Take a fresh look at your lifestyle.

డైలీవేజ్‌ ‌వర్కర్లకు వేతనాలు చెల్లించాలి

daily wages,paid to workers ,Girijana ashramaగిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్‌ ‌లో పనిచేస్తున్న డైలీ వెజ్‌ ‌వర్కర్లకు వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె బ్రహ్మచారి కోరారు.బుధవారం భద్రాచలం ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు కువినతిపత్రం అందజేశారు.డిడి జహీరుద్దీన్‌ ఈ ‌సందర్భంగా మాట్లాడుతూ బడ్జెట్టు రెండు కోట్ల 17 లక్షల 14వేల 369 రూపాయలు వచ్చిందని అన్నారు.వినతి పత్రం అందజేసిన అనంతరం  బ్రహ్మచారి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ‌కనీస వేతనాల ప్రకారం పెరిగిన వేతనాలు కూడా చెల్లించాలని అన్నారు .ప్రస్తుతం వచ్చిన బడ్జెట్‌ ‌సరిపోను  రాలేదని, పెరిగిన వేతనాలు మరలా వచ్చే బడ్జెట్‌ ‌లో గతంలో చెల్లించే విధంగా ఏరియల్స్ ‌రూపంలో చెల్లించాలని ఆయన కోరారు. గుర్తింపు కార్డుల జారీ కి అవసరమైన అన్ని పాఠశాలల హెచ్‌ ‌యం, వార్డెన్స్ ‌కు పంపించడం జరిగిందని , త్వరలోనే గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు వేతనాలు ఎస్‌ ‌టి వో కు పంపాలని ఆయన కోరారు .ప్రతి నెల వేతనం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని యూనిఫామ్‌ ‌పిఎఫ్‌ ,ఈఎస్‌ఐ, ఇన్సూరెన్సు అని కూడా డైలీవెజ్‌ ‌వర్కర్లకు అందజేయాలని కోరారు . వినతి పత్రం అందజేసిన వారిలోసి ఐ టి యు  పట్టణ కన్వీనర్‌ ‌వై వెంకటరామారావు నాయకులు,ప్రవీణ్‌  ‌పాల్గొన్నారు.

Tags: daily wages,paid to workers ,Girijana ashrama


Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply