Take a fresh look at your lifestyle.

సంస్కృతి – సంప్రదాయాలు – బ్రతుకమ్మ

“పండుగలు మానవ సంఘాలతోనే పుట్టి, వాటితోనే పెరిగి అవి మారినప్పుడు మారుతూ, అవి అంతరించినా వాటి పరిణామ దశలకు సూచకాలుగా నిలిచిపోతాయి. సంఘం నిత్యవికసన శీలం. కొత్త సంఘటనలతో, కొత్త ఆవిష్కారాలతో, కొత్త జ్ఞానంతో సమాజం ముందుకు సాగిపోతున్నపడు ఒక సంఘటన యొక్క ఆవిష్కార జ్ఞానాల ఆవిష్కారాలతో, కొత్త జ్ఞానంతో సమాజం ముందుకు సాగిపోతున్నప్పుడు ఒక సంఘటన యొక్క ఆవిష్కార జ్ఞానాల ప్రాదుర్భావ కాలాలు విశిష్టంగా సంఘశ్రేయస్సుకు వినియోగపడతాయి, ఆనందదాయకాలవుతాయి. అవే పండుగలూ, పర్వాలు.”

పండుగలు మానవ సంఘాలతోనే పుట్టి, వాటితోనే పెరిగి అవి మారినప్పుడు మారుతూ, అవి అంతరించినా వాటి పరిణామ దశలకు సూచకాలుగా నిలిచిపోతాయి. సంఘం నిత్యవికసన శీలం. కొత్త సంఘటనలతో, కొత్త ఆవిష్కారాలతో, కొత్త జ్ఞానంతో సమాజం ముందుకు సాగిపోతున్నపడు ఒక సంఘటన యొక్క ఆవిష్కార జ్ఞానాల ఆవిష్కారాలతో, కొత్త జ్ఞానంతో సమాజం ముందుకు సాగిపోతున్నప్పుడు ఒక సంఘటన యొక్క ఆవిష్కార జ్ఞానాల ప్రాదుర్భావ కాలాలు విశిష్టంగా సంఘశ్రేయస్సుకు వినియోగపడతాయి, ఆనందదాయకాలవుతాయి. అవే పండుగలూ, పర్వాలు. ఋతు పరివర్తనంలో ఏర్పడిన పండుగలలో ఉగాది, నాగపంచమి, వరలక్ష్మివ్రతం, బ్రతుకమ్మ పండుగ, మకర సంక్రాంతి, హోలీ మొదలగునవి పేర్కొనవచ్చును. బ్రతుకమ్మ అనేది ఒక విశ్వాసం లేదా నమ్మకం వల్లనే జరుపుకొనే పండుగ. జానపదుల లక్షణాల్లో నమ్మకాలు ప్రధానమైనవి. జానపదులు ప్రకృతితో విడదీయరాని ప్రగాఢ సంబంధం కలిగి ఉంటారు. ప్రకృతిని భయం వల్లనో, భక్తి వల్లనో నమ్ముతుంటారు, పూజిస్తుంటారు. బ్రతుకమ్మ అనేది ఒక విశ్వాసం. దాని మేరకే బ్రతతుకమ్మ ఆదాధన సంప్రదాయాలు పరిశీలిస్తే నమ్మకం దాని వేరు బయల్పడుతాయి. తెలంగాణా ప్రాంతంలో స్త్రీలు ఎంతో వైభవోపేతంగా జరుపుకునే పండుగ బ్రతుకమ్మ. ఈ ప్రాంతపు స్త్రీలలో ఉండే నమ్మకాలకు ఇది ప్రతీక. తమ వంశానికి చెందినవాళ్ళు ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళు దేవతలుగా మారి గ్రామాలను కాపాడుత్నుట్లు భావించుకంటూ వారని పూజిస్తారు, ఉత్సవాలు జరుపుతారు. వారికోసం కొన్ని భక్తి పాటలు పాడుతుంటారు. ఇలా వచ్చినవే బ్రతుకమ్మ పాటలు.

జానపదులు సృష్టించుకన్న సాహిత్యమంతా మౌఖిక సాహిత్యమే! దానికి జానపద లక్షణాలుంటే జానపదమవుతుంది. జానపద సాహిత్యంలో పాండిత్య ప్రకర్ష కంటే స్పందించే గుణమే ప్రధానపాత్ర వహిస్తుందనేది సత్యం. తెలంగాణా గ్రామీణా ప్రాంతాలకు సంబంధించిన వైభవోపేతంమైన ఈ బ్రత్న్నమ్మ పండుగ ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి నుండి మహర్నవమి వరకు తొమ్మిది రోజుల బ్రతుకమ్మను జరుపుకుంటారు. (మధ్యలో ఆరవరోజు ఆడరు). పెళ్ళికాని యువతులు మంచి భర్త కావాలని, పెళ్ళి అయిన స్త్రీలు మంచి పంతానం కలగాలని మ్రొక్కుకుంటూ ఈ బ్రతుకమ్మ పండుగను జరుపుకుంటారు. బ్రతుకమ్మ పుట్టుకను సంబంధించి వ్యాప్తిలో ఉన్న అనేక కథలు తెలంగాణా గ్రామాల్లో విన్పిస్తాయి. శివుని భార్య సతీదేవినే బ్రతకమ్మ పేరుతో పూజిస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. దక్షుడు చేస్తున్న యజ్ఞానికి ఆహ్వానం లేకపోయినా వెళ్ళి తనూ, తన భర్త తండ్రిచేత అవమానం పొందినందుకు గాను , ఆమె అక్కడే ఆత్మాహుతి చేసుకుందని, ఆ సంఘటన చూసిన ప్రజలు ముక్త కంఠంతో సతీదేవిని బ్రతుకమంటూ బ్రతుకమ్మ ! బ్రతుకమ్మ! అంటూ పాడారని ప్రజల ఆప్యాయతను మెచ్చి సతీదేవి ప్రత్యక్షమయిందని అప్పటి నుంచి ప్రజలు బ్రతుకమ్మ పండుగన జరుపుతున్నారనేది ఒక కథనం.

పిల్లలు పుట్టి కూడా చనిపోతుంటే వాళ్లు బ్రతకడానికి ఇస్తారి, పెంటయ్య, వెర్రయ్య వంటి పేర్లు పెట్టడం ఒక నమ్మకంగా గ్రామీణ ప్రాంతాల్లో కన్పిస్తుంది. ఇదే విధంగా వ్యవసాయదారులైన ఒక ఇంట ఏడవకాన్పుగా పుట్టిన ఆడపిల్లలకు పేరు పెట్టకుండా బతుకమ్మా ! .. బతుకమ్మా!.. అని పిలుస్తుండేవారట. ఆ పిల్లలంతకు ముందు పిల్లల వలె చనిపోకుండా బతుకటంతో ఆ పిల్లకు ‘‘బతుకమ్మ’’ అనే పేరే నిలిచిపోయిందట. ఆ పిల్ల బ్రతుకటంతో ఆ సంఘటన తెలుసుకున్న చుట్టు ప్రక్కల ప్రజలు కూడా తమ పిల్లలు చనిపోకుండా ఉండేందుకు బతుకమ్మ అనే పేరు పెట్టడం మంచిదని భావించారట. బతుకమ్మ బతకటం తరువాత ఆ దంపతులకు మరో మగ సంతానం కలగటం ఆ ఊరి ప్రజలకు ఆనందం కల్గించింది. మరింత విశ్వాసాన్ని ప్రొది చేసింది. కొన్నాళ్ళకి బతుకమ్మకు పెళ్ళిచేసారు. అబ్బాయికి కూడా పెళ్ళి చేసారు. ఒకసారి బతుకమ్మ అత్తగారి ఇంటి నుండి పుట్టింటికి వచ్చింది. మరదలుతో కూడా బ్రతుకమ్మ ఊరి చెరువు వద్దకు స్నానానికి వెళ్ళింది. గట్టు మీదికి వచ్చి హడావుడిలో ఒకరి చేరలు మరొకరు అందుకున్నారు. మరదలు మొదట చీర కట్టుకుంది. తను ఆడబడుచును తన చీర మరదలు కట్టుకుకోవడం కూడదని బతుకమ్మ వారించింది.

ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. ఇది చేయి చేయి కలిపారు. ‘‘ముష్టాముష్టి’’ యుద్ధానికి దారి తీసింది. మరదలు బ్రతుకమ్మను గొంతు పిసికి చంపేసి, ఆ ఒడ్డునే పాతి పెట్టేసి ఇంటికి ఒంటరిగా వెళ్ళిపోయింది. బ్రతుకమ్మ చనిపోయిన రోజునే భర్తకు కలలో కనిపించి తనని ఇంటికి తీసుకెళ్ళమని చెప్తుంది. అతను బతుకమ్మ కోసం బయలు దేరి వస్తుంటాడు. బ్రతుకమ్మ స్నానం చేసి, చంపబడిన చెరువు ప్రక్క గట్టు వద్ద నుంచి వెళ్ళుతూ, గట్టు మీద విరగబూసిన తంగేడు పూవులను తెంపబోతాడు. ఆశ్చర్యంగా ఆ తంగేడు చెట్టు మాట్లాడుతూ బ్రతుకమ్మ ఎట్లా చంపబడ్డదో చెపుతుంది. అంతేకాకుండా ప్రతి ఏడాదీ తంగేడు పూలతో ‘‘బ్రతుకమ్మ’’ను పేర్చి పైన గౌరమ్మను నిలిపి పూజ చేసి, చెరువు గట్టున ఆడి, ఆ నిటిలో విడిచిపట్టాలని కోరుతుంది. ఈ మేరకు బ్రతుకమ్మ భర్త నుండి హామీ పొందుతుంది. భర్త ఆనాటి నుండి బ్రతుకమ్మ చెప్పినట్లు బ్రతుకమ్మ కోర్కెలన్నింటిని ముత్తయిదువుల ద్వారా తీరుస్తాడు. ఇది తెలుసుకున్న నాటి నుండి ప్రజలు బ్రతుకమ్మను గ్రామదేవతగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ఆరంభించారు. చోళ రాజ్యాన్ని ధర్మాంగుడనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని భార్య సత్యవతి నూరు నోములు నోచి నూర్గురు కుమారులను కన్నది. కానీ వాళ్ళందరూ యుద్ధంలో శతృవుల చేతిలో హతమయ్యారు. దానితో రాజ్యాన్ని వదిలి ఆ దంపతులు అరణ్యంలోకి పారిపోయారు. అచ్చటనే ఆ రాజు ఘోర తపస్సు చేసి లక్ష్మీదేవిని ప్రసన్నంచేసుకొని, ఆమెను తన భార్య గర్భాన జన్మించమని వరం కోరి, పొందుతాడు.

bathukamma

సత్యవతీ దేవి గర్భాన లక్ష్మీదేవి జన్మించగానే కశ్యప, వశిష్ట మొదలగు మునిపుంగవులు వచ్చి ఆ బాలికను ‘‘బ్రతుకమ్మ’’ అని దీవిస్తారు. ‘‘ప్రజలందరికీ బతుకును ప్రసాదించే అమ్మ’’ అనే అర్థంలో అని వారు దీవించి ఉంటారు. ఆనాటి నుండి అందరూ ప్రేమతో ‘‘బ్రతుకమ్మ’’ అని పిలవనారంభించారు. ఈ బ్రతుకమ్మ జన్మించటం వల్ల తమ రాజ్యం తిరిగి రావటంతో దంపతులు కమార్తెతో తమ రాజ్యానికి తిరిగి వెళ్లారు. బ్రతుకమ్మకు పెళ్ళీడు రావటంతో సాక్షాత్‌ ‌శ్రీ మహావిష్ణువే ‘‘చక్రాంగుడు’’ అనే పేరుతో రాజుగా వచ్చి బ్రతుకమ్మను వివాహమాడి పక్కుమంది పిల్లల్ని కని సకల భోగభాగ్యాలతో జీవించాడు. మరో కథలో ప్రజల్ని కాపాడేందుకు గౌరిదేవి మహిషాసురుని చంపి ప్రజల్ని బాధల నుండి విముక్తి గావించి అలసి మూర్చపొందిందట. ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి నుంచి ప్రజలు ఆమెను మూర్ఛనుంచి తేరుకునేలా చేసేందుకు బక్తి పాటలు పాడతారు. మూర్ఛనుంచి తేరుకునేందుకు ఆమె జీవనం కోసం ‘బతుకమ్మ’ అని నేక రకాలుగా ప్రార్థిస్తారు. ఆనాటి నుండి గౌరమ్మయే బ్రతుకమ్మ అయిందని జానపదులు విశ్వసిస్తున్నారు. మరో కథలో పూర్వం ఒక వైశ్య దంపతులక ఒక కొడుకు, ఒక కూతురు ఉండేవారు. ఆ కూతురే బ్రతుకమ్మ. వివాహానంతరం బ్రతుకమ్మను ఆమె అత్తవారింటికి పంపించారు. సంప్రదాయం ప్రకారం వివాహమైన మొదటి సంవత్సరం పండుగలకు కూతురిని, అల్లుడిని సాదరంగా ఇంటికి ఆహ్వానించారా దంపతులు. తను తరువాత వస్తానని చెప్పి భర్త బ్రతుకమ్మన తల్లివారింటికి పంపించాడు. బ్రతుకమ్మ పుట్టింటికి చేరేసరికి ఇంట్లో తన అన్నభార్య (వదిన) మాత్రమే ఉంది. ఆ వదిన గారిని, తననూ పొరిగింటి వారు పేరంటానికి పిలువగా వదిన చీరకట్టుకొని బ్రతుకమ్మ ఆ పేరంటానికి వెళ్లింది. దురదృష్టవశాత్తు ఆ చీరపై గంధము, పసుపు, కుంకుమ మరకలు పడ్డాయి.

బ్రతుకమ్మ కావాలనే తన చీరను పాచుచేసిందని, ఆమెను శిక్షించాలని లేనట్లయితే కాపురం విడిచివెళ్తానని తన భర్తను ఆ వదిన గారు వేధించింది. అందుకు తలూపి బ్రతుకమ్మను ‘‘నీ భర్త నుంచి కబురొచ్చింది, బయలుదేరమంటూ’’ అన్న తీసుకొని వెళ్లూ అడవి దారిలో బ్రతుకమ్మను మట్టుపెట్టాడు. దారి ప్రక్కన పూడ్చిపెట్టి ఇంటిదారి పట్టాడు. పాతిపెట్టిన చోట ఒక పూల మొక్కగా ఆమె మొలిచింది. భార్య వద్దకు బయలుదేరిన బ్రతుకమ్మ భర్త అడవి దారి గుండా వస్తూ బ్రతుకమ్మ సమాధి వద్ద మొలిచిన పూల మొక్కను చూసి అందంగా ఉందనుకొని పూలు కోయబోతాడు. ఇంతలో ఆ మొక్క మాట్లాడుతూ
‘‘ముట్టకు మట్టుకు మావారు
ముట్టబోకు మావారు
పాపిష్టి వదిన చంపించింది
కిరాతకన్నయ్య చంపాడు’’ అని పలికింది.
ఏమి అర్థం కాని ఆ భర్త అత్తగారిల్లు చేరాడు, బ్రతుకమ్మ కోసం అల్లుడు రాగా బతుకమ్మ తల్లిదండ్రులు ఆశ్చర్యబోయారు. బ్రతుకమ్మన నీవద్దకే పంపించాం కదా! అన్న తన అత్తమామల మాటలు విన్న ఆ బ్రతుకమ్మ భర్తకు అడవిలో మొక్క పలికిన మాటలు గుర్తొచ్చాయి. తన అత్తమామల్ని అడవికి తీసికెళ్ళి మొక్క చూపించాడు. తిరిగి ఆ మొక్క మాట్లాడుతూ
‘‘ముట్టకు ముట్టకు మా అమ్మా
ముట్టబోకు మా అమ్మా
పాపిష్టి వదిన చంపించింది
కిరాతకన్నయ్య పంపాడు’’ అని పలికింది.
వీరు ఇంటికి వచ్చి కుమారుని, కోడల్ని నిలదీయగా వారు నిజం అంగీకరించారు. బ్రతుకమ్మ ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నాడు పుట్టి కన్నుమూసింది. భర్త మహర్నవమి నాడు ఈ విషయం తెలుసుకున్నాడు. అందుకనే తొమ్మిది రోజులూ పండుగ జరుపుకుంటారని ప్రతీతి. ఇలా తెలంగాణా జనజీవనంలో బ్రతుకమ్మకు సంబంధించి చాలా కథలు మౌఖికంగా వ్యాప్తిలో ఉన్నాయి. ఆ కథనాల్ని క్రోడీకరిస్తే నమ్మకాలే నాటి ప్రజల ఆచారాలుగా ప్రాణం పోసుకున్నాయి. బ్రతుకు, అమ్మ అని ఈనాటికి తెలంగాణ ప్రాంతాలలో వారి వారి పిల్లలకు బ్రతుకమ్మ అని పేరు పెట్టడం జరుగుతుంది. బ్రతుకమ్మ అనేది ఒక ఆరాధన, ఉత్సవం, వేడుక. కుటుంబ దేవతగా, గ్రామదేవతగా ఆమె నేడు అందరి పూజలూ అందుకుంటుంది. బ్రతుకమ్మను పెద్దలు జరుపుకొనే పండుగగా, బొడ్డెమ్మను పిల్లలు జరుపుకునే పండుగ్గా పేర్కొంటారు.

బొడ్డెమ్మ:

భాద్రపద బహుళ పంచమినాడు మొదలయి మహాలయ అమావాస్య వరకు కన్నె పిల్లలు జరుపుకునే పండుగను బొడ్డెమ్మ అంటారు. బొడ్డెమ్మ బ్రతుకమ్మ పండుగలో భాగంగానే భావిస్తారు. బొడ్డ అంటే అత్తిచెట్టు, మేడిచెట్టు అనే అర్థాలున్నాయి. దీనినే ఉదుంబర చెట్టు అని కూడా అంటారు. గ్రామ దేవతారాధనలో ప్రకృతిని పూజించటం సాంప్రదాయం. ప్రకృతిలో భాగమైన చెట్లను, మొక్కలను, పూలను పూజించటం బొడ్డెమ్మ, బ్రతుకమ్మల్లో కనిపిస్తుంది. బొడ్డెమ్మను చెట్టపీటపై రేగడిమట్టి లేదా పుట్టమన్నుతో చతురస్రాకారంగా ఐదు మెట్లుగా చేసి, వాటిపై ఒకదానిపై మరొకటి త్రిభుజాకారంగా పేరుస్తారు. బొడ్డెమ్మను రుద్రాక్ష కాకర, కట్ల, బీర, మల్లె, జాబి, గోరంట ఊలతో అలంకరిస్తారు. ఆ తరువాత గోపురం చివరి ప్రదేశంలో బియ్యంతో నిండిన కలశం, దానిపై కొత్త అస్త్రం (రవికె ముక్క) పెడతారు. దాఇపై తమలపాకుల, పసుపూ, గౌరమ్మ (పసుపుతో చేసి) ఉంచుతారు. చెక్కతో కూడా ఈ బెడ్డమ్మన చేసి నాలుగు వైపులా నాలుగు మట్టిమద్దలు పెట్టి బొడ్డెమ్మను నిలుపుతారు. చుట్టుప్రక్కల ఇండ్ల కన్నెపిల్లలు వచ్చి చప్పట్లతో లయబద్దంగా కదులుతూ పాటల పాడుతారు. బొడ్డెమ్మను కొన్ని చెట్ల ఎర్రమట్టి మద్దను త్రిభుజాకారంలో రూపిందించి దానిపైన ‘‘వెంపలి చెట్లు’’ కొమ్మను పెట్టి పసుపు, కుంకుమలతో పూజిస్తారు.

బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో…
నీ బిడ్డలెందరూ ఉయ్యాలో…

అంటూ అమ్మాయిలు మంచి భర్త కోసం బొడ్డెమ్మను పూజిస్తూ ఆభరణాలు, దుస్తులూ వంటి తమ కోరకల్ని వ్యక్తం చేస్తూండడం కొన్ని పాటల్లో ధ్వనిస్తుంది. తొమ్మిది రోజుల ఆటపాటలు పూర్తయ్యాక ఆఖరు రోజైన మహాలయ అమావస్య రోజు బొడ్డెమ్మపైన కలశంలోని బియ్యంతో వంట వండుకుంటారు. ఆ అన్నాన్ని ప్రసాదంగా భావిస్తారు. కోరికలు తీరాలని ప్రార్థిస్తూ ప్రసాదాన్ని సేవిస్తారు. చివరిరోజు బొడ్డెమ్మను నిమజ్జనం చేస్తూ,
‘‘నిద్రపో నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మా!
నిద్రకూ నూరేండ్లు నీకు వెయ్యేండ్లు
నిద్రపో నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మా!
పాలిచ్చే తల్లికి వెయ్యేండ్లు, బ్రహ్మకు వెయ్యేండ్లు
ననుకన్న తల్లీ నీకు నూరేండ్లు జో.. జో..
నిద్రపో నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమా!
దుద్రాక్ష పూవుల్లు పూసేటి వేళ
రుద్రుడూ మా దొడ్లో జొచ్చేటి వేళా
బీరాలు పూవుల్లు పూసేటి వేళ
భీముడూ మా దొడ్లో జొచ్చేటి వేళా
పొట్లాయి పూవుల్ల పూసేటి వేళ
కాముడూ మా దొడ్లే జొచ్చేటి వేళా
గుమ్మడి పూవుల్లు పూసేటి వేళ
బుద్దడూ మా దొడ్లో జొచ్చేటి వేళా
గోరంట పూవుల్లు పూసేటి వేళ
గోరి మా సఖుడు దొడ్లో జొచ్చేటి వేళ
నిద్రపో నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మా!
అంటూ పాడి బొడ్డెమ్మను నిమజ్జనం చేస్తారు. ఈ విధంగా పెళ్లికాని యువతుల బొడ్డెమ్మ అంకం ముగిసిన మరుసటి దినమే బ్రతుకమ్మ మొదలవుతుంది.

బ్రతుకమ్మ:

తెలంగాణా గ్రామీణ ప్రాంతాల్లో మౌఖికంగా సాగుతున్న జానపద వాజ్ఞయంలో స్తీల పాటలకున్న ప్రాధాన్యత వేరే వాటికి లేదు. ఏదో ఒక సందర్భంలో ఆశువుగా అందుకునే పాటల్లో భాష కన్నా భావానికి, సాహిత్య విలువల కన్నా స్పందనకి ప్రాధాన్యత ఎక్కువ. కేవలం ఆచారం, సంప్రదాయం కొనసాగుతున్న ఒరవడిని ఆధారంగా, నమ్మకం ప్రతిపదికగా తరాలుగా వస్తున్న బ్రతుకమ్మ పండుగ నేడు గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు నగర ప్రాంతాల్లోనూ ప్రాచుర్యం పొందింది. నగరం, గ్రామం ఎక్కడైతేనేం తొమ్మిది రోజులూ మహిళల్లో పోటెత్తిన ఉత్సాహం, వీధి వీధిన అమ్మలక్కల ముచ్చట్లలో చీరలు, నగలు, పూజలు తదితర అంశాలు చోటు చేసుకుంటాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు మొదలు మహర్నవమి వరకు కోలాహలంగా జరిగే ఈ ప్రతుకమ్మ పంఉగలో ప్రకృతి, చెట్లు, పూలు ప్రధాన పాత్ర వహిస్తాయి. వెడల్పాంటి అంచులున్న ఇత్తడి పళ్ళెంలో గుమ్మడిపూలు మొదట పరిచి దానిపై తంగేడు పూవు, పైడి తంగేడు, గునుగు, రుద్రాక్ష, నువ్వు, కట్ల, గట్ట గొరిమిడి, కాకర, బీర, గన్నేరు. పొట్ల వరుసపై వరుసగా గోపురం ఆకారం వచ్చేవరకు పేరుస్తారు. ఆ పూవులకు మధ్య తంగేడు ఆకు పోస్తారు. వెదురులో చిన్న శిబ్బిలో మరో చిన్న బ్రతుక్మను పేరుస్తారు. తల్లి బ్రతుకమ్మ, పిల్ల బ్రతుకమ్మలుగా వీటిని పిలుస్తారు. గోపురం శిఖరం వల్ల కన్పించే పై భాగంలో తామర, బంతి పూవులు పెడతారు.

పసుపుతో చేసిన రెండు చిన్న శిఖరాల ఆకారంలో గంగమ్మ – గౌరమ్మల ప్రతీకలుగా పసుపు ముద్దలు చేసి బ్రతుకమ్మ శిఖరాగ్రంలో ఉంచి, ఇంట్లోనే ఒక మూల పవిత్ర స్థలంలో పెడతారు. ధూప దీప నైవేద్య సహితంగా బ్రతుకమ్మను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మొదటిరోజు తులసి ఆకుల్లో పోక చెక్కలు పూజ వద్దపెడ్తారు. ప్రతిరోజు సమీప దేవాలయం వద్ద సాయంత్రం వేళల్లో ముత్తయిదువలైన మహిళలంతా బ్రతుకమ్మలతో చేరి వాటిని ఒకచోట చేర్చి, చుట్టూరా నిల్చొని చేతిలో చెయ్యేస్తూ బ్రతుకమ్మ పాటలు పాడుతారు. మొదటి రోజు నుంచి వరుసగా ఎనిమిది రోజులు ఈ విధంగా గుడి ఆవరణలో బ్రతుకమ్మ ఆడి, బ్రతుకమ్మను అక్కడే కోనేరు విడిచిపెట్టి ఇళ్లకు చేరుతారు. ఈ వరుస దినాల్లో ‘ఆరవరోజు అర్రెం’ అంటూ ఆ రోజు ఆడరు. ఈ తొమ్మిది రోజులు బ్రతుక్మ సంబంధించిన విశేషాలతో మమిళల హడావుడి ఇంతా అంతా కాదు. పెళ్ళయిన మహిలలు తల్లివారింట ఈ తొమ్మిది రోజులు ఉండటం వారు కోరినవన్ని తల్లిదండ్రులు తీర్చటం సంతోషంగా భావిస్తారు. కొత్త దుస్తులు, చీరలు, రవికెలు, పిల్లలకు కొత్త దుస్తులు, కొత్త నగలు చేయించుకోవటాలు, పిండివంటలు, ఫలహారాలతో తెలంగాణా ఇండ్లలో సందడి ర్యామేలుతుంది.

పిల్లలున్న వాళ్ళు కూడా ఈ రెండు బ్రతుకమ్మలను పేరుస్తారు కాబట్టి తల్లి బ్రతుకమ్మ, పిల్ల బ్రతుకమ్మ అని పేర్చుకోవడం శుభం, మంగళదాయకంగా భావిస్తారు. రోజూలాగే వెదురు శిబ్బిలో పిల్ల బ్రతుకమ్మ, అంచులున్న వెడల్పాటి పళ్ళెంలో తల్లి బ్రతుకమ్మ పేరుస్తారు. చద్దుల బ్రతుకమ్మను కొన్నిచోట్ల రెండు రోజులు పేరుస్తారు. తంగేడు పూవు, గునుగు పూవ్వుతో పేర్చి, మరునాటి దినం చద్దుల బ్రతుకమ్మ రోజు మిగతా పూలతో అలంకరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని కులాల వారు చద్దుల బ్రతుకమ్మ రోజు బ్రతుకమ్మకు తమ మాంగళ్యం చల్లగా ఉండాలని కోరుతూ పుస్తెలు, మట్టెలు కూడా చేయించి గౌరమ్మతో పెట్టి పూజిస్తారు. ఉదయంతోనే నిద్రలేచి కొత్త దుస్తులు ధరించి బ్రతుకమ్మలను పేర్చి, గౌరమ్మను పసుపు ముద్దతో చేసి, బ్రతుకమ్మ శిఖర భాగంలో ఉంచి ఇంట్లో దేవుని గదిలో పెట్టి ధూపదీప నైవేద్య సహితంగా భక్తితో పూజిస్తారు. నువ్వులు, మొక్కజొన్న, సజ్జలు,గోధుమలు, పల్లీలు, పెసర్ల పొడుములు తయారుచేస్తారు. కొత్తగా పండిన సజ్జలతో బెల్లం, నెయ్యి కల్పి రుచికరమైన సద్దులను తయారుచేస్తారు. వీటిని బ్రతుక్మకు నైవేద్యంగా సమర్పించి పూజిస్తారు.మహిళలు సాయంత్రం ఏవళ కదిలిన కడలి కెరాటాల్లా ఊరి చెరువు వద్దకు బ్రత్న్నుమ్మను ఆడేందుకు కదుల్తారు. పెద్ద బ్రతుకమ్మను పెద్దలు, పిల్ల బ్రతుకమ్మలను పిల్లల చేత బట్టి చెరువు వద్దకు వెళ్తారు. తోడుగా మరికొన్ని విడిపూలు కూడా తెచ్చుకుంటారు. బ్రతుకమ్మలను తెచ్చేప్పుడు పూవులు నేలపై రాలకుండా జాగ్రత్తపడతారు. బ్రతుకమ్మలు తీసుకెళ్ళే సమయాల్లో పూవులు నేల రాలితే అశుభంగా భావిస్తారు. బ్రతుకమ్మలు పెద్దవైతే పురుషుల చేత మోయిస్తారు.

మహిళలందరూ తాము తెచ్చిన బ్రతుకమ్మలను ఒకచోట చేర్చి గుంపులు, గుంపులుగా నిల్చొని, బ్రతుకమ్మల చుట్టూర తిరుగుతూ, చేతుల్లో చేయి వేస్తూ లయబద్దంఆ కదుల్తూ, పాటలు పాడుతారు. తమ వెంట విడిగా తెచ్చిన పూవులన ఒక్కొక్కటి ఆ బ్రతుకమ్మ)పై వేస్తూ పాటలు ప్రారంభిస్తారు. బాగా పాడగలిగిన ముత్తయిదువు ముందు పాటందుకుంటే మిగతా ముత్తయిదువులు ‘కోరస్‌’ ఇస్తూ పాటను పూర్తి చేస్తారు. ఈ విధమైన బృందగానాలతో ఆ చెరువు పరిసర ప్రాంతాలు దద్ధరిల్లుతాయి.

‘‘ఒక్కొక్క పూవేసి చందమామ – ఒక జామయ్యే చందమామ
శివుడింక రాడాయే చందమామ – రెండు జాములయే చందమామ
రెండేసి పూలేసి చందమామ – శివుని పూజల వేళాయే చందమామ’’
అంటూ పాటలు పూర్తిచేస్తారు.
బ్రతుకమ్మల చుట్టూ వలయాకారంలో ఒకరి చేతులు మరొకరు పట్టుకొని మానవహారంలా ఉండి, దాని చుట్టూ గుండ్రంగా తిరుగతూ పాటలు పాడుతారు.ఇలా కొద్దిసేపు పాడిన తరువాత ఒకరి చేతులతో మరొకరు కోలాటం వలే చప్పట్లు కొట్టుకుంటూ పాటలను లయబద్ధంగా పాడుతూ దానికి అనుగుణంగా నృత్యం చేస్తూ ఆనందిస్తారు. మొదట కుడికాలు కదిలిస్తూ కుడా నుండి ఎడమకు తిరుగుతూ చేసే నృత్యంలో వయస్సు భేదాలు లేకుండా అందరూ పాల్గొని ఆనందిస్తారు. తమతో పాటు తాము పూజిస్తున్న దేవతలూ కలిసి మెలిసి ఆడుతున్నారని వారు భావిస్తారు.

‘‘పోయిరా మాయమ్మా – పోయిరావమ్మా!
పోయి నీ అత్తింట బుద్దికలిగుండూ
ఎవరేమన్ననూ ఎదురాడకమ్మా!
మాట లెన్నన్నానూ మారాడకమ్మా!

వీధిలో నిలుచుండి తలతిప్పకమ్మా!
పది మందిలో నీవు పలు విప్పకమ్మా!
మాయమ్మ లక్ష్మీదేవి పోయిరావమ్మా!
మళ్ళీనాటికి తోలుకత్త మాయమ్మా!

అంటూ వీడ్కోలు పాటలతో నిమజ్జనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు.మేళతాళాలతో ఊరేగింపుగా బ్రతుక్మన గౌరమ్మ యుక్తంగా పుస్తెలు, మట్టెలు, రవికె బట్టలతో కూడా నీటిలో నిమజ్జనం చేస్తారు. నీటిలో విడిచిపెట్ట్పడు చాలా జాగ్రత్తగా సిబ్బిలను, పళ్ళెలను నాఇ అడుగు భాగాల నుండి తీస్తారు. తరువాత నీటిపై ధూప దీపాలతో తేలియడుతూ గౌరమ్మ సహితంగా కదలి వెళ్థున్న బ్రతుకమ్మను నీటితో కదిలించి దూరంగా వెళ్ళేలా చేస్తారు. నిమజ్జనం తరువాతనే ఇక ఉంటాయి.. మహిళలు స్వేచ్ఛగా చెపుకునే కబుర్లు, వదినా మరదళ్ల ఆటలు…

చెరువు గట్టుమీద వరుసగా నిలబడి తమ చేతుల్లో ఉన్న శిబ్బిలను కనబడకుండా తాము ధరించిన వస్త్రాలలో, చీరచాటున, కొంగు చాటున దాచుకోవటం చేస్తారు. దాచుకోవడటం తప్పిందా.. సిబ్బి కన్పించేలా పట్టుకుంటే వదిన వరసయిన వారితో సరదా దెబ్బలు తినటం ఖాయం. అనేక రకాలైన సందర్భోచిత పాటలుపాడుకుంటూ ఆనందిస్తారు. వారు తెచ్చుకున్న సద్దులను (ఐదు రకాల పొడులు) ఐదుగురు ముత్తయిదువులకు పంచటం, తాము కూడా ఐదుగురు ముత్తయిదువల వద్ద నుంచి తీసుకోవడం, అక్కడే తినటం చేస్తారు. మిగలింది అక్కడే పంచివేస్తారే తప్ప ఇంటికి తీసుకురారు.బ్రతుకమ్మ పండుగను చేసుకునేప్పుడు అనేకాంశాలకు చెందిన పాటలు పాడుతుంటారు. సీతారాములు, లక్ష్మీదేవి, గౌరమ్మ వంటి అనేక దేవుళ్లను స్తుతిస్తూ వేల సంఖ్యలో బ్రతుకమ్మ పాటలు తెలంగాణా మహిళల నాలుకలపై నాట్యమాడుతుంటాయి. కేవలం నమ్మకం మాత్రమే నడిపించే బ్రతుకమ్మ పండుగ తెలంగాణా జిల్లాల్ని ఆ తొమ్మిది రోజులు ఆనంద డోలికల్లో ముంచి, మహిళలు మళ్ళీ బ్రతుకమ్మ ఎప్పుడొస్తుందా అని ఎదురుచేసేలా చేసే చద్దుల బ్రతుకమ్మ నిమజ్జనంతో ఈ వేడుకలు ముగుస్తాయి.

narsingou vimala
నర్సింగోజు విమల

Leave a Reply