Take a fresh look at your lifestyle.

దళితబంధు ఎక్కడా గ్రౌండ్‌ ‌కాలేదు

  • మార్గదర్శకాలు లేక లబ్ది దారుల్లో గందరగోళం
  • మాటలు కేవలం కాగితాలకే పరిమితం
  • అసెంబ్లీలో బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌విమర్శలు
  • బిజెపికి అసెంబ్లీలో గది కేటాయించరా ? ఇదెక్కడి న్యాయం : అసెంబ్లీలో• ఎంఎల్‌ఏ ఈటల నిలదీత

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : దళిత బంధు చాలా చోట్ల గ్రౌండింగ్‌ ‌కాలేదని, ప్రభుత్వం చెబుతున్న మాటలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు. బుధవారం శాసనసభలో బడ్జెట్‌పై  చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ సరైన మార్గదర్శకాలు లేక లబ్దిదారుల్లో గందరగోళం నెలకొందన్నారు. 70 లక్షల మందికి వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఇవ్వలేదని ఆరోపించారు. ఐకేపీ ఉద్యోగులకు  స్కేలు ఇస్తామన్నారు కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. రిటైర్మెంట్‌ ఉద్యోగులకు జీపీఎఫ్‌  ఇవ్వడం లేదని, ఆరోగ్యశ్రీ సేవలు ఎక్కడ పని చేయడం లేదన్నారు. మధ్యాహ్నం భోజనం వండే వాళ్లకు జీత భత్యాలు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తుందనడం తప్పని, రూ. 16 వేల కోట్ల భూముల అమ్మకం బడ్జెట్‌లో చూపించారని, భూముల అమ్మకం ద్వారా రూ. 3 వేల కోట్లకు మించి రావని ఈటల రాజేందర్‌ ‌వ్యాఖ్యానించారు.

13 ఫెడరేషన్‌లకు కేటాయింపులే తప్ప ఖర్చు పెట్టడం లేదని, ప్రభుత్వం వైఫల్యాలను, చేతకాని తనాన్ని ఇతరుల విదకు నెట్టడం సరికాదన్నారు. రాష్ట్రం వచ్చే నాటికి మన అప్పు రూ. 77, 333 కోట్లు మాత్రమేనని, ఇప్పుడు అప్పు రూ. 3 లక్షల కోట్లు దాటిందన్నారు. జీఎస్డీపీలో అప్పు 15 శాతం మించొద్దు.. కానీ అప్పు 38 శాతానికి పెరిగిందని ఆరోపించారు. అణగారిన వర్గాలకు ఐదు పైసలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. దళిత బంధు అమలు ఎన్ని ఏళ్లలో పూర్తి చేస్తారు?… హుజూరాబాద్‌లో ఇప్పటికీ అన్ని కుటుంబాలకు దళితబంధు రాలేదని ఈటల రాజేందర్‌ అన్నారు. ఐకేపీ ఉద్యోగులను పర్మనెంట్‌ ‌చేస్తామని హావి• ఇచ్చారని.. ఇప్పుడు ఆ ఊసే లేదని విమర్శించారు. విద్యార్థులకు ఫీజు రియాంబర్స్‌మెంట్‌ ‌రావడం లేదని, ఉద్యోగుల జీపీఎఫ్‌ ‌కూడా ఇవ్వడం లేదన్నారు. మధ్యాహ్న భోజనం వండే సిబ్బంది వేతనం రూ. 3వేలు పెంచుతాం అన్నారు.. కానీ ఇంత వరకు అమలు కాలేదన్నారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయాలి.. గల్ఫ్ ‌బాధితులకు సహకారం అందించాలని అన్నారు. కాగా ఈటెల రాజేందర్‌ ‌మాట్లాడుతుండగానే  స్పీకర్‌ ‌మైక్‌ ‌కట్‌ ‌చేసారు. దీంతో బయటకు వొచ్చి అసెంబ్లీ వి•డియా పాయింట్‌ ‌వద్ద ఈటల రాజేందర్‌ ‌చిట్‌ ‌చాట్‌గా మాట్లాడారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను అడ్రస్‌ ‌చేసే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఇరవై ఏళ్ల కాలంలో ఏనాడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. అడుగడుగున అడ్డంకులు, ప్రతిపక్ష పార్టీల నేతలు అంటే చిన్న చూపు చూడడం, సమస్యను లేవనెత్తేలోపు మైక్‌ ‌కట్‌ ‌చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో కంటే బయట మాట్లాడటం మేలని అన్నారు. దీని వల్ల ప్రజలకు కొంతైనా అర్థం అయ్యే ఛాన్స్ ఉం‌టుందన్నారు. తాను గెలిచి ఏడాదిన్నర అవుతోందని, ఈ సమయంలో తన నియోజకవర్గ పరిధిలో తనను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. నేనేంటో తనను గెలిపించిన తన నియోజకవవర్గ ప్రజలకు తెలియదా? అని అన్నారు. అధికారం అనేది ఎవ్వరికీ ఎప్పుడు శాశ్వతం కాదని ఈటెల రాజేందర్‌ ‌వ్యాఖ్యానించారు.

బిజెపికి అసెంబ్లీలో గది కేటాయించరా ? ఇదెక్కడి న్యాయం : అసెంబ్లీలో• ఎంఎల్‌ఏ ఈటల నిలదీత
అసెంబ్లీలో బీజేపీకి గది కేటాయించకపోవడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సభలో లేవనెత్తుతూ… అసెంబ్లీలో టిఫిన్‌ ‌చేయడానికి కూడా తమకు రూం లేదని అన్నారు. రూం కూడా కేటాయించకపోవడం ఎమ్మెల్యేలను అవమానించడమే అని తెలిపారు. తాము కార్లలో కూర్చుంటున్నామని అన్నారు. అసెంబ్లీలో బీజేపీ సభ్యులకు ఆఫీస్‌ ‌కేటాయించాలి. ముగ్గురు ఎమ్మెల్యేలం ఉన్నాము కానీ మాకు ఆఫీస్‌ ఇవ్వడం లేదు. కనీసం యూరినల్స్‌కు వెళ్లేందుకు కూడా మాకు వెసులుబాటు లేదు. ఇంత అవమానమా?. ఈ విషయంపై స్పీకర్‌ను అరడజను సార్లు కలిశాం. ఏదైనా సమస్యపై కూర్చుని మాట్లాడేందుకు ఒక రూమ్‌ ఇయ్యరా. బీజేపీ సభ్యులను బిజినెస్‌ అడ్వైజరీ కమిటీవిటింగ్‌కు కూడా పిలుస్తలేరు. గతంలో సీపీఐ, సీపీఎం, ఒక్కొక్క సభ్యులు ఉన్నప్పటికీ బీఏసీకి పిలిచారు.

ఇది అన్యాయం కాదా అంటూ ప్రశ్నించారు. ఈటల మాటలకు మంత్రి హరీష్‌ ‌రావు  మధ్యలో అడ్డుతగిలారు. సీనియర్‌ ‌సభ్యులుగా తమకు నిబంధనలు తెలియవా అని ప్రశ్నించారు. ఐదుగురు సభ్యులు ఉంటేనే ఛాంబర్‌ ఇవ్వాలని నిబందన ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. బడ్జెట్‌పై చర్చ జరుగుతున్న సమయంలో బడ్జెట్‌ ‌పరిమితికి లోబడి, ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ..విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలని మంత్రి హరీష్‌ ‌రావు  కోరారు. అయినప్పటికీ గది అంశంపై ఈటల మాట్లాడుతుండటంతో… సమస్య ఉంటే తన ఛాంబర్‌కు వొచ్చి కలవాలని స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి సూచించారు. మంత్రులు చెప్పిన విధంగా బడ్జెట్‌పై తమకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సీనియర్‌ ‌శాసనసభ్యులు అయిన తమరు నిబంధనలు పాటించి… దానికి అనుగుణంగా వెళ్లాలని స్పీకర్‌ ‌పోచారం తెలిపారు. దీంతో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌బడ్జెట్‌పై అభిప్రాయాలను సభ ముందు ఉంచారు.

Leave a Reply