Take a fresh look at your lifestyle.

రక్షణ కవచమైన ఓజోన్‌కు చైనాతోనే ముప్పా?

కడుపులో ఉన్న బిడ్డకు రక్షణగా నిలిచే తల్లి, సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాలనుంచి భూమిపై నివసించే సకల జీవకోటికి రక్షణ కవచంగా నిలుస్తోన్న ఓజోన్‌ ‌పొర – రెండూ నిర్వర్తిస్తున్న ధర్మాలు ఒక్కటే అని చెప్పొచ్చు. పెరుగుతున్న జనాభా, వారి అవసరాలు, పారిశ్రామికీకరణ, అగ్రరాజ్యాల చర్యలు వెరసి రోజురోజుకూ పర్యావరణం విధ్వంసానికి గురవుతూ ఓజోన్‌ ‌పొర ఛిద్రమవుతున్నది. ఒక ఆక్సిజన్‌ అణువులో సాధారణంగా రెండు ఆక్సిజన్‌ ‌పరమాణువులు ఉంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆక్సిజన్‌ అణువుకు మరో ఆక్సిజన్‌ ‌పమాణువు జత చేరినప్పుడు ‘ఓజోన్‌’ అణువు ఏర్పడుతుంది. మూడు ఆక్సిజన్‌ ‌పరమాణువులతో కలసి ఏర్పడుతుంది గనుక ‘ఓజోన్‌’‌ను  ‘ట్రైయాక్సిజన్‌ (•3)’ అని కూడా అంటారు.

సూర్యుని నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమి మీద పడటం వల్ల సకల జీవరాసులకూ ముప్పు వాటిల్లుతోంది. ఆవేడిని తట్టుకునే సామర్థ్యం భూమిపై నివసించే జీవరాసులకు లేదనే చెప్పాలి. మనుషులు సైతం తట్టుకోలేని పరిస్థితి తలెత్తుతుంది. ప్రకృతి గతి తప్పుతుంది. భూమిపైన 15 నుంచి 25 కిలోమీటర్ల వరకూ ఉండే రెండో పొరను ఓజోన్‌ ‌పొర (ఓ3) అంటారు. ఈ పొర సూర్యుని నుంచి వెలువడే కిరణాలు నేరుగా భూమి మీదకు చేరకుండా అందులో ఉండే అతినీల లోహితకిరణాలను సంగ్రహిస్తుంది. తద్వారా ప్రాణ కోటికి వాటిల్లే ముప్పు నుంచి కాపాడుతోంది. ఓజోన్‌ ‌పొర.  అంతర్జాతీయ ఓజోన్‌ ‌పరిరక్షణ దినం ప్రతిఏటా సెప్టెంబర్‌ 16‌న ప్రపంచం వ్యాప్తంగా నిర్వహించబడుతోంది. ఓజోన్‌ ‌పొరను దెబ్బతీస్తున్న పదార్ధాల నియంత్రణకు గానురూపొందించిన మాంట్రియల్‌ ‌ప్రొటోకాల్స్‌పై ప్రపంచదేశాలు 1987 సెప్టెంబర్‌ 16‌న సంతకాలు చేశాయి. భూమి మీద• కాలుష్యం కారణంగా దెబ్బతింటున్న ఓజోన్‌ ‌పొరను పరిరక్షించేందుకు ఈ ఒప్పందాన్ని రూపొందించారు. తర్వాత 1995 నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 16‌న అంతర్జాతీయ ఓజోన్‌ ‌పరిరక్షణ దినంగా జరుపుకుంటున్నారు. ఓజోన్‌ ‌పొర రక్షణ కోసం రూపొందించిన మాంట్రియల్‌ ‌ప్రొటోకాల్స్‌పై ప్రపంచ దేశాల మధ్య ఒప్పందం కుదిరిన సందర్భంగా ఈ తేదీని ఓజోన్‌ ‌పరిరక్షణ దినంగా ప్రపంచమంతటా జరుపుకుంటున్నారు. ప్రపంచాన్ని ఆవరించిన పలుపర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి కలిసికట్టుగా పని చేయాలనే ఆశాభావాన్ని ఈఓజోన్‌ ‌పరిరక్షణ దినం అందిస్తోంది. దశాబ్దాలుగా మానవులు జరిపిన పరిశోధనల పలితమే ఈ మాంట్రియల్‌ ‌ప్రొటోకాల్‌. ఓజోన్‌ ‌పొరను దెబ్బతీసేలా వాతావరణంలో విడుదల అవుతున్న రసాయనాలను ఇది నిర్ధారించింది.

భూమిపై భాగంలో స్ట్రాటోస్పియర్‌ ఆవరణంలో ఉన్న ఓజోన్‌ ‌పొర భూమ్మీదికి వచ్చే అన్ని విశ్వకిరణాలను అడ్డుకుని భూమిని పరిరక్షిస్తోంది. రసాయన కాలుష్యాల ప్రభావఫలితంగా ఓజోన్‌ ‌పొరకు చిల్లుపడినట్లయితే సూర్యుడి నుంచి అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమ మీదకు ప్రసరించి మానవజాతికి, సమస్త జీవజాతులకు ప్రమాదకారిగా మారతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 30 లక్షల మంది చర్మ కేన్సర్‌ ‌బారినపడుతున్నారు. వీరిలో 20 శాతంపైగా రోగులు సూర్య కాంతి నేరుగా సోకిన ఫలితంగా కేన్సర్‌ ‌బారిన పడుతున్నారని ఒక అంచనా.

ఓజోన్‌ ‌పొర ఇప్పుడెలా ఉంది?
గ్లోబల్‌ ‌వార్మింగ్‌, ‌పర్యావరణ మార్పుల పర్యావరణ మార్పుల వల్ల  ఓజోన్‌ ‌పొర క్రమంగా దెబ్బ తింటూవస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో చేపట్టిన కార్యక్రమాల వల్ల  2030 నాటికి ఉత్తరార్థగోళంలో దెబ్బ తిన్న ఓజోన్‌ ‌పొర బాగు చేయబడుతుంది. 2050 నాటికి దక్షిణార్థగోళంలో, 2060 నాటికి  ధ్రువ ప్రాంతాలో్ల దెబ్బతిన్న ఓజోన్‌ ‌పొర బాగు చేయబడుతుంది. మాంట్రియాల్‌ ‌ప్రొటోకాల్‌ ‌పరిధిలోకి రానిరసాయనాలు కొన్ని ఇప్పటికీ వాడకంలో ఉండగా ప్రస్తుతానికి వీటితో పెద్దగా సమస్యలేవీ లేక పోవడం కొంత ఊరట నిచ్చేఅంశం. ఓజోన్‌ ‌పొరకు ఏమాత్రం హాని కలిగించని శీతలీకరణ రసాయనాలను కనుగొనడం ఇంకో సవాలైతే, ప్రస్తుతం వాడకంలో ఉన్న వాయువులను సురక్షితంగా నాశనం చేయడం కూడా పెద్ద సమస్యగానే ఉంది.

ఓజోన్‌ ‌రంధ్రం పెద్దది కావడానికి చైనా కారణమా..?
చైనాలో ఇళ్ల ఇన్సులేషన్లో ఉపయోగిస్తున్న రసాయనమే ఓజోన్‌ ‌పొరను తీవ్రంగా దెబ్బ తీస్తోందని భావిస్తున్నారు. చైనాలో సీఎఫ్సీ-11ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారని పర్యావరణ పరిశోధన సంస్థ (ఈఐఏ) గుర్తించింది. నిజానికి ఈ గ్యాస్‌ను 2010లోనే నిషేధించారు. కరెంటు బిల్లులను తగ్గించడానికి ఇన్సులేషన్లో ఉపయోగించే పాలీయురేథేన్‌ ‌ఫోమ్‌ ‌తయారీలో సీఎఫ్సీ-11 సమర్థవంతమైన ‘బ్లోయింగ్‌ ఏజెంట్‌’‌గా ఉపయోగపడుతుంది. అందుకే చైనా గృహ నిర్మాణ పరిశ్రమలో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. రసాయన ఆయుధాలకు ఉపయోగపడే యురేనియంను శుద్ధి చేయడంలో కూడా దీనిని ఉపయోగిస్తున్నట్లు ఇటీవల కొన్ని వదంతులు వినిపిస్తున్నాయి.అయితే ఇన్సులేషన్‌ ‌కారణంగానే ఓజోన్‌ ‌రంధ్రం పెద్దది అవుతోందన్నది మాత్రం స్పష్టం.

ఈఐఏ ఏజెంట్లు చైనాలోని 10 ప్రావిన్స్‌లో  ఆ ఫోమ్‌ను తయారు చేసే యూనిట్లను సందర్శించారు. అక్కడ పాలీయురేథేన్‌ ఇన్సులేషన్‌ ‌తయారీలో సీఎఫ్సీ-11ను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం70 శాతం పాలీయురేథేన్ను ఈ గ్యాస్‌ ‌ద్వారానే తయారు చేస్తున్నారు. దీనికి కారణం దాని నాణ్యత, తక్కువ ధరకే లభించడం.అయితే సీఎఫ్సీ-11 వినియోగాన్ని నియంత్రించడంలో చైనా అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పాలీయురేథేన్‌ ‌ఫో•మ్‌ ఉత్పత్తిలో చైనాలో ఉత్పత్తి అవుతున్నదే మూడో వంతు ఉంది. అందువల్ల సీఎఫ్సీ-11ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఓజోన్‌కు పడిన రంధ్రాన్ని పూడ్చేయడానికి పట్టే సమయం మరో దశాబ్దం లేదా అంత కన్నా ఎక్కువ కాలం పెరుగుతుంది.ఓజోన్‌కు రంధ్రాన్ని చేసే ఉత్పత్తులను నిషేధించే మాంట్రియల్‌ ‌ప్రొటోకాల్లో చైనా కూడా సభ్య దేశమే. ఆ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించిన దేశాలపై వాణిజ్య పరమైన ఆంక్షలను ఉపయోగించవచ్చు. కానీ ప్రొటోకాల్స్‌పై సంతకాలు చేసిన నాటి నుంచి ఎన్నడూ ఏ దేశంపై అలాంటి ఆంక్షలను విధించ లేదు. అయితే నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటేనే పరిస్థితి మెరుగు పడుతుందని ఈఐఏకు చెందిన మహాపాత్ర అన్నారు.

ఓజోన్‌ ‌పొరను కాపాడుకోవాలంటే..
ఓజోన్‌ ‌పొరను దెబ్బతీసే పదార్థాల వాడకాన్ని గణనీయంగా తగ్గించుకోవాలి.రసాయనిక ఎరువుల వాడకాన్ని, పురుగుమందుల వాడకాన్ని గణనీయంగా తగ్గించుకోవాలి. ప్రత్యామ్నాయంగా సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలి. రసాయన పురుగు మందులకు బదులు సేంద్రియ పురుగు మందులను వాడాలి.పెట్రోలియం ఉత్పత్తుల వాడుకను తగ్గించుకోవాలి. ప్రయాణాల కోసం ప్రైవేటు వాహనాలను విచ్చలవిడిగా వాడే బదులు వీలైనంతగా ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలి. పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌వంటి ఇంధనాలతో నడిచే వాహనాల నుంచి వెలువడే పొగ ఓజోన్‌ ‌పొరను దెబ్బతీస్తుంది. ఇళ్లల్లో, కార్యాలయాల్లో, పరిశ్రమల్లో రసాయనాలతో తయారైన క్లీనింగ్‌ ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించుకోవాలి. వీటిలో వినియోగించే రసాయనాలు ఓజోన్‌ ‌పొరకు తీవ్రంగా దెబ్బతీస్తాయి. వీటి బదులు పర్యావరణానికి చేటు చెయ్యని క్లీనింగ్‌ ఉత్పత్తులను వాడుకోవాలి. ఏసీలు, రిఫ్రిజిరేటర్లలో ఏవైనా లీకేజీలు ఉన్నాయా.. అన్నది తరచూ పరీక్షించాలి.  రిఫ్రిజరేటర్‌ ‌వెనుక భాగాని• •గాలి తగిలేలా ఉంచడం, ఫ్రీజర్‌ ‌బాక్స్‌ల్ల్లో తగినంత ఉష్ణోగ్రత ఉండేలా, ఉపయోగంలో లేనప్పుడు ఆఫ్‌ ‌చేయడం, ఏసీ విషయంలోనూ తగిన చర్యలు తీసుకోవాలి. వీటి వాడకం ఎంత తగ్గిస్తే అంతమంచిది. మాంట్రియల్‌ ఒడంబడిక తర్వాత దానిపై సంతకాలు చేసిన దేశాలు క్లోరోఫ్లోరోకార్బన్‌ ‌రసాయనాల వాడుకను గణనీయంగా తగ్గించుకున్నాయి. అయితే, ఈఒడం బడికలో ఓజోన్‌ ‌పొరకు ప్రమాదకరమైన నైట్రస్‌ఆక్సైడ్‌ను చేర్చలేదు. నైట్రస్‌ ఆక్సైడ్‌ ‌వాడుకను కూడా కట్టడి చేస్తేనే ఓజోన్‌ ‌పొరను కాపాడు కోగలుగుతాం. మనుషులు కాలుష్య రహితంగా చేపట్టే ప్రతి పనీ ఓజోన్‌ ‌పరిరక్షణకు చేరువ చేస్తుంది. వియన్నా కన్వెన్షన్‌ ‌మరియు మాంట్రియల్‌ ‌ప్రొటోకాల్లో భాగమైన భారత్‌, ఓజోన్‌ ‌పరపరిరక్షణకు సంబంధించి ప్రపంచ ఆందోళనలో పాలుపంచుకుటోంది. ఎఫ్సి, హాలోన్స్, ‌సిటిసిమిథైల్‌ ‌క్లోరోఫారం, మిథైల్‌ ‌బ్రొమైడ్‌ ‌మరియు హెచ్‌సి, ఎఫ్సిమ్‌ ‌వంటి ఓజోన్‌ను బలహీన పర్చే పదార్ధాల తయారీని నియంత్రించేందుకు భారత్‌ ‌నడుంకట్టింది.

md quaza
డా।। ఎండి ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్, 9492791387

Leave a Reply