Take a fresh look at your lifestyle.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల, జనవరి 27 : కలియుగ ప్రత్యక్ష దైవమైన ఏడుకొండలస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఏటీజీహెచ్‌ ‌వరకు భక్తులు క్యూలైన్లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 36 గంటల్లో సర్వదర్శనం లభిస్తుందని టీటీడీ అధికారులు తెలిపారు. గురువారం 58,379 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 28,950 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.73 కోట్లు వచ్చిందని అధికారులు వివరించారు. శనివారం  రథసప్తమి సందర్భంగా తిరుపతిలోని కౌంటర్లలో సర్వ దర్శనం టైంస్లాట్‌ ‌టోకెన్లు రద్దు చేశారు.

భక్తులు ఆ రోజున వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ‌ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలని తెలిపారు. వీఐపీ బ్రేక్‌, ఆర్జిత సేవలు, వృద్ధులు, దివ్యాంగులు తదితర ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు వెల్లడించారు.నేడు తిరుమలలో ప్రత్యేక పూజలు…రథసప్తమి సందర్భంగా ప్రత్యేక వాహన సేవలు…ప్రత్యేక దర్శనాలు రద్దు సూర్య జయంతి సందర్భంగా నేడు తిరుమలలో రథసప్తమిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.  రథసప్తమి వేడుకలను సజావుగా నిర్వహించాలని టిటిడి ఇవో ధర్మారెడ్డి ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా చేపట్టిన ఏర్పాట్లను తెలియజేశారు. శ్రీ మలయప్పస్వామి సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చందప్రభ వాహనాలపై ఉదయం నుండి రాత్రి వరకు ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. మధ్యాహ్నం చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తిరుపతిలోని కౌంటర్లలో సర్వ దర్శనం టైమ్‌ ‌స్లాట్‌ ‌టోకెన్లు రద్దు చేయడమైనది.

భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ‌ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలి. విఐపి బ్రేక్‌, ఆర్జిత సేవలు, వృద్ధులు, దివ్యాంగులు తదితర ప్రత్యేక దర్శనాలు రద్దు చేసారు. తిరుమలలోని గ్యాలరీలు, వైకుంఠం క్యూ కాంప్లెక్సు-1, 2, నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్లు, మినీ అన్నప్రసాదం కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, టి, కాఫీ, పాలు పంపిణీ చేస్తారు. వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్, ‌పిఎసి-2, 4, వైకుంఠం క్యూ కాంప్లెక్సులో అన్నప్రసాద వితరణతో పాటు గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు లక్ష మజ్జిగ ప్యాకెట్లు, రెండు లక్షల పానీయాలు, ఒక లక్ష పులిహోర ప్యాకెట్లతోపాటు 7-8 లక్షల ఆహార పొట్లాలు పంపిణీ చేస్తారు. ప్రస్తుతం ఉన్న 230 కుళాయిలు, 178 డ్రమ్ములు కాకుండా మాడ వీధుల్లోని గ్యాలరీలలో 408 పాయింట్ల వద్ద తాగునీటి పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టిటిడి శ్రీ వేంకటేశ్వర బాలమందిరం నుండి 130 మంది విద్యార్థులు సూర్యప్రభ వాహనంలో ఆదిత్య హృదయం పారాయణం చేస్తారు.

Leave a Reply