Take a fresh look at your lifestyle.

దళిత బంధు సరే… నిధులెక్కడికెళ్లి కేటాయిస్తారో చెప్పాలి బిజెపి నేత రాములమ్మ డిమాండు

దళిత బంధు సరే… నిధులెక్కడికెళ్లి కేటాయిస్తారో చెప్పాలి: బిజెపి నేత రాములమ్మ డిమాండు
హైదరాబాద్‌, ‌జూలై 22 (ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తాజాగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై బిజెపి సీనియర్‌ ‌నాయకురాలు, మాజీ ఎంపి, ప్రముఖ సినీ నటి విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ తనదైనశైలిలో స్పందించారు. సిఎం కేసీఆర్‌కు చురకలంటించారు కూడా. ఆమె సోషల్‌ ‌మీడియా ద్వారా ఓ పోస్టు చేస్తూ… హుజూరాబాద్‌లో దళిత బంధు పథకంపై కేసీఆర్‌ ‌మాటలు, నవ్వి పోదురు గాక నాకేమి సిగ్గు అన్నచందంగా ఉన్నాయనీ విజయశాంతి వ్యాఖ్యానించారు. ఎన్నికలలో గెలవాలంటే దళిత బంధు ప్రకటించాలని చెప్పడం ద్వారా హుజూరాబాద్‌లో గెలవలేని పరిస్థితులు ఉన్నాయని స్వయంగా ఒప్పుకున్నట్లు తెలుస్తుందన్నారు.

అట్లానే… గెలవలేని పార్టీలు హామీలు ఇయ్యంగ లేంది టిఆర్‌ఎస్‌ ఇస్తే తప్పేంది అన్నారనీ గుర్తు చేస్తూ… మరి హుజూర్‌నగర్‌, ‌జీహెచ్‌ఎం‌సీ, నాగార్జునసాగర్‌ ఎన్నికల హామీలు యాడపాయె…? అని ప్రశ్నించారు. తెలంగాణ అంతా దళిత బంధు అమలు చేస్తానంటున్న ఈ ముఖ్యమంత్రి అందుకు నిధులేడకేల్లి కేటాయించుకున్నారో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. ఇంకా కేసీఆర్‌ను విశ్వసించటమంటే తుపాకీ రాముడు మాటలకు, తుగ్లక్‌ ‌వాగ్దానాలకు చెవొగ్గే మూర్ఖత్వమే అని విజయశాంతి అన్నారు.

Leave a Reply