మలక్‌పేటలో సిఎస్ పర్యటన
- పరిస్థితులపై స్థానికులతో
- ఆరాతీసిన ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్
కరోనా వైరస్ కేసులు నమోదైన మలక్‌పేటలోని కంటైన్‌మెంట్ ప్రదేశాల్లో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ పర్యటించారు. కంటైన్‌మెంట్ ప్రదేశాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. కంటైన్‌మెంట్ జోన్‌లో ఉన్న ఓల్డ్ మలక్‌పేటలో 750 ఇళ్లలోని సభ్యులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేశామని చెప్పారు. నిత్యావసర సరుకులు అవసరమైనవారు వాట్సాప్ గ్రూప్‌లో పెట్టాలని సూచించారు.
కంటైన్‌మెంట్ జోన్ ప్రవేశ, నిష్కమ్రణ ద్వారాలు మూసేశామని వెల్లడించారు. ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారని, జ్వరం, దగ్గు, శ్వాస సమస్యల గురించి తెలుసుకుంటున్నారని చెప్పారు. కంటైన్‌మెంట్ జోన్లలో కొత్త కేసులు రాకుంటే నిబంధనలు సడలిస్తామని వెల్లడించారు. నగరంలో ఇప్పటికే 16 కంటైన్‌మెంట్లను ఎత్తివేశామని చెప్పారు. సీఎస్‌తోపాటు పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, జీఎంహెంసీ కమిషన్, స్థానిక ఎమ్మెల్యే బలాల ఉన్నారు.