కార్యాక్రామనికి శ్రీకారం చుట్టిన గవర్నర్
రాజ్‌భవన్‌లో పేదలకు నిత్య సంతర్పణ కార్యక్రమాన్ని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సోమవారం ఉదయం ప్రారంభించారు. నిరుపేదల ఆకలి తీర్చేందుకు రాజ్‌భవన్ అన్నం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. నిత్య సంతర్పణలో భాగంగా రాజ్‌భవన్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా అల్పాహారం అందించనున్నారు. ప్రతి రోజు 500 మంది నిరుపేదలకు టిఫిన్, భోజన సదుపాయం కల్పించనున్నారు. ఉచితంగా టిఫిన్, నామమాత్రపు రుసుముతో మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించనున్నారు.