Take a fresh look at your lifestyle.

ప్రియుడి చేతిలో మోసపోయిన దళిత యువతి

Dalit young woman cheated in boyfriend

నెక్కొండ : నాలుగు సంవత్సరాలుగా ప్రేమించి ఓ దళిత యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఓ ప్రభుద్దుడు ముఖం చాటేసిన సంఘటన మండలంలోని పెద్దకొర్పోల్‌ ‌గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే పెద్దకోర్పొల్‌ ‌గ్రామానికి చెందిన గంట వినయ్‌ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువతులతో ప్రేమాయణం కొనసాగించి మాయ మాటలు చెప్పి ఇద్దరిని నమ్మించి వివాహం చేసుకుంటానని నమ్మ బాలికడు. ఇది ఇలా ఉండగా ఇటీవల కాలంలో వీరిలో ఒకరైన దళిత యువతి హైదరాబాదులో ఓ ప్రైవేట్‌ ‌కంపెనీలో పని చేస్తుండగా ప్రేమికుడు అక్కడికి వెళ్లి అదే కంపెనీలో పని చేస్తూ  ఆ యువతిని లోబర్చుకోవడమే కాకుండా ఈ నెల 27వ తేదీన పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు.

దీంతో ఆ యువతి గ్రామానికి చేరుకుందు. గురువారం ఆ యువకుడు మరో యువతితో పారిపోయి వివాహం చేసుకున్నట్లు తెలియడంతో మోసపోయామని తెలుసుకున్న యువతి గురువారం ఉదయం ఇంటి ముందు బైఠాయించి న్యాయం చేయాలని కోరగా గ్రామస్తుల కోరికమేరకు స్థానిక పోలీస్‌ ‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇదే విషయంపై ఎస్సై నాగరాజును వివరణ కోరగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Leave a Reply