Take a fresh look at your lifestyle.

ఇటలీ కి క్యూబా వైద్య బృందం 

ఇటలీ  కి క్యూబా వైద్య బృందం
అమెరికా,ఇటలీ, బ్రిటన్, జర్మనీలు కూడా అవకాశం వచ్చినప్పుడల్లా క్యూబాపై ఆంక్షలు విధిస్తూ హంగామా చేస్తుంటాయి. కరోనా పుణ్యమా అని ఈ ద్వేషం మాయమైంది. అంతే కాకుండా ‘మీ డాక్టర్లను మా దేశానికి పంపండి  అంటూ  క్యూబా ను కోరాయి .5 వేల మందిపైకగా కరోనా మరణాలు నమోదైన ఇటలీలో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో డాక్టర్ల_దేశంగా పేరొందిన  క్యూబాను శరణవేడింది. క్యూబా కూడా పాత విద్వేషాలు పట్టించుకోకుండా “మానవసేవ_మాధవసేవ” అంటూ తన డాక్టర్ల బృందాన్ని ఇటలీకి వంపింది. వీరు ఇటలీలో విమానం దిగుతుండగా జనం చప్పట్లలో అభినందించారు.సోషల్ మీడియాలోనూ క్యూబన్లపై ప్రశంసల వర్షం కురిపించారు.
కరోనాకు సరిహద్దులు లేవు… కమ్యూనిజానికి కూడా సరిహద్దులు లేవంటూ  కొనియాడుతున్నారు.త్వరలో మరిన్ని_టీంలు క్యూబా నుంచి రానున్నాయి.క్యూబా డాక్టర్ల వైద్యసేవలకు పెట్టింది పేరు.
తమ దేశంలోనే కాకుండా విపత్తు ఎదుర్కొంటున్న విదేశాలకు క్యూబా డాక్టర్లు సేవాహస్తం అందిస్తుంటారు.ఇటువంటి రోగాలు ప్రబలిన సమయంలో సాటి దేశాలను ఆదుకోవడంలో క్యూబా ముందు వరుసలో నిలుస్తోంది.”హైతీలో” కలరా సోకినప్పుడు, పశ్చిమాసియాల్లో “ఎబోలా” ప్రబలినప్పుడు…. ఆ దేశం వైద్య బృందాలను పంపి సాయం చేసింది.
1960 నుంచి క్యూబాపై అమెరికా అనేక ఆంక్షలు, నిర్బందాలు కొనసాగుతున్న సంగతి యావత్ ప్రపంచానికి తెలిసిందే , అయినప్పటికీ మనో నిబ్బరంతో సిద్ధాంతిక పటిమతో ప్రజా శ్రేయస్సే తమ ధ్యేయంగా అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతోంది క్యూబా ..\నేడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న “కరోనా మహమ్మారి” నుండి మమ్మల్ని రక్షించండి అంటూ ఇటలీ సాయం కోరగానే క్యూబాతో పాటూ చైనా కూడా స్పందించింది.  వెంటనే డాక్టర్ల బృందాన్ని, అవసరమైన మందులను పంపించింది. రష్యా కూడా డాక్టర్ల బృందాన్ని, మందులను పంపిస్తోంది. భారత్ కూడా మందులు, ఇతర వైద్య సామాగ్రిని పంపించింది.
“కోటి_జనాభా” ఉన్న క్యూబాలో లక్షకుపైగా డాక్టర్లు ఉన్నారు. క్యూబాలో వైద్య వృత్తిని ఎంచుకునే యువత ఎక్కువుగా ఉండటమే కాదు.. విపత్కర పరిస్దితులలో
సరిహద్దులుకు అతీతంగా వైద్య సేవలు అందించడంలో ముందుండే వారు క్యూబా వైద్యులే. “మానవత్వమే పరమావిధిగా” దేశాల మధ్య ఉన్న వైరాన్ని కూడా విడిచి వైద్య సేవలు అందిస్తున్నారు క్యూబా వైద్యులు

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy