Take a fresh look at your lifestyle.

రైతులు పండించిన ప్రతీ గింజకు.. మద్దతు ధర

cultivated by farmers support Price

  • 44లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం సేకరణ
  • పౌరసరఫరాల శాఖ ద్వారా 3669 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
  •  ఈ సీజన్‌లో రైతుల ఖాతాలోకి రూ. 7830 కోట్లు  

రైతలు పండించిన ప్రతీ గింజకు మద్దతు ధర లభించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ద్వారా 3669 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. డిసెంబర్‌ -2019 ‌నాటికి 8లక్షల మంది రైతుల నుంచి 44లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ ధాన్యం విలువ రూ.7830 కోట్లు. ఇప్పటివరకు 30లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. నవంబర్‌ ‌నుంచి వానాకాలం పంటలు అంచనాలకు మించి ధాన్యపు రాశులు మార్కెట్‌ ‌యార్డులకు వచ్చాయి. వరి,పత్తి, మిర్చి, మొక్కజొన్న రాశులతో రాష్ట్రంలోని మార్కెట్‌లు నిండిపోయాయి.ప్రధానంగా సూర్యాపేట, ఖమ్మం, వరంగల్‌, ‌నిజామాబాద్‌, ‌కరీంనగర్‌, ‌భువనగిరి మార్కెట్‌ ‌యార్డులు ధాన్యంతో, రైతులతో కిటకిటలాడుతున్నాయి.ఈనామ్‌ ‌విధానం అమలులోకి వచ్చినప్పటికీ, సాంకేతికమైన లోపాలు ఉండటంతో రైతులకు సకాలంలో అందవలసిన ప్రయోజనాలు అందడంలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే రాష్ట్ర పౌర సరఫరాల విభాగం మాత్రం ధాన్యం కొనుగోలు చేసిన వారం పదిరోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమచేస్తున్నామని పేర్కొంటున్నది. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా వాటిని వెంటనే పరిష్కరిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి హామీ ఇచ్చారు. దీనితో చాలా మార్కెట్‌ ‌యార్డుల్లో ఫిర్యాడులు వెల్లువెత్తాయి, జిల్లాల కలెక్టర్‌లు వేగంగా స్పందించి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించారు. దీనితో ఖరీఫ్‌లో ఈ సారి రికార్డు స్థాయిలో 44 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం కొనుగోలు చేయగలిగారు. గత ఏడాది ఖరీఫ్‌లో పౌరసరఫరాల సంస్థ 9లక్షల మంది రైతుల నుంచి 40.41లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.

ముఖ్యకార్యదర్శి అనేక మార్కెట్‌యార్డులు తనఖీ చేయడంతో సత్ఫలితాలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం నాణ్యతను నిర్ధారించే అధికారుల కొరత ఉండటంతో రైతుల ధాన్యం విక్రయించేందుకు ఎక్కువ రోజులు పట్టింది.అయినప్పటికీ ధాన్యానికి తగిన గిట్టుబాటు ధన లభించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.రైతులకు డబ్బులు వేగంగా చెల్లించేందుకు వీలుగా (ఆన్‌లైన్‌ ‌ప్రొక్యూర్‌మెంట్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌సిస్టమ్‌ (ఓపిఎంఎస్‌) ‌విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. రైతులు తేమశాతం పైన శ్రద్దవహించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం తేమశాతం 17 కన్నా తక్కువ శాతం ఉన్న ధాన్యానికి ఎక్కువ ధర లభిస్తుందనే విషయాలను రైతులకు అవగాహన కల్పించారు.పౌరసరఫరాల విభాగంలో టోల్‌‌ఫ్రీ నెంబర్లు అందుబాటులోకి తెచ్చారు. యాసంగిలో కూడా ఉత్తరతెలంగాణలోకి చాలా చెరువులకు ప్రాజెక్ట్‌లకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌ద్వారా నీరు పుష్కలంగా వచ్చినందున వరినాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏప్రిల్‌ ‌నాటికి ధాన్యం మార్కెట్‌ ‌యార్డులకు వస్తుందనే అంచనాలతో అధికారులు కావాల్సిన సదుపాయాలను కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ఈ ఏడాది మక్క జొన్న , తేజ మిర్చిరైతులకు ఊహించిన విధంగానే మద్దతు ధర లభిస్తున్నది. మక్కజొన్న రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. మార్కెఫెడ్‌ ‌కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 1760లు ప్రకటించింది. ప్రైవేట్‌ ‌వ్యాపారస్తులు కనీసధర కన్నా ఎక్కువ ధర చెల్లించి రైతుల నుంచి మొక్కజొన్నలను కొన్నారు. ఒకదశలో ప్రైవేట్‌ ‌వ్యాపారస్తులు క్వింటాలుకు రూ2300 వరకు చెల్లించి కొనుగోలు చేశారు. సూర్యాపేట, కేసముద్రం మార్కెట్‌ ‌యార్డుల్లో మక్కజొన్నకు మంచి ధర లభించింది. తేజరకం మిర్చికి లాభదాయకమైన కనీస మద్దతు ధర లభిస్తున్నది.. వరంగల్‌ ‌మార్కెట్‌ ‌తేజ రకం మిర్చితో నిండిపోయింది. క్వింటాలుకు రూ.15వేల నుంచి రూ.18వేల వరకు ధర పలుకుతున్నది. దళారులు,మధ్యవర్తులు లేకుండా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. 2016-17 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు 45.37లక్షల మంది రైతులకు రూ. 38వేల కోట్లను నేరుగా ఖాతాలో జమచేశారు.

Tags: yasangi, Private businesses, market yard, govt of telangana

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy