Take a fresh look at your lifestyle.

సీఎస్‌ ‌తప్పుడు సమాచారం..!

  • సోమేశ్‌ ‌కుమార్‌ ‌పై కూడా భట్టి విమర్శలు
  • కొరోనా తో రాష్ట్రం అతలాకుతలం
  • కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం మొద్దునిద్ర
  • ఆక్సిజన్‌ ‌లేక చస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం
  • కొరోనాను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలి: భట్టి

హైదరాబాద్‌,‌మే5: కొరోనా బారిన పడి రాష్ట్రమంతా అతలాకుతలం అయిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో కొరోనా పరిస్థితులపై ఆయన బుధవారం వి•డియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొరోనా ఉద్ధృతి పెరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందని విమర్శించారు. కొరోనా బాధితులు ఆక్సిజన్‌ ‌లేక చనిపోతున్నారని, హాస్పిటల్స్ ‌ల్లో బెడ్లుంటే ఇంజెక్షన్‌ ఉం‌డడం లేదని, ఇంజెక్షన్‌ ఉం‌టే ఆక్సిజన్‌ అం‌దుబాటులో లేదని, వెంటిలేటర్లు ఉన్న చోట టెక్నీషయన్లు లేరని అన్నారు. టెస్టులు సరిగాచేయడం లేదని, వ్యాక్సిన్‌ ‌పంపిణీ కూడా సరిగ్గా జరగడం లేదని అన్నారు. కొరోనా సంక్షోభంలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సింది పోయి, అర్దాంతరంగా ఆరోగ్య మంత్రిని తీసేశారని మండిపడ్డారు. సీఎం తన దగ్గర వైద్య, ఆరోగ్య శాఖ పెట్టుకుని ఏం రివ్యూ చేశారని భట్టి ప్రశ్నించారు. కొరోనానీ ఆరోగ్యశ్రీ లో చేర్చుతామని శాసనసభలో మాటిచ్చిన ముఖ్యమంత్రి దానిని మరిచిపోయారని మండిపడ్డారు.

కొరోనా•• సీఎం ఏడాది క్రితం వేసిన టాస్క్ ‌ఫోర్స్ ఎటు పోయిందని ప్రశ్నించారు. సీఎం ముందు బయటకు వచ్చి ప్రజల పరిస్థితి అర్దం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్‌ ‌కుమార్‌ ‌పై కూడా భట్టి విమర్శలు చేసారు. రాష్ట్రంలోని హాస్పిటల్స్ ‌ల్లో మందులు, ఆక్సిజన్‌ ‌సహా అన్నీ ఉన్నాయని సీఎస్‌ అన్న వ్యాఖ్యలను గుర్తు చేసిన భట్టి బాధ్యత గలిగిన అధికారి అబద్దాలు చెప్పడం ఎంటి అని ఫైర్‌ అయ్యారు. అన్ని బాగుంటే ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్స్ ‌లో అంబులెన్స్ ‌లు ఎందుకు సమయానికి అందుబాటులో లేవో చెప్పాలన్నారు. రా హాస్పిటల్స్ ‌తిరుగుదాం..! అని సీఎస్‌కు భట్టి సవాల్‌ ‌విసిరారు. జనం సొమ్ముతో జీతాలు తీసుకునే వి•రు? ప్రజలు సేవ చేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎస్‌ ‌తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలకు ఇబ్బంది పెట్టొద్దని అన్నారు. ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్‌కు ఫీజులు ఖరారు చేయాలని.. ప్రజలను దోపిడీ చేసే హాస్పిటల్స్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని భట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేసారు.

ప్రభుత్వానికి సహకరించడానికి తాము సిద్దంగా ఉన్నామని, సీఎం ముందు బయటకు వచ్చి అన్ని పార్టీలను కలుపుకుని పోవాలని సూచించారు. కొరోనా వి•ద కలిసి కట్టుగా యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు.తెలంగాణలో సరైన కోవిడ్‌ ‌పరీక్షలు లేవని, వ్యాక్సినేషన్‌ ‌ప్రణాళిక కూడా ఏమాత్రం లేదని సీఎల్పీ నాయకుడు మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. కొరోనాకు సరైన వైద్యం అందక ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ‌తానే రివ్యూ చేస్తానని అంటారని, కానీ ఫాం హౌజ్‌లో ఉంటారని మండిపడ్డారు. ఇంతటి క్లిష్ట సమయంలో ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్ ‌ప్రజలను దోచుకుంటున్నాయని, అయినా పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం మేల్కొనాలని కోరారు. త్వరలోనే ఈ విషయాన్ని తాము గవర్నర్‌ ‌దృష్టికి తీసుకెళ్తామని విక్రమార్క తెలిపారు.

Leave a Reply