Take a fresh look at your lifestyle.

ప్రమాద ‘‘గంటలు’’!..

“పనిగంటలు పెంచుతే  కేవలం పారిశ్రామిక రంగానికే తిప్పలు గని మనకేం కాదని అనుకునేరు, ఇది కొరానా తీర్గ పుట్టుకచ్చిందంటే అన్ని రంగాలకు అంటుకచ్చే లక్షణముంటది. అంటుకునుడు మొదలయితే ఆగేకతలేదిక. పైలంగుండాలె మరి! జరంత యెక్కువ మంది గూడే ఐ.టి., ఫార్మా రంగాలను ఆగం జేషి లక్షల ఉద్యోగాలకు పొతం బెడ్తది. ఇప్పటికే లాక్‌ ‌డౌన్‌ ‌తోని ఉపాధి, ఉద్యోగాలు పొయిన లక్షల కుటుంబాలు ‘దిక్కు దివానం’ లేకుంటైనయి. దేశమంత అమ్ముడు కొనుడు బ్యారాలు తగ్గుతానయి. మార్కెట్లన్నిదివాల్‌ ‌దీత్తానయి. రొండు మూడేండ్ల దాంక ‘‘కొత్తసరుకుల తయారు బందయి ఉపాధి అవకాశాలు జాడపత్త లేకుంటైతయి.”

yelamandhaమందిగూడి మర్లబడి ఉద్దెమాలు జేత్తె మాట ముచ్చటలేకుంట, లోపటేషి కేసులల్ల ఇరికిచ్చుడే ఇప్పుడు మనం జూషేటి ‘‘ప్రజాస్వామ్యం’’. మర్లబడే స్ఫూర్తిని, దాని పునాదుల్ని జనాలల్ల పలుసన జేసే కుట్రలే పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ ‌శక్తులు కోరుకునేటి ‘‘కొత్త ప్రజాస్వామ్యం’’. రంగు, రూపులు మార్సుకోనున్న ప్రజాస్వామ్యంల చట్టాలన్ని ఎవలి సుట్టాలైతయనేదాంట్ల యెసోంటి అనుమానం లేదు. ‘‘మేకినిండియా’’ పుణ్డేన సమాదై••న కార్మిక చట్టాల తిప్పలింకా ‘‘కాముని మంటో’’లిగె రగుల్తెనే వుండె, సెగ తగుల్తనే వుండె! కొరోనా కష్టకాలంల మళ్ళో కొరోనా బీమారాసోంటి కార్మికచట్టం పుట్టుకచ్చే మోపయితాంది. శ్రమజీవుల్ని ఏకం జేషే ‘‘మేడే’’ రోజు స్ఫూర్తిని, ఆ రోజు ఎగిరేషే ఎర్రజెండా రెపరెపల మీద కన్నేషిన కార్పొరేట్‌ ‌శక్తులు, సర్కార్‌ ఉమ్మడిగ’’కొత్త’’ కత్తులేందో నూరే పని మీదున్నయి. ఇప్పటికే అడ్డగోలుగా శ్రమదోపిడికి దిగిన పెట్టుబడిదారి, కార్పొరేట్‌ ‌శక్తులు కొరోనా బీమారి లాక్‌ ‌డౌన్‌ ‌సాకు సూపి పనిగంటలు పెంచే చీకటి చట్టాన్ని సడిసప్పుడు లేకుంట తెచ్చేటట్టున్నది.

లాక్‌ ‌డౌన్‌ అయినంక నౌకరుంటదో, ఊడ్తదో తెల్వని ఆగంల లక్షలాది సంఘటిత కార్మిక కుటుంబాలు ఆగమైతానయి.! కొరోనా కాలపు కరువు తిప్పలు పగోనికి సూత రావద్దని నెత్తినోరు కొట్టుకునే బక్కజీవుల బాధలిట్లుంటె, పులి మీద పుట్రన్నట్టు వాళ్ళ పనిగంటల హక్కుమీద కత్తి నూరుడంటె ‘మోకా’ జూషి దెబ్బేసుడు’’కాదా!?
ఎవలన్న కత్తి నూరుతాండ్లంటే ఒల్లెక్కాలకు నూరుతరా! కోసుడు, నరుకుడు యవారం వుంటదన్నెట్టే కదా! సర్కారేందో మళ్ళ కత్తి నూరుతాందంటె నూరదా! ‘‘ఆడిచ్చేటోళ్ళ’’ కొత్త అవుసరాలు బట్టి ‘‘ఆడేటోళ్ళు’’ ఆడకుంటుంటరా! దేశంలున్న పబ్లిక్‌, ‌ప్రయివేట్‌ ‌రంగాల పరిశ్రమల్ని పాడెక్కిచ్చి, సావుడప్పు గొట్టిన పెట్టుబడిదారోళ్ళకు కొరోనా కొత్తంగ సందయింది. లాక్‌ ‌డౌన్‌ ‌కాలంల ఎటమటమైన వాళ్ళ ఖజానా ‘ఆకలి, దూప’’ తీరేందుకు ఇప్పడున్న బక్కజిక్కిన కార్మికుల చెమటలావిరయ్యే ‘‘ఎనిమిది’’గంటలు సాలుతలేనట్టు గొడుతాంది. పెట్టుబడులు అనుకున్నంత బాగ ‘‘గుడ్లు’’ పెడ్తలేవని పెట్టుబడి దారురులకున్న బాధకంటే, వాళ్ళరుసుకునే మన ‘‘దేశభక్త’’ పాలకులకే జరింత ఎక్కువ బాధ గాబట్టింది. కార్పొరేట్‌ ‌పెట్టుబడిశక్తుల పెదాల మీద నవ్వుల కోసం పేద కార్మికుల నెత్తుటి ధారల్ని జర్రింత యెక్కువ పిండేటందుకు ‘‘మేకిన్‌ ఇం‌డియా’’కత్తి మళ్ళోపాలి నూరే పనిబెట్టుకున్నరు. పన్నెండు గంటల పనిదినం చట్టం జేషేందుకు ‘‘మేకినిండియా’’ మళ్ళోపాలి అంగీ, లాగు తొడుగబట్టింది.

సుప్రీంకోర్ట్ ‌చెప్పిన ‘‘సమాన పనికి సమాన వేతనం’’ అనే ముచ్చట నోటికింత ‘‘మాస్క్’’‌గట్టుకున్నట్టున్నది. ఇప్పటికే అనేక పాతచట్టాల్ని బొందలేషి కొత్తగ కార్మిక వ్యతిరేక చట్టాలను తెచ్చిన కేంద్ర సర్కార్‌ ‌రేపటి రోజులల్ల సంఘటిత కార్మిక లోకపు హక్కులను లేకుంట జేషే కుట్రలకు సిద్దమైతాంది. ఒప్పంద కార్మిక చట్టాల ‘సట్టుబండలై’నంక యజమానుల ‘‘హుకుం’’లే కొత్త చట్టాలుగ చలామనీ అయ్యేటి మార్పులచ్చినయి. దేశీయ బడాపెట్టుబడిదారులే ‘కొత్త రూపాల’తోని విదేశీ పెట్టబడులుగా దిగబడేటి ‘చిత్రకత’ల కంపెనీలల్ల చట్టాలకు దిక్కుమొక్కూ లేకుంట బోతాంది! లక్షల సంఖ్యలో సంఘటిత, కాంటాక్ట్ ‌కార్మికవర్గం ఉపాధి అవకాశాలను బొందబెట్టే కంపెనీలకు కొరోనా సంక్షోభం మరింత తోడయింది. కార్మిక సంక్షేమ, ఫ్యాక్టరీ శాఖల అజమాయిషీలు ‘‘దమ్మీడి మే లాల్‌ ‌లాల్‌’’ అయినయి. కనీస హక్కులు లేని అసంఘటిత కార్మికులు, వలస కార్మికుల లెక్కలు, వాళ్ళ దుర్భర బతుకులు కొరోనా లాక్‌ ‌డౌన్‌ ‌జేబట్టి వెలుగు జూషినయి. లక్షలాది మంది భారత వలస జీవుల శ్రమ దోపిడిని ప్రపంచమంత ఇడ్డూరంగ జూడ బట్టింది.
కార్మికచట్టాల పరిధులకు రాకుంట శ్రమదోపిడికి గురయ్యే లక్షలమంది వలస కార్మికుల శ్రమను దోసుకుంటున్న యాజమాన్యాలపై ఫ్యాక్టరీల చట్టాలు, సర్కార్‌ ‌యే చర్యలు తీసుకున్న దానే సంగతులు తేలాలె! కరోనా లొల్లిల పెట్టుబడిదారుల వ్యాపార సామ్రాజ్జాలు కలలు చెదిరినయి. లాభాల లెక్కలు తిర్లమర్లయినయి. వలస కార్మికులు ఇండ్లదారి బట్టుడు వారికిప్పుడు ఊహించని కొత్త తిప్పలయింది! ఉత్పత్తి చక్రం తిరుగుడాగె! లాక్‌ ‌డౌన్‌తోని మార్కెట్లు లేక సరుకు మూలకు బడ్డది.! సల్లబడ్డ బేరాలతోని హైబతైన యాపారాలన్ని పెట్టుబడులకు రెట్టింపు లాభం కానత్తెనే తప్ప లెక్కలు పాణం పోసుకోవనేది నిజం. గీ సందుల్నేఇప్పుడున్న కార్మిక చట్టాలను సవరించేందుకు సర్కార్‌ ‌చట్టసభల సమావేశాల కోసం సూడబట్టింది పనిగంటలు పెంచే సర్కార్‌ ఆలోచన కొత్తదేం కాదు, ఆమద్ద్ధెనప్పుడో జేద్దామనుకున్న తొమ్మిదిగంటల పనిదినం చట్టాన్ని ఇప్పుడు గెలికిచ్చి, ‘‘పన్నెండు గంటల’’ పనిదినంగ చట్టం జేయనున్నది. ఎనిమిదిగంటల పనిదినం కోసం నెత్తుటి త్యాగాలు జేషిన మేడే ఎర్రజెండా చిన్నబోయేటి గీ చట్టాన్ని కొరోనా లాక్‌ ‌డౌన్‌ ‌తాళం తీషినంక సల్లంగ బయటికి తెచ్చే యవారం మోపైతాంది.

పనిగంటలు పెంచుతే కేవలం పారిశ్రామిక రంగానికే తిప్పలు గని మనకేం కాదని అనుకునేరు, ఇది కొరానా తీర్గ పుట్టుకచ్చిందంటే అన్ని రంగాలకు అంటుకచ్చే లక్షణముంటది. అంటుకునుడు మొదలయితే ఆగేకతలేదిక. పైలంగుండాలె మరి! జరంత యెక్కువ మంది గూడే ఐ.టి., ఫార్మా రంగాలను ఆగం జేషి లక్షల ఉద్యోగాలకు పొతం బెడ్తది. ఇప్పటికే లాక్‌ ‌డౌన్‌ ‌తోని ఉపాధి, ఉద్యోగాలు పొయిన లక్షల కుటుంబాలు ‘దిక్కు దివానం’ లేకుంటైనయి. దేశమంత అమ్ముడు కొనుడు బ్యారాలు తగ్గుతానయి. మార్కెట్లన్నిదివాల్‌ ‌దీత్తానయి. రొండు మూడేండ్ల దాంక ‘‘కొత్తసరుకుల తయారు బందయి ఉపాధి అవకాశాలు జాడపత్త లేకుంటైతయి. చిన్న, మధ్ధె తరగతి పరిశ్రమలన్ని కుప్పకూలే గొట్టుదినాలు కానత్తయి. గీ సందు జూస్కోని సర్కార్‌ ‌కార్మికులనింక ఆగం జేషే చట్టాలు తీసుకత్తది. అసొంటి వాటిల్ల ముందుగాల్ల పన్నెండు పనిగంటల చట్టాన్ని తెచ్చేందుకు ముగ్గు పోషే ప్రయత్నం జేత్తాంది, అందుకు కొరోన కాలాన్ని అడ్డంబెట్టుకునే అవకాశం కలిషొచ్చింది. రిజర్వ్ ‌బ్యాంక్‌ ‌గవర్నర్‌ ‌సార్‌ ‌మాటలతోని, బ్యాంకులకు బరోసా కల్పిచ్చి, లచ్చకోట్లియ్యంగనె ఆగిపొయిన ‘‘కొత్తల’’ బండ్లు మళ్ళ కదిలెటట్టున్నయి. మొత్తానికి ‘‘దేశం ‘‘తాకట్ల’’ బడకుంట ఆదుకుంటాన’’! అనే ఇగురంమాగనే ‘‘నూమాష్‌’’‌ల తీర్గ సూపెట్టుకత్తాండ్లు.

పొయిన ఆరేండ్ల కాలంల గద్దెనెక్కిన పార్టీలు అమలు జేషిన ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాల మీద పోరాటం జేషే శక్తుల ఉనికి సన్నగిల్లిందనాలె!. తొంబయికి పైన కార్మిక చట్టాలను బొందబెట్టిన ‘‘మేకినిండియా’’అమలు లొసుగులపై పిడికెలెత్తిన పోరాటాలు బలంగనైతె కాన్రాలె! ఇప్పడు సర్కార్‌ ‌కార్మిక వ్యతిరేక చట్టాలు జేషేందుకు అడ్డురాని కొరోనా సంక్షోభం అ చట్టాలలొసుగులను ప్రశ్నించే ఉద్యమాలకు మాత్రం అడ్డచ్చుడు ఖాయంగున్నది. ప్రజల దృష్టిలో ఈ ఉద్యమాలు దేశ వ్యతిరేకమని ప్రచారం జేసుట్ల ‘‘పరివార సైనికులు’’ ముందుంటరు. పన్నెండు గంటల పనిచట్టం వ్యతిరేకించే ప్రజాస్వామిక శక్తులు ‘‘దేశ భక్తి’’లేనోళ్ళని ‘‘విద్వేషభక్తి’’ రగిలిస్తరు. అటెంక కొరోనా ‘‘కాడు’’ సల్లవడ్డంక ఈ చట్టం ఎంత ప్రమాదకరమైందనేది ప్రజలకుతెల్వకుంట తీయటి ‘‘చాయి’’ సందేశమోటి టి.వీ.లల్ల దేశభక్తిని గుమ్మరిస్తది. యేండ్ల సంది సాధించుకున్నతొంబయికి పైగా హక్కులు కోల్పోయిన కార్మిక లోకం మర్లబడి రోడెక్కింది లేదు. మేడే జెండా సాక్షిగా, పన్నెండు గంటల పనిదినం చీకటి చట్టాన్ని నిలువరించేందుకు కార్మిక సంఘాలు జేషే ఐక్యపోరాటలే తప్ప ఇంకో దారి లేదని గుర్తించాలె! ‘‘సూడ్రా బయ్‌! ‘‘ఇ‌క్రమార్క్’’! ‘‘ఇప్పటిదాంక ఇంటివి కదా! పన్నెండు గంటల పనిదినం చట్టమైతె దేశ సంపద పెరిగే అవకాశాలుంటయి కదా! కలిసొచ్చి దేశభక్తిని చూపాలె గని, ఆ చట్టాన్ని ఎదురిచ్చి దేశద్రోహం చేసుడు మంచిదేనా? నా ప్రశ్నకు జవాబు చెప్పకపోతె కొరోనా తగుల్తదని శాపం బెడ్తాన’’! అని బెదిరియ్య బట్టిన భేతాళుని శవాన్ని ఎప్పటి తీర్గనే భుజానేసుకొని ‘‘ఇను!భేతాళ్‌! ఓవర్‌ ‌టైం కట్టిస్తమని లొట్టపీసు కతలు జెప్పి పన్నెండు గంటల పనిదినం చట్టం తెచ్చుడు దేశభక్తిగా, అంతర్జాతీయ కార్మిక దినం మేడే విలువలను లేకుంట జేషే కుట్రను ఎదిరిచ్చేటోళ్ళందరు దేశద్రోహులుగ ప్రచారమవుడే కార్పొరేట్‌ ‌శక్తుల కుట్ర. కార్మికుల పోరాట స్ఫూర్తికి ‘దినం ముట్టిచ్చే’ యవారాలకు దేశభక్తి, దేశసంపద పెరుగుడని రంగు పూస్తె కార్పొరేట్‌ ‌శక్తుల కుట్రబాజి కతలని జనానికి తెల్వకుండుంటదా గని !’’ అని జెప్పుకుంట నడ్వబట్టిండు..నడ్వబట్టిండు..

– ఎలమంద, తెలంగాణ

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!