Take a fresh look at your lifestyle.

‌గ్రూప్‌ 4 ‌నోటిఫికేషన్‌పై సన్నాహక సమావేశం నిర్వహించిన సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌

‌హైదరాబాద్‌, ‌మే 19 : రాష్ట్రంలో గ్రూప్‌ 4 ‌పోస్టుల నోటిఫికేషన్‌ ‌జారీపై గురువారం బీఆర్కేఆర్‌ ‌భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి అధికారుల సమావేశం జరిగింది. గ్రూప్‌ 4 ‌కేడర్‌ ‌కింద త్వరలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం పోస్టులు స్థానికులకే కేటాయించడం జరిగిందని, మిగిలిన ఐదు శాతం కూడా స్థానికులకే దక్కుతాయని ఈ సందర్భంగా సిఎస్‌. అన్నారు. ఇటీవల, గ్రూప్‌ 1 ‌కింద 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ‌జారీ చేయడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల పక్రియను ప్రారంభించింది.

పోలీసు రిక్రూట్‌మెంట్‌ ‌పక్రియ కూడా కొనసాగుతుండగా, విద్యాశాఖకు కూడా టెట్‌ ‌నిర్వహణకు క్లియరెన్స్ ఇచ్చినట్లు సిఎస్‌ ‌తెలిపారు. గ్రూప్‌ 4 ‌కు సంబంధించి రోస్టర్‌ ‌పాయింట్ల వివరాలతో పాటు సంబంధిత సమాచారాన్ని ఈ నెల 29లోగా పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌కు అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. అన్ని జూనియర్‌ అసిస్టెంట్‌ ‌లేదా తత్సమాన పోస్టులను డైరెక్ట్ ‌రిక్రూట్‌మెంట్‌ ‌కోసం నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆయన ఆదేశించారు.

- Advertisement -

సీనియర్‌ అసిస్టెంట్‌, ‌సూపరింటెండెంట్‌ ‌క్యాడర్‌లలో ఖాళీలను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసి, తద్వారా ఏర్పడ్డ జూనియర్‌ అసిస్టెంట్‌ ‌ఖాళీలను కూడా నోటిఫై చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశానికి టిఎస్‌పిఎస్‌సి ఛైర్మెన్‌ ‌డా. బి. జనార్దన్‌ ‌రెడ్డి, వివధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు మరియు ఇతర ఉన్నత అధికారులు హాజరయ్యారు.

Leave a Reply