ఇక్కడింతే
అడ్డు అదుపులేకుండా
నిత్యవసరాలెపుడు
అనునిత్యం ఆగకుండా
ఆకాశం దాకా పెరుగుతుంటయ్
పేదవాడెపుడు బాదపడుతూ
భరిస్తూ బతుకునిడ్చాలి
ఉసరవెల్లుల రాజ్యంలో
ఊహకందని బతుకుభారం
ఏంజరిగినా
మధ్యతరగతి మెడకు ఉరితాడౌతుంది
పెరిగే ధరలతో
సామాన్యుల గుండెలదురుతూనేవుంటయ్
మూడడుగులు ముందుకు
ఏడడుగులు వెనక్కన్నట్టు
బతుకుగొంగడి బరువెక్కుతనేవుంటది
మూడుపూటల కడుపునింపుకోవాలంటే
అప్పులగుర్రమెక్కి
కాలమేదైనా యుద్ధం చేయాల్సిందే
కళ్ళెంతెగిన గుర్రంలా ధరలపెరుగుదలిక్కడ
పనిపాటలెన్నిజేసినా
పెరిగే ధరలతో పోటిపడలేక
అర్థాకలితో జీవితాలు
రోడ్లపై బిచ్చమెత్తుకుంటున్నాయ్
బ్రహ్మచారులేలే రాజ్యంలో
సంసారభారం తెలిసేదెలా
పూటగడవాలంటే పొయ్యి వెలగాల్సిందే
సిలిం’డర్’ ధరలైతే పేలిపోతున్నయ్
చోద్యంచూసే పాలకులున్న
అఖండ భారతదేశంలో
సామాన్యుల అభివృద్ధెప్పుడో
– సి.శేఖర్(సియస్సార్),పాలమూరు,
9010480557.