటాయింపు
  • మిడియా సమావేశంలో సజ్జల వెల్లడి

అమరావతి,సెప్టెంబర్‌ 28 : ‌బద్వేలు ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకుంటామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.బద్వేల్‌ ఉపఎన్నిక విషయంలో ఇప్పటికే వెంకట సుబ్బయ్య భార్య సుధ అభ్యర్థిగా ఉంటారని సీఎం చెప్పారు. చనిపోయిన వ్యక్తి కుటుంబం నుంచి టికెట్‌ ఇవ్వడం మా సంప్రదాయం. సానుభూతిగా మిగిలిన వారు పోటీ ఉండకపోవడం సాంప్రదాయం అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన డియాతో మాట్లాడుతూ.. ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీకి అభిమానం పెరుగు తోంది. ప్రజల అభిమానం, ఆదరణ మా పార్టీకి ఎప్పుడూ ఉంటాయన్నారు. నిష్పక్షపాతంగానే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం. బద్వేలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దాసరి సుధ పోటీచేస్తారు. ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకుని, మంచి మెజార్టీతో గెలుస్తామని సజ్జల పేర్కొన్నారు. ఒకవేళ పోటీ పెట్టినా ఎంత సీరియస్‌గా తీసుకోవాలో అలానే తీసుకుంటాం. నంద్యాల ఎన్నికకు ఈ ఎన్నికకు పోలిక లేదు.

నంద్యాల ఉప ఎన్నికలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పెద్ద జనరల్‌ ఎన్నికలుగా తీసుకున్నారు. రూ.100 కోట్ల వరకు పంచారు. పథకాలు ఆగిపోతాయని భయపెడితే ఆ ఫలితాలు వచ్చాయి. అయితే ఈ ఎన్నికలు మా ప్రభుత్వం గత రెండేళ్లలో చేసింది చెప్పుకోవడానికి ఇదొక అవకాశం. ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడం మాకూ అవసరం. మెజారిటీ గతంలో వచ్చిన దానికంటే ఎక్కువ రావచ్చు అని సజ్జల అన్నారు. ఇదిలావుంటే కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ‌విడుదల చేసింది. అక్టోబర్‌ 1‌న నోటిఫికేషన్‌ ‌విడుదల చేస్తారు. నామినేషన్‌ ‌దాఖలుకు చివరి తేదీ అక్టోబర్‌ 8 ‌కాగా.. అక్టోబర్‌ 11‌న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్‌ 13. అక్టోబర్‌ 30‌వ తేదీన ఎన్నికల పోలింగ్‌, ‌నవంబర్‌ 2‌వ తేదీ ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా.. కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ ‌వెంకటసుబ్బయ్య గత వేసవిలో మరణించడం తెలిసిందే. ఆయన మృతితో బద్వేలు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. బద్వేల్‌ ఉపఎన్నికతో పాటే తెలంగాణలోని హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కూడా జరగనుంది.

Leave a Reply