Take a fresh look at your lifestyle.

చంద్రబాబును అడ్డుకున్న దళిత సంఘాలు

గొల్లపూడి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు
మాజీమంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న పోలీసులు
విజయవాడ, జూలై 31 : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గొల్లపూడి పర్యటనను అడ్డుకునేందుకు దళిత సంఘాలు యత్నించాయి. ఈ క్రమంలో గొల్లపూడిలో ఉద్రికత్త వాతావరణం చోటు చేసుకుంది. దళితులపై దాడి చేసిన దేవినేని ఉమాకు మద్దతు తెలపడంపై పలు దళిత సంఘాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు దళిత ద్రోహి అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబు గో బ్యాక్‌ అం‌టూ దళిత సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. దళితులు భారీగా గొల్లపూడి పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకుని చంద్రబాబును అడ్డుకోవాడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు దళిత సంఘాలను అడ్డుకున్నాయి. అనంతరం దళిత సంఘాల నాయకులు డియాతో మాట్లాడుతూ.. పదిహేనేళ్లు అధికారంలో ఉన్న దేవినేని ఉమా దళితులకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని తెలిపారు.

కావాలనే దళితుల పేరు చెప్పుకుని చంద్రబాబు కుళ్లు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. దేవినేని ఉమా ఇప్పటికైనా దళితులపై చేస్తున్న కుట్ర రాజకీయం మానుకొవాలన్నారు. లేనిపక్షంలో మళ్లీ ప్రజాక్షేత్రంలో టీడీపీకి బుద్ధి చెబుతామని తెలిపారు. ఇదిలావుంటే టీడీపీ పొలిట్‌ ‌బ్యూరో మెంబర్‌ ‌కొల్లు రవీంద్ర ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొండపల్లి రిజర్వ్ ‌ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్‌ ‌పరిశీలనకు వెళుతున్న రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి నుండి బయటకు వెళ్లేందుకు వీలు లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఎటువంటి నోటీలులు ఇవ్వకుండా అడ్డుకోవడం ఏమిటని పోలీసులను రవీంద్ర ప్రశ్నించారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో పోలీసులు, రవీంద్ర మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. రవీంద్రకు మద్దతుగా కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. రవీంద్ర ఇంటి వద్ద భారీగా పోలీసులు మొహరించారు. దీంతో రవీంద్ర ఇంటి వద్దే బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు.

Leave a Reply