Take a fresh look at your lifestyle.

చెరువులా మారిన పంట పొలాలు.. పూర్తిగా జలమైన వ్యవసాయ క్షేత్రం 

  • ఓ రైతు బిడ్డ ఆవేదన…చిన్న వయసులోనే ఆకాశమంత ఆలోచనలతో తన గోడును వినిపించిన బడతడు.
  •  పూర్తిగా జలమయమైన ఆరు ఎకరాల పొలాన్ని చూపిస్తూ తన ఆవేదనవెళ్ళిబుచ్చాడు అరుణ్ అనే  పిల్లోడు
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అరూర్ గ్రామానికి చెందిన అరుణ్ అనే పిల్లోడు తన గోడును వినిపిస్తున్నాడు  వ్యవసాయాన్ని నమ్ముకుని ఆరుగాలం శ్రమించి కష్టపడి అప్పులు చేసి మరీ పంట పండిస్తే తీరా  పంట చేతికొచ్చే సమయానికి గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణం గా వరదలు వచ్చిచేరి ఆరు ఎకరాల్లో వేసుకున్న పంట పూర్తిగా నీట మునిగింది.
 వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అరూర్ గ్రామానికి చెందిన ఓ రైతు కొడుకు అరుణ్ తమ వ్యవసాయ పొలంలో వచ్చి చేరిన నీటిలో ఈదుతూ చిన్న వయసులో పెద్ద మనస్తత్వం తో తన ఆవేదన వ్యక్తం చేశాడు తమకున్న ఆరేకరాల పొలం  వర్షాల దాటికి వరద నీరు చేరి పూర్తిగా జలమైందని చెరువును తలపిస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని చూపిస్తూ వివరించాడు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వేడుకొంటున్నాడు జిల్లా కలెక్టర్ స్పందించి ఇకపై అయినా ఇలా జరుగకుండా చూడాలని వేడుకొంటున్నాడు తన కుటుంభం కేవలం వ్యవసాయం పై ఆధార పడి ఉందంటూ ఆవేదన వెళ్ళిబుచ్చుతున్నాడు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply