Take a fresh look at your lifestyle.

‌క్రిప్టో కరెన్సీ పట్ల అప్రమత్తత అవసరం

  • అది యువతను నాశనం చేసే అవకాశం
  • అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూడడానికి అన్ని దేశాలు కలిసిరావాలి
  • ప్రపంచదేశాలకు ప్రధాని మోదీ హెచ్చరిక

ప్రస్తుతం ప్రతి రంగంలోనూ ఎన్నో సంస్కరణలు వొస్తున్నాయని, నేటి తరంలో టెక్నాలజీ, డేటా నూతన ఆయుధాలుగా మారుతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. మన చుట్టూ ఉన్న ప్రతి దానినీ డిజిటల్‌ ‌శకం మార్చేస్తుందని..రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలకు కొత్త అర్థాలు చెబుతుందని ప్రధాని తెలిపారు. అంతేకాదు పాలన, విలువలు, చట్టం, హక్కులు, భద్రత తదితర అంశాలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతుందని చెప్పారు. అభివృద్ధి, సంపదకు అవకాశాలు కల్పించడంతో పాటు అధికారం, నాయకత్వానికి కొత్త రూపు తెస్తుందని పేర్కొన్నారు.

ఇదే సమయంలో మనం కొత్త ప్రమాదాలను కూడా ఎదుర్కోవాల్సి వొస్త్తుందని.. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ చెలామణిలోకి వొస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ తొలిసారి ఆ అంశంపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అసాంఘిక శక్తుల చేతుల్లోకి క్రిప్టో కరెన్సీ వెళ్లకుండా ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య దేశాలు కలిసి ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. డిజిటల్‌ ‌కరెన్సీపై భారత్‌ ఇం‌కా ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. కానీ క్రిప్టో వల్ల యువత చెడిపోయే ప్రమాదం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. ద సిడ్నీ డయలాగ్‌ ‌సదస్సులో పాల్గొన్న ఆయన కీలకోపన్యాసం చేశారు.

ఆస్ట్రేలియా వేదికగా ‘ది సిడ్నీ డైలాగ్‌’ ‌సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని..‘ఇండియా టెక్నాలజీ : ఎవల్యూషన్‌ అం‌డ్‌ ‌రివల్యూషన్‌’ అనే అంశంపై ఆయన కీలక ప్రసంగం చేశారు.  భారత్‌లో క్రిప్టోపై ఎలా ముందుకు వెళ్లాలని ఇటీవల మోదీ..బ్యాంకింగ్‌ అధికారులతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఆయన వార్నింగ్‌ ‌సందేశం ఇచ్చారు. మనీల్యాండరింగ్‌కు, టెర్రర్‌ ‌ఫైనాన్సింగ్‌కు క్రిప్టో మార్కెట్లకు వేదికగా మారుతున వైనంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీ, డేటాలు ఇప్పుడు కొత్త ఆయుధాలుగా మారుతున్నాయని, అందుకే డేటా గవర్నెన్స్‌లో ప్రజాస్వామ్య దేశాలు సహకరించుకోవాలన్నారు. క్రిప్టోకరెన్సీ లేడా బిట్‌కాయిన్‌ ‌గురించి ప్రస్తావిస్తే, అన్ని ప్రజాస్వామ్య దేశాలు ఈ అంశంపై కలిసి పనిచేయాలని, క్రిప్టోలు చెడ్డవారి చేతుల్లోకి వెళ్లకుండా చూడాలని, ఎందుకుంటే అది మన యువతను నాశనం చేసే అవకాశం ఉన్నట్లు మోదీ హెచ్చరించారు.

క్రిప్టో పెట్టుబడుల విషయంలో భారత ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. డిజిటల్‌ ‌యుగం మనం చుట్టు ఉన్న అన్నింటినీ మార్చేస్తుందని, రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, సమాజం అన్ని మారిపోయినట్లు మోదీ తెలిపారు. సౌభ్రాతృత్వం, పరిపాలన, నీతి, చట్టాలు, హక్కులు, భద్రత అన్నింటిపై డిజిటల్‌ ‌ప్రభావం పడినట్లు ప్రధాని తెలిపారు. డిజిటలైజేషన్‌తో అంతర్జాతీయ పోటీతత్వంలోనూ మార్పు వొచ్చిందన్నారు.

Leave a Reply