- విమర్శలు చేయడం సరికాద..
- బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి ఆరోపణలపై సైబరాబాద్ సిపి సజ్జనార్ ఆగ్రహం
- ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేసామని వివరణ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై సీపీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. పోలీసులపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై విచారణ చేస్తున్నామన్నారు. బాధ్యతగల వ్యక్తులు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. బండి సంజయ్‌పై లీగల్ ఒపీనియన్‌కు వెళ్తున్నామన్నారు. కేసులు పక్కాగా నమోదు చేస్తామని సజ్జనార్ తెలిపారు. డబ్బులు పంచుతునట్టు సమాచారం ఉంటే పోలీసులకు సమాచారమివ్వాలి..కానీ నేరుగా నేతలు ఇంకో పార్టీ స్థావరాలపైకి వెళ్లొద్దని సీపీ సజ్జనార్ సూచించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీపీ తెలిపారు. బల్దియా ఎన్నికల కోసం 13,500 మంది పోలీసులతో అన్ని భద్రతాపరమైనా ఏర్పాట్లు చేశామని అన్నారు. వీరిలో 10,500 మంది సివిల్, 3000 మంది ఏఆర్ సిబ్బంది ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన వి•డియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి మూడు సార్లు తర్ఫీదు ఇచ్చామన్నారు. ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అన్ని ప్రాంతాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.