Take a fresh look at your lifestyle.

ముదురుతున్న .. ఇండియా-నేపాల్‌ ‌సరిహద్దు వివాదం

ఇం‌డియా-నేపాల్‌-‌చైనా మూడు దేశాల సంయోగ ప్రాంతమైన కాలాపానీ, మరియు సుస్తాలు ఇరుదేశాల సరిహద్దు వివాధానికి ప్రధాన కారణం. కాలాపానీకి పశ్చిమాన ప్రవహించే నది కాళినదికి ప్రధాన నది కాబట్టి ఈ ప్రాంతం తమదేనని నేపాల్‌ ‌వాదిస్తోంది. అయితే కాలాపానీకి పశ్చిమాన ఉన్న నది ప్రధాన కాళినది కాదని, అందువల్ల నదికి తూర్పున ఉన్న ఓం పర్వత్‌ ‌పర్వతాల శిఖరాల రేఖల ఆధారంగా అక్కడి సరిహద్దు ఉండాలి అని భారతదేశం పేర్కొంది. ఈ నది నేపాల్‌ ‌లోని  సుదూర్‌ ‌పశ్చీం ప్రావిన్స్, ‌భారత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌ ‌సరిహద్దులలో ఉంది.

సరిహద్దు వివాదాలు భారతదేశానికి తలకు మించిన భారంలా పరిణమించాయి. దీర్ఘకాలంగా పాకిస్తాన్‌, ‌చైనాలతో ఈ వివాదాలు కొనసాగుతుండగా, ప్రస్తుతం ఈ జాబితాలో నేపాల్‌ ‌వచ్చి చేరింది. మొదటి నుంచి నేపాల్‌ ‌పట్ల భారతదేశం సానుకూల వైఖరీనే పాటిస్తూ వస్తోంది. చిరకాలంగా స్నేహం, సాంస్కృతిక సంబందాలు కలిగిన పొరుగు దేశం ఇప్పుడు కయ్యానికి కాలుదువ్వడం భారత్‌ ‌ను అసహనానికి గురి చేస్తోంది. ఇంతటి సాహసోపేతమైన చర్యకు దిగడానికి నేపాల్‌ ‌కు ఊతమిచ్చిందెవరో బహిరంగ రహస్యమైనప్పటికినీ, ఆ అజ్ఞాతదేశం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. జమ్ము కాశ్మీర్‌ ‌పునర్విభజన అనంతరం భారతదేశం కొత్త రాజకీయ పటంను విడుదల చేసింది. ఇందులో నేపాల్‌ ‌సరిహద్దు ప్రాంతాలైన లిపులెక్‌, ‌కాలాపానీ, లింపియాధుర ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాలు తమ భూభాగాలేనని నేపాల్‌ ‌కొత్త వాదన మొదలు పెట్టింది. ఇంతకు ముందే ఈ భూభాగాలు తమవని చెబుతూ పార్లమెంటులో తీర్మాణం చేసిన నేపాల్‌, ఇప్పుడు ఏకంగా తమ రాజకీయ పటం స్వరూపాన్ని మారుస్తూ ఆ ప్రాంతాలను అందులో చేర్చడంతో కొత్త వివాదానికి తెర లేపినట్టైంది.భారత్‌-‌నేపాల్‌ ‌రాజకీయ, సాంస్కృతిక సంబందాలు ఈనాటివి కావు. అనాధిగా రెండు దేశాల మధ్య సానుకూల ద్వైపాక్షిక సంబందాలున్నాయి. నేపాల్‌ ‌తూర్పు, దక్షిణ, పడమరలలో సిక్కిం, పశ్చిమ బెంగాల్‌, ‌బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌ ‌మరియు ఉత్తరాఖండ్‌ – ‌మరియు ఉత్తరాన పీపుల్స్ ‌రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌చైనా యొక్క టిబెట్‌ అటానమస్‌ ‌రీజియన్తో 1850 కిలోమీటర్ల భౌగోళిక సరిహద్దులను పంచుకుంటుంది. 1950 నాటి భారత్‌-‌నేపాల్‌ ‌శాంతి ఒప్పందం ఇరు దేశాల మధ్య స్నేహ సంబందాలు మరింతగా ధృడతరం కావడానికి దోహదపడింది. ఈ ఒప్పందం కారణంగా నేపాల్‌ ‌కు అన్ని రంగాలలో భారతదేశం సహకారం అందించింది. సరిహద్దుల దగ్గర కూడ కఠినతర ఆంక్షలు లేకపోవడంతో ఎందరో నేపాలీలు ఇండియాలోకి రాగులుగుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఆరు మిలియనుల నేపాలీలు నివసిస్తున్నారు.

ఇండియాతో అనుకూల వైఖరిని ప్రదిర్శిస్తూనే అప్పుడప్పుడు సరిహద్దు వివదాలాను లేవనెత్తడం నేపాల్‌ ‌కు పరిపాటే. ఇండియా-నేపాల్‌-‌చైనా మూడు దేశాల సంయోగ ప్రాంతమైన కాలాపానీ, మరియు సుస్తాలు ఇరుదేశాల సరిహద్దు వివాధానికి ప్రధాన కారణం. కాలాపానీకి పశ్చిమాన ప్రవహించే నది కాళినదికి ప్రధాన నది కాబట్టి ఈ ప్రాంతం తమదేనని నేపాల్‌ ‌వాదిస్తోంది. అయితే కాలాపానీకి పశ్చిమాన ఉన్న నది ప్రధాన కాళినది కాదని, అందువల్ల నదికి తూర్పున ఉన్న ఓం పర్వత్‌ ‌పర్వతాల శిఖరాల రేఖల ఆధారంగా అక్కడి సరిహద్దు ఉండాలి అని భారతదేశం పేర్కొంది. ఈ నది నేపాల్‌ ‌లోని సుదూర్‌ ‌పశ్చీం ప్రావిన్స్, ‌భారత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌ ‌సరిహద్దులలో ఉంది. బ్రిటీష్‌ ఇం‌డియా-నేపాల్‌ ‌ల మధ్య 1816 మార్చి 4న జరిగిన సుగౌలీ ఒప్పందం ప్రకారం కాళీనది నేపాల్‌ ‌పశ్చిమ సరిహద్దుగా గుర్తించారు. నది మూలాన్ని గుర్తించడంలో గల వ్యత్యాసం భారతదేశం, నేపాల్‌ ‌మధ్య సరిహద్దు వివాదాలకు దారితీసింది. రెండు దేశాలు తమ సొంత వాదనలకు మద్దతుగా పటాలను తయారు చేస్తూ వివాదాన్ని మరింతగా పెంచేసాయి. భారత ప్రభుత్వం 1962 నుండి ఓం పర్వత్‌ ‌యొక్క శిఖర రేఖల ఆధారంగా సరిహద్దు ఉండాలి అనే వాదనను ముందుకు తెచ్చింది. కాళీనది మూలం చుట్టూ 400 కిలోమీటర్ల వివాదాస్పద ప్రాంతాన్ని కలిగి ఉంది. కాళీనది మీద జలవిద్యుత్‌ ‌కేంద్రం ఏర్పాటు చేయాలనే తీర్మాణాన్ని 1997లో నేపాలీ పార్లమెంటు ఆమోదించడంతో ఈ వివాదం మరింతగా జఠిలమైంది. 1962 నాటి భారత-చైనా యుద్ధం సందర్భంగా కాలాపానీ ప్రాంతాన్ని భారతదేశానికే చెందిన ఇండో-టిబెటన్‌ ‌భద్రతా దళాలు తమ నియంత్రణలో ఉంచుకున్నాయి. వివాదాస్పద కాలాపానీ ప్రాంతంలోని లిపులేక్‌ ‌కనుమ గుండా భారత-చైనా వర్తక వ్యాపారాల పట్ల 2015లో నేపాల్‌ ‌పార్లమెంట్‌ అభ్యంతరం తెలిపింది. కాలాపానీ మీదుగా వ్యాపారం చేయడం నేపాల్‌ ‌దేశ సార్వభౌమధికార హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొనడమే కాకుండా, భారత్‌ ‌సత్వరమే కాలాపానీ ప్రాంతం నుండి తమ దళాలను ఉపసంహరించుకోవాలని పిలుపినిచ్చింది. ఇండో-నేపాల్‌ ‌సరిహద్దును గుర్తించడానికి మొదటి దశగా, రెండు దేశాల సర్వే బృందాలు సరిహద్దులో తప్పిపోయిన స్తంభాలను గుర్తించాయి. కొన్ని ప్రదేశాలలో కొత్త స్తంభాలను నిర్మించడానికి ఒక ఒప్పందం కుదిరింది. నేపాల్‌ ‌ప్రభుత్వ అంచనాల ప్రకారం, సరిహద్దు వెంబడి ఉన్న 8000 సరిహద్దు స్తంభాలలో, 1,240 స్తంభాలు లేవు. అంతేకాకుండ 2,500 స్థంభాలు పునరుద్ధరణ దశలో ఉండగా, మరో 400 స్థంభాలను నిర్మించవలసి ఉంది. భారత్‌-‌నేపాల్‌ ‌సరిహద్దులను గుర్తించడానికి 1981లో జాయింట్‌ ‌టెక్నికల్‌ ‌లెవల్‌ ‌నేపాల్‌-ఇం‌డియా బౌండరీ కమిటీ (జెటిఎల్‌ఎన్‌ఐబిసి)ని ఏర్పాటు చేశారు. జెటిఎల్‌ఎన్‌ఐబిసి తయారుచేసిన చిరిగిపోయిన పటాల ఆధారంగా సరిహద్దు స్తంభాలపై సర్వే నిర్వహించాయి. సంవత్సరాల తరబడి చేసిన సర్వే, చర్చలు, పొడిగింపుల తరువాత కాలపాని,సుస్తాలను మినహాయించి కమిటీ భారతదేశం-నేపాల్‌ ‌దేశాల మధ్య 98 శాతం సరిహద్దును 182 స్ట్రిప్‌ ‌మ్యాప్లలో వివరించింది. 2007 లో రెండు దేశాల ధృవీకరణ కోసం ఈ పటాలను సమర్పించగా, ఏదేశం కూడా వీటిని ఆమోదించలేదు. సరిహద్దు వివాదాల పరిష్కారం లేకుండా పటాలను ఆమోదించలేమని నేపాల్‌ ‌ప్రకటించగా, మరోవైపు, నేపాల్‌ ఆమోదం కోసం భారత్‌ ఎదురుచూస్తోంది.

వాస్తవంగా నేపాల్‌ 1961 ‌నుండి 1997 వరకు కాలపాని సమస్యను విస్మరించింది. కాని దేశీయ రాజకీయ కారణాల వల్ల ఈ సమస్య 1998 లో భారత్‌-‌నేపాల్‌ ‌వివాదానికి అనుకూలంగా మారింది. నేపాల్‌ ‌తన భూభాగంలో భాగంగా లింపియాధురా, లిపులేఖ్‌, ‌కాలాపానీలను చూపించే సవరించిన రాజకీయ, పరిపాలనా పటాన్ని విడుదల చేసింది. ఈ సమస్య ఇక మీద మసకబారదని, ఇతురలకు కోపం వస్తే మేము ఏమీ చేయలేము. ఎటువంటి పరిస్థితులలోనైనా ఆ భూభాగాన్ని తిరిగి తెచ్చుకుంటామని ప్రధానమంత్రి కె.పి.ఓలి ప్రకటించడం భారత్‌ ‌ను ప్రత్యక్షంగా రెచ్చగోట్టే విధంగా ఉంది. జమ్మూ కాశ్మీర్‌ ‌రాష్ట్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడిన తరువాత నవంబరులో భారత్‌,‌నేపాల్‌ ‌మధ్య కార్టోగ్రాఫిక్‌ ‌విభేదాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మార్పును వివరించడానికి ఇండియా విడుదల చేసిన మ్యాప్లో లింపియాధుర, లిపులేఖ్‌, ‌కాలాపాని ప్రాంతాలు భారతదేశంలో భాగంగా చూపించబడ్డాయి. ఈ పటాన్ని తిరస్కరిస్తూ నేపాల్‌ ‌తమ ప్రభుత్వం తన అంతర్జాతీయ సరిహద్దును రక్షించడానికి కట్టుబడి ఉందని ప్రకటించింది. 1962 యుద్ధం అనంతరం ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోవడంతో భారత్‌-‌చైనాల మధ్య వర్తక సంబంధాలు కుంటుపడ్డాయి. ఇరు దేశాలు తమ మధ్య వర్తక వ్యాపార నిర్వహణ కోసం లిపులేఖ్‌ ‌కనుమను తెరువాల్సిన అవసరాన్ని గుర్తించాయి. అంతేకాకుండా మానస సరోవరం వెళ్ళే యాత్రికులకు కూడ ఈ మార్గం అనువుగా ఉంటుంది. అప్పటి వరకు ఈ ప్రాంతాన్ని విస్మరించిన నేపాల్‌ 1997‌లో మొదటిసారిగా ఈ భూభాగం ఇండియాది కాదని అభ్యంతరం వ్యక్తం చేసింది.

కాలాపానీ అంశం ఎందుకు వివాదాస్పదమైందో తెలుసుకోవాలంటే 1815-16 నాటి సుగౌలీ ఒప్పందాన్ని పునస్సమిక్షించుకోవడం ఎంతైనా అవసరం. దురదృష్టవశాత్తు ఈ ఒప్పందపు మూలప్రతి ఇప్పుడు లభ్యం కావడం లేదు. ఈ ఒప్పందం ప్రకారం మహాకాళి నది రెండు దేశాల మధ్య సరిహద్దుగా ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే 1962 యుద్ధానంతరం కాలాపానీని చైనా భారత భూభాగంగా గుర్తించగా, అప్పుడు నేపాల్‌ ఎటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేయకపోవడం గమనార్హం. అకస్మాత్తుగా భారతదేశంతో కయ్యానికి కాలుదువ్వే ధైర్యం నేపాల్‌ ‌కు ఎక్కడ నుంచి వచ్చిందనే విషయం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. చైనా నుండి వైద్య పరికాల దిగుమతిలో అవినీతితో పాటు మరో రెండు సమస్యాత్మక చట్టాలు అధికార నేపాల్‌ ‌కమ్యూనిస్ట్ ‌పార్టి ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెట్టాయి. వీటి నుంచి దృష్టి మళ్ళించడం ఎన్సిపికి అత్యంత ఆవశ్యకం. ఇండియాతో గల సరిహద్దులలో ఎక్కడ ఏమి జరిగినా అక్కడ చైనా దళాలు తమ ఉనికిని చాటుతున్నాయి. అయితే ఇటువంటి దురాక్రమణలు, అతిక్రమణలన్ని కూడ ఉన్నత స్థాయి మారకంతో ముడిపడి ఊటాయి. ఇటువంటి విషయాలలో సహజంగానే చైనా తన అంతర్గత మద్దతును భారత వ్యతిరేక దేశాలకు తెలుపుతుందనేది అందరికీ తెలిసిందే. కరోనావైరస్‌ ‌వ్యాప్తి విషయంలో పారదర్శకత లేకపోవడంపై చైనా ప్రపంచవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొంటోంది. అమెరికా, యూరోపియన్‌ ‌దేశాలు చైనాను దుమ్మెత్తిపోస్తున్నప్పటికిని భారత్‌ ‌నిశ్శబ్దంగా తన సొంత ఎత్తుగడలు వేస్తోంది. ఇదే సమయంలో భారత్‌ ‌ను కరోనా కంటే ప్రమాదకారి అంటూ నేపాల్‌ ‌చైనా మద్దతును సంపాదించే పనిలో పడింది. ఇదంతా ప్రపంచ దేశాల దృష్టి మరల్చడానికి చేసిన సృజనాత్మక ఆలోచన ఇది. ప్రస్తుతం ప్రపంచం భారతదేశ ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తోంది.

Leave a Reply