Take a fresh look at your lifestyle.

పంట మార్పిడి వల్ల భూసారము తగ్గదు : కలెక్టర్‌

రైతులు భూములలో పంట మార్పిడి చేసుకోవడం వలన భూ సారము తగ్గకుండా ఉంటుందని అని జిల్లా కలెక్టర్‌ ‌రవి గుగులోత్‌ అన్నారు .శుక్రవారం జిల్లాలో పంట మార్పిడి పై కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్‌ ‌జి. రవి తన ఛాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ జిల్లాలో రైతులు వారి భూములలో సాగు చేస్తున్న సమయంలో ఒకే పంట ప్రతి సంవత్సరము వేస్తున్నారని అందువల్ల దిగుబడి తగ్గుతుందని, ఫర్టిలైజర్‌ ఎక్కువ ఉపయోగించడంతో , సారవంతమైన భూములు భూసారం తగ్గుతుందని అన్నారు. అందువలన ఇట్టి విషయాలను రైతులకు తెలియజెప్పి రైతులను చైతన్యం పరచాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో సాగు చేయు చున్న విస్తీర్ణంలో రైతులు ఖరీఫ్‌ ‌మరియు రబీ లో ఏ ఏ పంటలు వేశారు , వాటి వివరాలను గ్రామాల వారిగా, మండలాల వారీగా తయారుచేసి ఇవ్వాలని అన్నారు. రైతులు పంట మార్పిడి చేసుకోకపోవడం వల్ల వచ్చే నష్టాలను పంట మార్పిడి చేయడంవల్ల రైతులకు వచ్చే దిగుబడి గురించి తెలియపరచాలని అన్నారు. ఏఏ గ్రామాలలో ఏ ఏ పంటకు అనువుగా ఉన్నాయో రైతులకు వివరించి ప్రణాళిక తయారు చేయాలని తెలిపారు. రైతులు పంట మార్పిడి చేసినట్లయితే వారికి కావలసిన విత్తనాలు , ఎరువులు వివరాలను ఇవ్వాలని అన్నారు.ఈ సమావేశములో జిల్లా అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌బి రాజేశం, లీడ్‌ ‌బ్యాంక్‌ ‌మేనేజర్‌ ‌గౌతం లక్ష్మీనారాయణ, డి పి ఓ రామానుజాచారి, జిల్లా హార్టికల్చర్‌ అధికారి ప్రతాప్‌, ‌వ్యవసాయ అధికారి సురేష్‌ ‌కుమార్‌, ‌సి పి ఓ మల్లికార్జున్‌, ‌జిల్లా మార్క్ఫెడ్‌ అధికారి దివ్యభారతి తదితరులు పాల్గొన్నారు.

ఎర్లీ బర్డ్ ‌పథకం ద్వారా ఆస్తి పన్ను చెల్లింపులపై
5 శాతము తగ్గింపు : అదనపు కలెక్టర్‌ ‌రాజేశం
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో 2020 – 21 సంవత్సరమునకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎర్లీ బర్డ్ ‌పథకం ద్వారా ఆస్తి పన్ను చెల్లింపులపై 5 శాతము తగ్గింపు ప్రకటించిందని దీనిని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆదనపు కలెక్టర్‌ ‌రాజేశం అన్నారు. శుక్రవారంజిల్లాలోని మున్సిపాలిటీలలో ఆస్తి పన్ను 2020 – 21 సంవత్సరం నకు మే 31 వరకు చెల్లించిన వారికి ప్రభుత్వము 5 శాతము తగ్గింపు చేసిందని జిల్లా అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌బి. రాజేశం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరమునకు గాను జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలో 82.43 లక్షలు ఇప్పటివరకు ముందస్తు ఆస్తి పన్ను వసూలు అయిందని, జిల్లాలో 27, 363 మంది ముందస్తు ఆస్తి పన్నుకు అర్హులుగా ఉన్నారని అన్నారు. ఇట్టి తగ్గింపు నివాస గృహాలకు, వాణిజ్య దుకాణాలకు వర్తిస్తుందన్నారు. మే 31 లోపల పన్ను చెల్లించాలన్నారు, గత సంవత్సరము బకాయిలు ఉండకూడదన్నారు. కావున జిల్లాలోని 5 మున్సిపాలిటీలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పన్నులు చెల్లించాలని కోరారు.

Leave a Reply