Take a fresh look at your lifestyle.

కరోనా వ్యాక్సిన్‌ ‌తీసుకున్న సిఎస్‌ ఆదిత్యనాథ్‌ ‌దాస్‌

‌ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్‌ ‌దాస్‌ ‌కరోనా వ్యాక్సిన్‌ ‌వేయించుకున్నారు. సచివాలయం మూడవ భవనంలోని డిస్పెన్సరీలో బుధవారం ఆయన కోవాక్సిన్‌  ‌మొదటి డోస్‌ ‌వేయించుకున్నారు. మరలా నాలుగు వారాల అనంతరం రెండవ డోస్‌ ఇం‌జక్సన్‌ ‌వేయించుకోవాల్సి ఉంది.
వ్యాక్సిన్‌ ‌తీసుకున్న అనంతరం సిఎస్‌ ఆదిత్యానాధ్‌ ‌దాస్‌ అరగంట పాటు డిప్సెన్సరీలోని అబ్జర్వేషన్‌ ‌రూమ్‌లో ఉన్నారు.  తదుపరి తన కార్యాలయానికి చేరుకున్నారు.  ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ జెడి డా.శ్రీహరి,గుంటూరు డిఎంఅండ్‌ ‌హెచ్చ్ఓ  ‌డా.యాస్మిన్‌, ‌డిపిఎంఓ డా.మన్మోహన్‌,‌డిస్పెన్సరీ వైద్యులు డా.నాగ చక్రవర్తి,డా.గీతా కణ్యాళ్‌, ‌సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామి రెడ్డి,ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply