Take a fresh look at your lifestyle.

పంటల ప్రణాళికలు సరే.. పంటల బీమా మాటేమిటి?

“అడవి జంతువుల వల్ల నష్టం జరిగినా, విద్యుత్‌ ‌షాక్‌ ‌వల్ల ప్రజలు, పశువులు మరణించినా, పిడుగుల వల్ల పశువులు, మనుషులు మరణించినా, నష్ట పరిహారం అందించేందుకు ప్రభుత్వం తెచ్చిన జీ.వో ల గురించి, గ్రామీణ ప్రజలనేకమందికి సమాచారమే లేదు. ప్రభుత్వం ఆ జీ.వోల ను తెలుగులోకి  అనువాధం చేసి, ప్రజలలో ప్రచారమే చేయలేదు. ఫలితంగా ఎక్కువమంది గ్రామీణ ప్రజలు ఆ జీ.వోల ఆధారంగా పరిహారం పొందలేకపోతున్నారు.”

వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా, సీజన్లన్నీ అతలాకుతలమైపోయాయి. వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం అంటూ స్పష్టంగా గీతలు గీయలేని పరిస్థితి ఏర్పడింది. కరువు, వర్షాభావ పరిస్థితులు, తక్కువ వర్షాలు, భారీ వర్షాలు, వడగండ్ల వానలు, భీకర గాలులు, వడగాల్పులు, వరదలు, తుపాన్లు.. ఒకటేమిటి, ఒక్కోసారి అన్నీ ఒకే సీజన్‌ ‌లో కనిపిస్తూ రైతులకు నష్టం చేస్తున్నాయి. అడవి జంతువులు చేసే విధ్వంసం తో పాటుప్రభుత్వ అధికారుల అవినీతి, కాంట్రాక్టర్ల లాభాపేక్షకలిసి, నీటిపారుదల కట్టడాలలో నాణ్యత లేని తనం వల్ల కట్టలు తెగి జరిగే నష్టం కూడా ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ వ్యవసాయ దారులు, పశుపోషకులు ఈ ప్రకృతి వైపరీత్యాల విలయ తాండవానికి, ఆస్థులను, పశువులను, పంటలను, చివరికి ప్రాణాలను కోల్పోతున్నారు. ఆదాయలు రాక, అప్పులు తీరక, ఆర్థికంగా చితికి పోతున్నారు.

ప్రభుత్వాలు దయతలచి, జరిగిన నష్టాన్ని లెక్కిస్తేనే ఆ కుటుంబాలకు ఏదైనా పరిహారం పంటలకు ఇన్‌ ‌పుట్‌ ‌సబ్సీడీరూపంలో అందుతుంది. పశువులకు బీమా రూపంలో అందుతుంది. ప్రభుత్వం కళ్లు మూసుకు కూర్చుంటే, నష్టపోయిన రైతాంగానికి ఏ పరిహారం అందదు. అడవి జంతువుల వల్ల నష్టం జరిగినా, విద్యుత్‌ ‌షాక్‌ ‌వల్ల ప్రజలు, పశువులు మరణించినా, పిడుగుల వల్ల పశువులు, మనుషులు మరణించినా, నష్ట పరిహారం అందించేందుకు ప్రభుత్వం తెచ్చిన జీ.వో ల గురించి, గ్రామీణ ప్రజలనేకమందికి సమాచారమే లేదు. ప్రభుత్వం ఆ జీ.వోల ను తెలుగులోకి అనువాధం చేసి, ప్రజలలో ప్రచారమే చేయలేదు. ఫలితంగా ఎక్కువమంది గ్రామీణ ప్రజలు ఆ జీ.వోల ఆధారంగా పరిహారం పొందలేకపోతున్నారు. వీటన్నిటి కంటే, అత్యంత ముఖ్యమైనవి పంటల బీమా పథకాలు. గత 30 ఏళ్లుగా పంటల బీమా పథకాలు,ఇంకా పైలట్‌ ‌దశలోనే మిగిలిపోతున్నాయంటే, ప్రభుత్వాలకు గ్రామీణ రైతాంగం పట్ల ఉన్న నిర్లక్ష్య వైఖరే కారణం. జాతీయ వ్యవసాయ బీమా పథకం(చీו) కొంతకాలం అమలైనా, దానిలో వున్న నిబంధనల వల్ల ఎక్కువమంది రైతులు బీమా పరిధిలోకి రాలేకపోయారు. మొత్తం రైతులలో బీమా పరిధిలోకి వచ్చిన రైతుల సంఖ్య ఎప్పుడూ 10 శాతం దాటలేదు. పరిహారం పరంగా ఈ పథకం రైతులను పెద్దగా ఆదుకోలేదు. అనేక లోపాలతో నడిచిన ఈ పథకం రైతుల విశ్వాసాన్ని పొందలేకపోయింది.

ఈ నేపథ్యంలో 2016 లో కేంద్ర ప్రభుత్వం ‘‘ప్రధానమంత్రి ఫసల్‌ ‌బీమా యోజన(జూఎ••) పేరుతో కొత్త పంటల బీమా పథకాన్ని తెచ్చింది. ఈ పథకం లోనే’’ వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం(ఔదీו)’’ ఒక ప్రత్యేక భాగంగా ఉంది. ఈ రెండు పథకాలకూ మార్గదర్శకాలు రూపొందించినా, ఈ పథకాల గురించి, కేంద్ర ప్రభుత్వం ఆడంబరంగా ప్రచారం చేసుకున్నా, అంతిమంగా ఈ పథకాలు కూడా రైతుల విశ్వాసాన్ని పొందలేకపోయాయి. వ్యవసాయ రంగం లోకి ప్రైవేట్‌ ‌బీమా కంపెనీలు వచ్చాయి. ప్రీమియం రేట్లు భారీగా పెరిగిపోయాయి. బీమా పరిహారం మొత్తంలో ఆహార పంటలకు 2 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం మాత్రమే రైతులు ప్రీమియంగా చెల్లిస్తే సరిపోతుందని చెప్పినా, ప్రభుత్వ బడ్జెట్‌ ‌ల నుండి ఈ బీమా కంపెనీలకు వేల కోట్లు ధోచి పెట్టారు. రైతులు, ప్రభుత్వాలు కలిసి కట్టిన ప్రీమియం ఎక్కువ. రైతులకు అందిన పరిహారం తక్కువ. పి.యం.ఎఫ్‌.‌బి.వై పథకానికి, పంటకోత పరీక్షల ఆధారంగా వచ్చే సగటు దిగుబడులు మాత్రమే ఆధారం. రాష్ట్ర స్థాయిలోకానీ, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కానీ, ఈ పంటకోత పరీక్షల ఫలితాలు ప్రజల ముందు పారదర్శకంగా లేవు. పైగా జిల్లాల, మండలాల విభజన తర్వాత, గత 7 సంవత్సరాల పంట కోత పరీక్షల వివరాలు గందరగోళంగా తయారయ్యాయి. వ్యవసాయ శాఖ కూడా వాటిని =•× క్రింద కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.

పైగా ప్రతి జిల్లాలో ఆయా పంటల విస్తీర్ణంలో 25 శాతానికి మించిన విస్తీర్ణం ఉన్న అన్నిపంటలకు ఈ పథకం క్రింద గ్రామం యూనిట్‌ ‌గా బీమా పథకం అమలు చేయాలని మార్గదర్శకాలు చెబుతున్నా, ప్రభుత్వం ఇప్పటికీ జిల్లాకు ఒక్క పంటను మాత్రమే గ్రామం యూనిట్‌ ‌గా అమలు చేస్తున్నది. మిగిలిన పంటలన్నీ మండలం యూనిట్‌ ‌గా ఉన్నాయి. ఫలితంగా రైతులకు సరైన పరిహారం అందడం లేదు. పంటల బీమా నోటిఫికేషన్‌ ‌తయారీలో రైతులకు, రైతు సంఘాలకు ఏ మాత్రం భాగస్వామ్యం ఉండడం లేదు. కంపెనీలు, అధికారులు స్టార్‌ ‌హోటళ్లలో రహస్య సమావేశాలు జరుపుకుని విధి విధానాలు రూపొందిస్తున్నారు. గత సంవత్సరం వరి పంట విషయంలో చేసిన మార్పు వల్ల వేలాది మంది వరి రైతులు , భారీ వర్షాల కారణంగా పంట మునిగి నష్టపోయినా, పరిహారం పొందలేకపోయారు. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం, తెలంగాణా రాష్ట్రంలో పత్తి రైతులకు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంది. పత్తి ప్రీమియం రేట్లు, ఎక్కువగా ఉన్నా, కనీసం 4 సందర్భాలలో బీమా పరిధిలోకి వచ్చిన రైతులకు ఎంతో కొంత పరిహారం అందుతున్నది.

వరుసగా 3 రోజుల పాటు భారీ వర్షాలు, ఒక నెలలో నిర్ధేశించిన వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం, వరుసగా 15 నుండి 29 రోజుల పాటు వర్షం లేకపోవడం, ఉష్టోగ్రతలు తక్కువగా నమోదు కావడం లాంటి సందర్భాలలో కనీసం హెక్టారుకు 3 వేల రూపాయల నుండి మొత్తంగా హెక్టారుకు 29 వేల రూపాయల వరకూ రైతులకు పరిహారం అందే అవకాశం ఉంది. ఈ రెండు బీమా పథకాలు కూడా బీమా ప్రీమియం చెల్లింపు గడువులోపల ప్రీమియం చెల్లించిన రైతులకు మాత్రమే వర్తిస్థాయి. బ్యాంకులు ఈ గడువులోపల పంట రుణాల పంపిణీ చేయకపోవడం, రైతులు స్వయంగా ప్రీమియం కట్టకపోవడం వల్ల, ఎక్కువమంది రైతులు బీమా పరిధిలోకి రావడం లేదు. నష్టపోయిన సందర్భాలలో వీరికి పరిహారం అందడం లేదు. 2019 ఖరీఫ్‌ ‌లో ‘రైతుబంధు’’ పథకం లబ్దిదారులు తెలంగాణా రాష్ట్రంలో 44,92,000 మంది కాగా, వీఖీదీ• పథకం పరిధిలోకి వచ్చిన రైతులు 5,41,750 మంది, ఔదీו పథకం పరిధిలోకి వచ్చిన రైతులు 2,73,890 మంది, మొత్తంగా 8.15,640 మంది రైతులు మాత్రమే పంట బీమా పరిధిలోకి వచ్చారు. విస్తీర్ణ పరంగా కేవలం 7,80,000 హెక్టార్లు మాత్రమే బీమా పరిధిలోకి వచ్చింది. పంటల బీమా ప్రీమియంలు తగ్గించి, ఎక్కువ మంది రైతులను బీమా పరిధిలోకి తీసుకురావాల్సిన కేంద్ర ప్రభుత్వం, 2020 ఖరీప్‌ ‌నాటికి, మార్గదర్శకాలు పూర్తిగా మార్చేసింది. పంటల రుణాలకు, బీమా ప్రీమియం చెల్లింపుకు ఉన్న లింక్‌ ‌తెంపేసింది. ప్రీమియం చెల్లించాలా? లేదా అనేది రైతుల ఇష్టానికి వదిలేసింది. పైగా, బీమా ప్రీమియం మొత్తంలో తన వాటాగా చెల్లించాల్సిన 50 శాతం మొత్తాన్ని 30 శాతానికి తగ్గించింది. తన వాటాలో తగ్గిన మిగిలిన ప్రీమియం ఎవరు చెల్లించాలో ఎక్కడా స్పష్టం చేయలేదు.

ఇదే అదనుగా తీసుకుని, తెలంగాణా రాష్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఖరీఫ్‌ ‌నుండి వీఖీదీ• పంటల బీమా పథకాన్ని తాము అమలు చేయబోమని, కేంద్రానికి చెప్పేసింది. అలా అని రాష్ట్ర రైతుల కోసం కొత్త పంటల బీమా పథకాన్నీ ప్రకటించలేదు. ఆంధప్రదేశ్‌ ‌లో మాత్రం అక్కడి ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని రైతుల పక్షాన తానే చెల్లించి రాష్ట్ర సచివాలయాల ద్వారా రైతుల నుండి ఒక్క రూపాయి మాత్రమే వసూలు చేసుకుని పేర్లు నమోదు చేసుకుంటున్నది. తెలంగాణాలో పత్తి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. కానీ, ప్రకృతి వైపరీత్యాలకు ఎక్కువ ప్రభావితమయ్యే ఈ పత్తి పంటకు ఈ సారి బీమా పథకం లేదు. ఏ మాత్రం వాతావరణ పరిస్థితులలో మార్పులొచ్చినా, రైతులు పంట నష్టపోతారు. అప్పుడు ఆదుకునే బీమా కూడా లేకపోతే, రైతులు మళ్లీ అప్పుల ఊబిలో కూరుకుపోతారు. సకాలంలో, సరిపోయినంత వర్షాలు పడితే ఫరవాలేదు. కానీ, తేడా వస్తే ప్రమాదం, అందుకే ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో పంటల బీమా పథకాలను వెంటనే ప్రకటించాలి.

1.అందుకోసం ప్రభుత్వరంగంలో ఒక బీమా కంపెనీని ఏర్పరచాలి.
2.బీమా మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ప్రధాన పంటలన్నింటినీ గ్రామం యూనిట్‌ ‌గా బీమా పరిధిలోకి తేవాలి.
3.వరిపంట నీట మునిగిన సందర్భంలో కూడా బీమా వర్తింపచేయాలి.
4.ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి, కౌలు, పోడు రైతులతో సహా, రైతులందరినీ బీమా పరిధిలోకి తేవాలి.
5.పంట కోత పరీక్షల తరువాత సగటు దిగుబడులను ప్రజల ముందు ఉంచాలి. 6.మండలాల వారీగా, నెలల వారీగా సగటు వర్షపాతం వివరాలను, రోజువారీ వర్షపాతం వివరాలను ప్రజలముందు ఉంచాలి.
7.పంటలకు, మనుషులకు, పశువులకు నష్టం జరిగిన సందర్భాలలో పరిహారం అందించేందుకు ఉన్న అన్ని జీవోలకు విస్త్రత ప్రచారం కల్పించాలి.
8. వీణ రూపొందించిన నూతన కరువు యాజమాన్య మాన్యువల్‌ ‌ను, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించి అమలు చేయాలి.

-కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక, ఫోన్‌ : 9912928422

Leave a Reply