Take a fresh look at your lifestyle.

పొంచి ఉన్న కొరోనా సెకండ్ వేవ్ ప్రమాదం 

*పండుగ రోజుల్లో ముందు జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న  వైద్య నిపుణులు 
తెలంగాణలో  కొరోనా సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొరోనా భయంతో గత
 6 నెలలుగా జాగ్రత్తలు పాటిస్తున్న ప్రజలు విసిగిపోయి ఈమధ్య పేస్ మాస్క్ లు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారు. కేసులు సంఖ్య తగ్గుతున్న దృష్ట్యా మళ్ళీ కొరోనాకు ముందు ఉన్న అలవాట్లతో నిర్లక్ష్యం వహిస్తున్నారు.  గ్రామాలు మొదలు నగరాల వరకు ప్రజలు వివిధ పనుల మీద రోడ్లపైకి వస్తున్నారు. తెలంగాణాలో ఇప్పటికీ ప్రతీ రోజు దాదాపు 1900కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.మరోవైపు మళ్ళీ లొక్డౌన్ విధించే అవకాశాలు లేవని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది. ఈ కారణాలతో  దేశంలో కోవిడ్‌-19 ‘‘సెకండ్‌ వేవ్‌’’కు ఉన్న స్పష్టమైన అవకాశాలున్నాయని
వైద్యులు  పేర్కొంటున్నారు.  దీనిపై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్  అపోలో హాస్పిటల్ కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ న్యూరోలాజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్‌-19 ముందు జాగ్రత్తలతో ప్రజులు అలసిపోయి ప్రస్తుతం వాటి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పారు.   ప్రస్తుతం చాలామంది ఫేస్‌ మాస్క్‌లు లేకుండా బయట తిరుగుతున్నారనీ  సామాజిక దూరం నియమాన్ని కూడా చాలా సందర్బాలో పాటించడం లేదన్నారు .  తరుచుగా చేతులు సబ్బుతో కడుక్కోవాలనే నిబంధనలను గాలికి వదిలేశారని దసరా దీపావళి ‌ సంక్రాంతి వంటి ముఖ్యమైన పండుగలలో తగినంత సామాజిక దూరం పాటించడం కష్టమని అభిప్రాయపడ్డారు. అందువల్ల బహిరంగ ప్రదేశాలో ఫేస్‌మాస్కును ధరించడం,  అన్ని  సందర్బాలలో సామాజిక దూరం పాటించడం, తరచుగా చేతులను సబ్బుతో కడగడం వంటి ముందు జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని చెప్పారు.
వినోద ప్రయాణాలను పరిమితం చేసుకోవాలనీ హాస్పిటల్‌ మౌలిక సదుపాయాలను  పెంచుకోవాలనీ సూచించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply