Take a fresh look at your lifestyle.

దళిత ద్రోహి జగన్‌….

‌ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లాలి
టిడిపి హయాంలోనే దళితులకు న్యాయం
దళితవర్గాల ఆత్మీయ సమ్మేళనంలో టిడిపి అధినేత చంద్రబాబు

గుంటూరు, ఏప్రిల్‌ 28 : ‌తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతే ఎస్సీ, ఎస్టీలకు అన్ని రకాల పథకాలు, పదవులు దక్కాయని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో దళిత వర్గాలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.ఎస్సీ కాలనీల్లో రహదారులు సహా అన్ని సౌకర్యాలు కల్పించామని.. 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. టిడిపి హయాంలో మొత్తం 28 పథకాలు ఇస్తే.. వైకాపా గెలిచాక కార్పొరేషన్‌లు పెట్టడం తప్ప ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ ‌పెట్టడమే కాదు.. అమలు చేసే పరిస్థితి ఉండాలని సూచించారు. 2001లో జస్టిస్‌ ‌పున్నయ్య కమిషన్‌ ‌వేశామన్నారు. అంబేడ్కర్‌ ‌విదేశీ విద్యా పథకం తీసుకొచ్చామని తెలిపారు. ఇప్పుడు ఆ పథకానికి అంబేడ్కర్‌ ‌పేరు తీసేసి.. జగన్‌ ‌పేరు పెట్టుకున్నారని చంద్రబాబు విమర్శించారు. గడప గడపకు వెళ్లాలన్నాడు.. స్టిక్కర్‌ ‌వేయమంటున్నాడు. జగన్‌ ‌ఫొటో ఉండాల్సింది ఇంటి తలుపుల ద కాదు.. పోలీస్‌ ‌స్టేషనులో జగన్‌ ‌ఫొటో ఉండాలని బాబు అన్నారు.

యర్రగొండపాలెంలో మనపైనే దాడి చేసి.. మనకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలనుకున్నారని మండిపడ్డారు. జగన్‌ ‌కోడి కత్తి డ్రామా ఆడారన్నారు. జగన్‌ ‌కళ్లల్లో ఆనందం చూడడానికి కత్తితో పొడిచానని.. కోడికత్తి శీనే చెప్పాడని తెలిపారు. కోడికత్తి శీనును ఐదేళ్లుగా జైల్లో మగ్గేలా చేస్తున్నారని.. ఏ మాత్రం అవకాశం ఉన్నా కోడికత్తి శీనును కూడా చంపేస్తారేమో అంటూ అనుమానం వ్యక్తం చేశారు. సలహాదారులు గా దళితులను ఎందుకు నియమించలేదు.. వారికి అర్హత లేదని జగన్‌ ‌భావిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. వైస్‌ ‌ఛాన్సలర్లుగా దళితులు పనికి రారా అంటూ నిలదీశారు. యర్రగొండపాలెంలో నేనేమన్నాను…?. గతంలో వ్యవసాయం దండగ అన్నానని దుష్పచ్రారం చేసినట్టే.. ఇప్పుడు నేనేదో దళితులను విమర్శించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లోకేష్‌ ‌జగన్ను తిడితే.. ఎస్సీలను తిట్టినట్టుగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దళిత ద్రోహి జగన్‌ అనే విషయాన్ని బలంగా చెప్పాలి. మంత్రి సురేష్‌ ‌బట్టలిప్పేసి.. రోడ్‌ ‌దకు వచ్చి వీరంగం వేశారు. అసలు బట్టలిప్పాల్సిన అవసరమేంటీ..?. నా ద దాడి చేస్తే.. ఎన్‌ఎస్జీ కమాండోలతో కాల్పులు జరిగేలా ప్లాన్‌ ‌చేశారు. ఇలాంటి పనులు చేసేవాడు ఓ మనిషా..? జగన్‌ ‌సైకో అంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Leave a Reply