Take a fresh look at your lifestyle.

ఎపిలో అంతటా ఒకేవిధంగా కర్ఫ్యూ సడలింపులు

ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ
అమరావతి,జూలై 12 :  కర్ఫ్యూ సడలింపులపై ఏపీ ప్రభుత్వం తాజా ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొంది. దీంతో అన్ని జిల్లాల్లో ఒకే విధంగా కర్ఫ్యూ సడలింపులు ఇచ్చారు. గతంలో 8 జిల్లాలకు రాత్రి 9 గంటల వరకు ఇచ్చిన సడలింపులను తాజాగా అన్ని జిల్లాలకు వర్తించేలా ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి 9 గంటలకల్లా దుకాణాల మూసివేయాలని ఆదేశించింది. రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉండనున్నాయి.

ఇక మాస్క్ ‌లేకపోతే రూ.100 జరిమానా విధించనున్నారు.  రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా1,578 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్‌ ‌ప్రభావంతో 22 మంది మృతి చెందారు. తాజాగా 3,041 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ ‌కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 18,81,307 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మొత్తం 13,024 మంది ప్రాణాలు వదిలారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ సోమవారం కరోనాపై హెల్త్ ‌బులెటిన్‌ ‌విడుదల చేసింది.

Leave a Reply