Take a fresh look at your lifestyle.

‌దళిత బాలికపై అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌ ‌రాష్ట్రంలోని హాద్రాస్‌ ‌జిల్లా బుల్‌ ‌గారి గ్రామం లో 19 ఏళ్ల దళిత బాలికపై నలుగురు ఉన్నత కులస్థులు సామూహిక అత్యాచారం చేసి ఆమెను చంపారు. సెప్టెంబర్‌ 14 ‌వ తేదీన ఆ బాలిక తన గృహంలో ఉన్న జంతువులకు పశుగ్రాసం సేకరించడానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది .సంఘటన జరిగిన గంట తర్వాత సోదరుడు తన తల్లితో కలిసి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌వచ్చినప్పుడు అక్కడున్న పోలీసులు మేము సరైన విభాగాల కింద ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేశాము ఆమెను ఆసుపత్రికి పంపించాము. అనంతరం ఆమెను అలీగడ్‌ ‌ముస్లిం విశ్వ విద్యాలయ ఆస్పత్రికి తరలించారు .అక్కడ బాలిక లైంగిక వేధింపులు గురించి మాట్లాడింది. సంఘటన జరిగిన వారం తర్వాత అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది సెప్టెంబర్‌ 22 ‌వ తారీఖున తన వాంగ్మూలాన్నిసర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ ‌స్థాయి అధికారి రికార్డు చేయలేదు . దీనితో పోలీసుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతుంది. రాష్ట్ర స్థాయి జి డి .జి .పి .కూడా ఈ సంఘటన జరిగిన వారం తర్వాత మహిళపై మొదటిసారి అత్యాచారం జరిగినట్లు మాట్లాడారు ఆ జిల్లాను పరిరక్షించాల్సిన జిల్లా మెజిస్ట్రేట్‌ ‌సంఘటన జరిగిన స్థలానికి వెళ్లి అక్కడున్న సాక్ష్యాలను తారుమారు చేయడానికి జిల్లా మేజిస్ట్రేట్‌ ‌ప్రయత్నిస్తున్నట్లుగా బాధితులు పత్రికలకు పరామర్శించడానికి వెళ్ళిన రాజకీయ నాయకులకు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు.

బాధిత కుటుంబ సభ్యులు చెప్పిన విషయాలను బట్టి మేము ఈ గ్రామంలో నివసించడానికి అవకాశం లేకుండా జిల్లా మేజిస్ట్రేటు పోలీసులు అక్కడున్న స్థానిక నాయకులు మా పై ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత అధికారులను సంప్రదిస్తే సేకరించిన నమూనాలో స్పెర్ము లేదా మరే మర క కానీ కానీ కానీ మరి మనకు అందుబాటులో లేదని ఫోరెన్సిక్‌ ‌నివేదిక స్పష్టంగా పేర్కొన్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు అయితే నేరం జరిగిన కొన్ని రోజుల తర్వాత పరీక్ష కోసం నమూనాలు సేకరించి నందున స్పెర్మ్ ఉం‌డదని నిపుణులు అభిప్రాయపడ్డారు ..ఈ దేశంలో ఉన్న మహిళకు గ్రామంలో రక్షణ లేదు పట్టణాల్లో రక్షణ లేదు. దేశంలో ఎక్కడైనా రక్షణ లేకుండా పోయింది ఢిల్లీ నిర్భయ ఘటన తర్వాత మార్పు చోటు చేసుకోలేదు. దేశం మొత్తం పెను సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన ద్వారానైనా దేశంలో పరివర్తన రాలేదు.పాలకులకు చలనం రాలేదు .

మహిళ మీద జరిగినటువంటి అత్యాచారయత్నం ఉత్తరప్రదేశ్‌ ‌ను పరిపాలిస్తున్న ఆదిత్యనాథ్‌ ‌యోగి ప్రభుత్వానికి నిమ్మకునీరెత్తినట్లు అయినా లేదు ఈ సంఘటనపై ఆదిత్యనాథ్‌ ‌దాస్‌ ‌తన అధికారాన్ని యంత్రాంగాన్ని ఉపయోగిస్తూ బాధితురాలికి న్యాయం జరగకుండా తన బలంతో బాధిత మహిళ కుటుంబానికి అన్యాయం చేస్తున్నారు సెప్టెంబర్‌ 29‌న ఢిల్లీలోని ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున ఆ మహిళ మరణించింది.బుధవారం తెల్లవారుజామున తమ కుమార్తెను పోలీసులు దహన సంస్కారాలు చేసి సాక్ష్యాధారాలు లేకుండా జాగ్రత్త పడ్డారు అక్టోబర్‌ 12‌న పోలీసులను కోర్టు ముందు హాజరు పర్చాలని బాధితులు కోరారు దానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. సంఘటనల ను బట్టి దేశంలో యుక్తవయసులో ఉన్న బాలికలకు రక్షణ లేదని లేదనే వాస్తవం మన కళ్ల ముందు కనబడుతుంది. కనుక సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఈ నలుగురు సందీప్‌, ‌రాము ,లవకుశ మరియు రవిలను వెంటనే ఉన్నత న్యాయస్థానం కల్పించుకొని తగిన శిక్ష విధించి కేసు వెనుక ఉన్నటువంటి పూర్వాపరాలను సేకరించి బాధితులకు న్యాయం చేసి చేయాలని విద్యార్థులు, యువకులు , దేశంలో ఉన్న ప్రజలు బాధితులకు న్యాయం చేయాల నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
భారతదేశంలో ఇలాంటి సంఘటన లు జరగడం వల్ల రక్షణ లేని సమాజం లో ఉన్నామనిఅర్థమవుతుంది
– గంగాధరి శ్రీనివాస్‌, 9492725200.

Leave a Reply