Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో నిలకడగా రోజువారీ కొరోనా కొత్త కేసులు

తాజాగా 174 మందికి పాజిటివ్‌..ఇద్దరు మృతి
రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు నిలకడగా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 174 కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్‌ ‌నుంచి 202 మంది కోలుకున్నారు. కాగా వైరస్‌ ‌కారణంగా ఇద్దరు మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 65 కేసులు నమోదవగా, కరీంనగర్‌ ‌జిల్లాలో 14 కేసులు, మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,71,174 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,954కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,63,124 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 4,096గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply